తెలంగాణ రాష్ట్రంలో గిరిజన బిడ్డలు ఎస్టీలు.. మహారాష్ట్రలో బీసీలు. ఇంకో చోట ఓసీలు కూడా ఉన్నారు.. ఇలా రకరకాలుగా విభజనలో ఉన్నారు. ఇక దేశ వ్యాప్తంగా ఉండే గిరిజన బిడ్డలందరికీ సమాన హోదా వచ్చే కార్యక్రమానికి జాతీయ స్థాయిలో మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. హైదారబాద్ బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 10లో నూతనంగా నిర్మించిన సేవాలాల్ బంజారా భవన్‌ను ప్రారంభించిన అనంతరం సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఇవాళ బంజారాహిల్స్‌లో ఇంత చక్కటి…
మరోసారి పోడు సాగుపై అధికారులు మరోసారి కన్నెర్ర చేశారు. పోడు సాగు చేసుకుంటున్న గిరిజనులపై దాడులు చేశారు. గిరిజన మహిళలపై బెల్ట్ తో అధికారులు దాడులు చేయడం కలకలం రేపుతోంది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. చంద్రుగొండ మండలం ఎర్రబోడు గ్రామంలో పోడు చేసుకుంటున్న గిరిజన మహిళలపై ఫారెస్ట్ అధికారులు బెల్ట్ తో దాడి చేశారు. వ్యవసాయ పనులు ప్రారంభం కావడంతో గతంలో లాగే పోడు వ్యవసాయం చేసేందుకు గిరిజనులు సన్నద్ధం అయిన…
జీవనాధారం తాగునీరు. ఏ జీవి అయినా ముందుగా తాగేందుకు నీటి కోసం చూస్తుంది. మనుషులైతే నీరు ఎక్కడ దొరుకుతుందోనని ఎదురుచూస్తుంటాడు. అల్లూరిసీతారామరాజు జిల్లా అరకులోయ పర్యాటకులకు స్వర్గథామం. అయితే అక్కడ వుండే స్థానికులకు మాత్రం ప్రకృతి అందాలు ఏమాత్రం ఆనందాన్ని ఇవ్వవు. తాగేందుకు నీరుంటే వారికి చాలు. అరకులోయ మండలం బస్కీపంచాయతీ రంగినిగూడ గ్రామస్తుల దుస్థితి అంతా ఇంతా కాదు. తాగేందుకు గుక్కెడు నీరు దొరక్క వారు పడుతున్న కష్టాలు అధికారులకు కనిపించడంలేదు. తాగునీటి సమస్య పరిష్కారం…
లాక్ డౌన్.. పేరు చెబితే జనం ఉలిక్కిపడుతుంటారు. కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ విధిస్తే వేలాదిమంది చనిపోయారు. వైరస్ కంటే లాక్ డౌన్ కారణంగా తిండి లేక, తమ స్వస్థలాలకు వెళుతూ దారిలో ప్రాణాలు పోయిన అభాగ్యులెందరో. అయితే శ్రీకాకుళం జిల్లాలోని మారుమూల గిరిజన గ్రామంలో ఇప్పటికీ లాక్ డౌన్ అమలవుతోంది. 8రోజుల పాటు ఎవరూ ఊరి పొలిమేర దాటకుండా… బయటవారిని లోపలికి రానీయకుండా గ్రామస్తులు స్వీయ నిర్భందం విధించుకున్నారు. దుష్టశక్తులు పీడిస్తున్నాయని నమ్మిన జనం,…