అందరివాడు అండా రామారావు కన్నుమూత!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీనియర్ జర్నలిస్ట్ అండా రామారావు ఇక లేరు అన్న వార్త ఆయన ఆత్మీయులను, సన్నిహితులను, స్నేహితులను దుఃఖసాగరంలో ముంచి వేసింది. అందరితోనూ ఎంతో సఖ్యంగాఉంటూ అభిమానం ప్రదర్శించేవారు అండా రామారావు. అందుకే ఆయన అందరికీ అభిమాన పాత్రుడు అయ్యారు. చదువుకొనే రోజుల నుంచీ సినిమాలంటే రామారావుకు ఎంతో ఇష్టం. యన్టీఆర్, సావిత్రి ఆయన అభిమాన నటులు. ఇక గానగంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వరరావు అంటే ప్రాణం. పింగళి, సముద్రాల, మల్లాది, శ్రీశ్రీ, ఆరుద్ర, ఆత్రేయ, దేవులపల్లి, సినారె, వేటూరి, సీతారామశాస్త్రి సాహిత్యాలన్నా ఆయనకు ఎంతో ఇష్టం. ఎంతోమంది సాహితీవేత్తలతో రామారావు సన్నిహితంగా ఉండేవారు. కర్నూలు జిల్లా ఆదోనిలో జన్మించిన రామారావు డిగ్రీ పూర్తయ్యాక బి.ఎడ్., చేయాలనుకున్నారు. కానీ, జర్నలిజంపై మనసు లాగడంతో ఈనాడులో చేరారు. సబ్ ఎడిటర్ గా,సీనియర్ సబ్ గా అక్కడ బాధ్యతలు నిర్వర్తించారు. తరువాత ఉదయం పత్రిక ప్రారంభం కావడంతో అందులో చేరారు. అక్కడ కూడా పలు బాధ్యతలు నిర్వహించి, ఎడిషన్ ఇన్ ఛార్జ్ గానూ పనిచేశారు. హైదరాబాద్ వచ్చి ఉదయంలో సినిమా పేజీ ఇన్ ఛార్జ్ గా వ్యవహరించారు. ఉదయం దిన పత్రిక మూతపడడంతో అదే సమయంలో బి.ఏ.రాజు, జయ ప్రారంభించిన సూపర్ హిట్సినిమా మేగజైన్ లో సీనియర్ రిపోర్టర్ గా పనిచేశారు. 1996లో అండా రామారావుకు గుండె పోటు వచ్చినప్పుడు సహ ఉద్యోగులు, పరిచయ పాత్రికేయులు అందరూ ఆయనకు నైతిక బలం అందించారు. ఆ విషయాన్ని అండా రామారావు పదే పదే చెప్పుకొనేవారు.
Read Also : కాదంబరి కిరణ్ ఉచిత ఆంబులెన్స్ సేవలు
Also Read
- Sarah Shahi: బెడ్రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ బాల్తోనే.. బోల్డ్ సీన్స్ అసలు గుట్టు విప్పిన హీరోయిన్!
- Tollywood: లాస్ట్ మినిట్ టెన్షన్స్.. చిన్న సినిమాల మేకర్స్ కి ఏమైంది?
- Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Dragon Update: 'డ్రాగన్' డెడ్‌లైన్ మిస్సైతే..!
ఘంటసాల అంటే వీరాభిమానం ఉన్న అండా రామారావు, ఆయనపై పలు వ్యాసాలు రాశారు. తరువాతి రోజుల్లో కొందరి సహకారంతో మీ ఘంటసాల పుస్తకాన్ని తెచ్చారు. సంగీతం అంటే ఎంతో అభిమానం ప్రదర్శించే రామారావు మ్యూజిక్ ఛానల్ అనే మాస పత్రికను కొద్ది రోజులు నడిపారు. ఆ తరువాత నుంచీ ఎమ్.ఎస్.రెడ్డి వద్ద పి.ఆర్.ఓ.గా ఉన్నారు. ప్రముఖ నిర్మాత, యువచిత్ర అధినేత కె.మురారి తెలుగు నిర్మాతల చరిత్ర పుస్తకం తీసుకురావడంలో రామారావు కూడా పలువురు నిర్మాతల చరిత్రలు రాసి సహకరించారు. గత సంవత్సరం హైదరాబాద్ నుండి స్వస్థలం మకాం మార్చిన అండా రామారావు, ఘంటసాల గానామృతం అనే వాట్సప్ గ్రూప్ కు అడ్మిన్ గా వ్యవహరిస్తూ ఘంటసాల అభిమానులకు ఆనందం పంచుతూవచ్చారు. అలాగే యుగపురుషుడు యన్టీఆర్ అనే వాట్సప్ గ్రూప్ నూ ఇటీవలే ఆరంభించారు. అనేక పాత చిత్రాల విశేషాలను అందరికీ అందించాలని అండా రామారావు తపించేవారు. అందుకోసమే ఈ గ్రూపులు అని భావించవచ్చు. అలాంటి రామారావు ఆదివారం (జూలై 11న) ఉదయం 11.30 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబసభ్యులకు మనోబలం చేకూరాలని పలువురు పాత్రికేయులు తమ సంతాపంలో వ్యక్తంచేశారు.
తాజావార్తలు
-
Sarah Shahi: బెడ్రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ బాల్తోనే.. బోల్డ్ సీన్స్ అసలు గుట్టు విప్పిన హీరోయిన్!
-
Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
-
Sanju Samson: ఇక ఫెయిల్ అవ్వడు.. హాఫ్ సెంచరీలే.. సంజు శాంసన్‌పై సన్నీ కీలక వ్యాఖ్యలు!
-
Tollywood: లాస్ట్ మినిట్ టెన్షన్స్.. చిన్న సినిమాల మేకర్స్ కి ఏమైంది?
-
Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!