దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి చేదు అనుభవం ఎదురైంది. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, బీహార్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి ప్రతికూలంగా ఫలితాలు వచ్చాయి. పశ్చిమ బెంగాల్‌లో అసన్సోల్ లోక్‌సభతో పాటు బాలీంగజ్ అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో.. శతృఘ్నసిన్హా (తృణమూల్ కాంగ్రెస్), బాబుల్ సుప్రియో (తృణమూల్ కాంగ్రెస్) విజయం సాధించారు. అస్సనోల్ లోక్‌సభను గతంలో బీజేపీ గెలుచుకుంది. ఇప్పుడు ఉప ఎన్నికల్లో ఆ స్థానం అధికార పార్టీ టీఎంసీ వశమైంది.…