2002లో ‘ఈశ్వర్’ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రభాస్.. ‘వర్షం’తో ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఒక్క అడుగు అంటూ ‘ఛత్రపతి’తో టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు. డార్లింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్ చిత్రాలతో ఫ్యామిలీ ఆడియెన్స్‌ను అలరించిన ఆయన.. బాహుబలి 1, 2లతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లు కొల్లగొట్టాడు. ఇక సలార్, కల్కిలతో పాన్ ఇండియా లెవల్లో సత్తాచాటాడు. దేశవ్యాప్తంగా ‘డార్లింగ్’గా.. పాన్ ఇండియా లెవల్లో ‘రెబల్ స్టార్’గా అందరి హృదయాలను దోచుకున్న ప్రభాస్…