సీనియర్ జర్నలిస్ట్ అండా రామారావు ఇక లేరు అన్న వార్త ఆయన ఆత్మీయులను, సన్నిహితులను, స్నేహితులను దుఃఖసాగరంలో ముంచి వేసింది. అందరితోనూ ఎంతో సఖ్యంగాఉంటూ అభిమానం ప్రదర్శించేవారు అండా రామారావు. అందుకే ఆయన అందరికీ అభిమాన పాత్రుడు అయ్యారు. చదువుకొనే రోజుల నుంచీ సినిమాలంటే రామారావుకు ఎంతో ఇష్టం. యన్టీఆర్, సావిత్రి ఆయన అభిమాన నటులు. ఇక గానగంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వరరావు అంటే ప్రాణం. పింగళి, సముద్రాల, మల్లాది, శ్రీశ్రీ, ఆరుద్ర, ఆత్రేయ, దేవులపల్లి, సినారె, వేటూరి,…