Viral Video: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. పార్టీ మారినందుకు కొందరు గిరిజన మహిళలకు శిక్ష విధించారు. రాజకీయాల్లో పెద్దపెద్ద నాయకులు పార్టలు మారితే దిక్కులేదు కానీ.. చిన్న స్థాయి నాయకులు.. మామూలు మండల, గ్రామీణ స్థాయి నాయకులు పార్టీ మారితే భారీ శిక్షలు విధించడం గమనార్హం. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పశ్చిమ బెంగాల్‌లో పార్టీ మారినందుకు తృణమూల్ కాంగ్రెస్‌కి చెందిన కొందరు గిరిజన మహిళలకు శిక్ష విధించారు. సమాజంలో ఇంకా అణగారిన వర్గాలకి చెందిన వాళ్లపై అమానుషంగా ప్రవర్తించడంపై బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు. ఇదంతా తృణమూల్ కాంగ్రెస్‌కి చెందిన గూండాల పనే అంటూ మండిపడుతున్నారు.
Read Also: DR. BR.Ambedkar: డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద అంతరిక్షంలో నక్షత్రం
టీఎంసీకి చెందిన ఆరుగురు మహిళలు బీజేపీలో చేరినందుకు గ్రామంలో కిలో మీటర్ వరకు రోడ్డుపై సాస్టాంగ ప్రదక్షిణలు చేయించారు. వెస్ట్ బెంగాల్ బాలూర్‌ఘాట్ లోక్‌సభ నియోజకవర్గంలోని గిరిజన కుటుంబాలకు చెందిన సుమారు 200 మంది తృణమూల్ కాంగ్రెస్ నాయకులు ఏప్రిల్ 6న బిజెపిలో చేరారు. వాళ్లు పార్టీ మారడం టీఎంసీలోని ఓ వర్గానికి నచ్చలేదు. దీంతో తపన్‌లోని తపన్ గోఫానగర్‌కు చెందిన మార్టినా కిస్కు, షియులీ మార్డి, థక్రాన్ సోరెన్, మాలతీ ముర్ము అనే గిరిజన మహిళలను టీఎంసీకి చెందిన కొందరు మహిళలకు గ్రామంలో నడిరోడ్డుపై సాస్టాంగ ప్రదక్షిణలు యించారు. సుమారు కిలో మీటర్ వరకు మహిళలు జనం చూస్తుండగా రోడ్డుపై సాస్టాంగ ప్రదక్షిణలు చేసారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ కావడంతో ఈఘటనపై పూర్తి విచారణ చేపట్టింది నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ .ఇంతటి అమానవీయంగా ప్రవర్తించిన వారిని కఠినంగా శిక్షించాలని బీజేపీ నేతలు సైతం ఫిర్యాదు చేశారు.
Martina Kisku, Shiuli Mardi, Thakran Soren and Malati Murmu, resident of Tapan Gofanagar, Tapan, joined BJP yesterday. They belong to ST community.
Today, TMC goons forced them to return to TMC and punished them by asking to do Dandavat Parikrama. pic.twitter.com/eks61eD2EP
— Dr. Sukanta Majumdar (@DrSukantaBJP) April 7, 2023