బిల్కిస్ బానో అత్యాచారం కేసులో దోషుల్లో ఒకరు శనివారం గుజరాత్ లో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేతో వేదిక పంచుకున్నారు. ఈ విషయంపై భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా ట్విట్టర్ వేదికగా స్పందించారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో ఇవాళ సమావేశమయ్యారు. లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఇద్దరు బీజేపీయేతర ముఖ్యమంత్రులు భేటీ కావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
తృణమూల్ కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుని కేంద్ర సంస్థల దుర్వినియోగానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ సోమవారం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అయితే మోషన్‌ను చదివే సమయంలో తమ సభ్యులు అసెంబ్లీకి హాజరుకావడం అవినీతి కేసులకు మద్దతు ఇచ్చినట్లే అవుతుందని పేర్కొంటూ బీజేపీ సభను వాకౌట్ చేసింది.
త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు, సాగర్దిఘి ఉపఎన్నికల్లో విజయం సాధించలేకపోయిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ.. తమ పార్టీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ పొత్తు లేకుండా పోటీ చేస్తుందని చెప్పారు.
బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లాలోని మార్గ్రామ్ వద్ద బాంబు పేలింది. ఈ పేలుడులో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్త మరణించగా.. పంచాయతీ పెద్ద గాయపడడం రాజకీయ వర్గాల్లో వాగ్వాదానికి దారితీసింది.
Bomb Blast : పశ్చిమబెంగాల్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.తూర్పు మేదినీపూర్‌లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) నాయకుడి ఇంటిపై జరిగిన బాంబు పేలుడులో ముగ్గురు మరణించారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీకి మరోసారి మద్దతుగా నిలిచారు. కేంద్రంలోని బీజేపీ సర్కారుపై మండిపడ్డారు. కుట్రపూరిత రాజకీయాలతోనే సౌరభ్ గంగూలీని ఐసీసీ ఛైర్మన్ పదవికి నామినేట్ చేయలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ స్థానంలో రోజర్ బిన్నీ బాధ్యతలు చేపట్టనున్నారనే వార్తల నేపథ్యంలో బీజేపీపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. గంగూలీని పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు విఫలమైనందు వల్లే మాజీ కెప్టెన్‌ను అవమానపరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించింది.
బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి బీజేపీ గట్టి షాకిచ్చింది. నందిగ్రామ్‌లోని ఓ సహకార సంఘానికి జరిగిన ఎన్నికల్లో మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.