TMC: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ లూయిజిన్హో ఫలేరో తన రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఆయన టీఎంసీ పార్టీకి కూడా రాజీనామా చేశారు. టీఎంసీ తన జాతీయ పార్టీ హోదాను కోల్పోయినట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించిన మరుసటి రోజే ఈ పరిణామం సంభవించింది.
పశ్చిమ బెంగాల్ లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి భారత ఎన్నికల సంఘం భారీ షాక్ ఇచ్చింది. టీఎంసీ జాతీయ పార్టీ హోదాను రద్దు చేసింది. ఈ నేపథ్యంలో టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం ప్రత్యామ్నాయ మార్గంపై దృష్టిపెట్టారు. ఈ విషయంలో న్యాయపరంగా ఎదుర్కోవాలని యోచిస్తోంది.
పశ్చిమ బెంగాల్లో శుక్రవారం రెండు దారుణ ఘటనలు చోటుచేసుకున్నాయి. ఓ ఘటనలో తృణమూల్ కాంగ్రెస్ నాయకుడితో పాటు అతడి కుటుంబసభ్యులు హత్యకు గురికాగా.. మరో ఘటనలో పార్టీ మద్దతుదారు హత్యకు గురయ్యారు. ఓ ఘటన ఉత్తర బెంగాల్లో జరగగా.. మరొకటి నదియా జిల్లాలో జరిగింది.
రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు రావట్లేవంటూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రెండు రోజుల పాటు ధర్నా చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ధర్నా సందర్భంగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి తన గాత్రంతో ఆకట్టుకున్నారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, బీజేపీ నేత సువేందు అధికారి ఈ రోజు కేంద్రానికి వ్యతిరేకంగా రెండు రోజుల నిరసన దీక్షను ప్రకటించిన తర్వాత ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై మండిపడ్డారు.
బిల్కిస్ బానో అత్యాచారం కేసులో దోషుల్లో ఒకరు శనివారం గుజరాత్ లో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేతో వేదిక పంచుకున్నారు. ఈ విషయంపై భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా ట్విట్టర్ వేదికగా స్పందించారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో ఇవాళ సమావేశమయ్యారు. లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఇద్దరు బీజేపీయేతర ముఖ్యమంత్రులు భేటీ కావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
తృణమూల్ కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుని కేంద్ర సంస్థల దుర్వినియోగానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ సోమవారం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అయితే మోషన్‌ను చదివే సమయంలో తమ సభ్యులు అసెంబ్లీకి హాజరుకావడం అవినీతి కేసులకు మద్దతు ఇచ్చినట్లే అవుతుందని పేర్కొంటూ బీజేపీ సభను వాకౌట్ చేసింది.
త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు, సాగర్దిఘి ఉపఎన్నికల్లో విజయం సాధించలేకపోయిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ.. తమ పార్టీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ పొత్తు లేకుండా పోటీ చేస్తుందని చెప్పారు.
బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లాలోని మార్గ్రామ్ వద్ద బాంబు పేలింది. ఈ పేలుడులో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్త మరణించగా.. పంచాయతీ పెద్ద గాయపడడం రాజకీయ వర్గాల్లో వాగ్వాదానికి దారితీసింది.