ఒకవైపు ఫారెస్ట్ భూములకి పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వ యంతాంగం సర్వేలో జరుగుతున్నప్పటికీ మరోవైపున ఫారెస్ట్ భూముల కోసం గిరిజనుల పోరాటం కొనసాగుతుంది. ఫారెస్ట్ భూములపై పట్టు కోసం వెళ్లిన ఫారెస్ట్ రేంజర్ పై గుత్తి కోయలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. గాయాల పాలైన రేంజర్‌ని కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండలపాడు వద్ద రేంజర్ శ్రీనివాసరావుపై గుత్తి కోయలు వేట కొడవలతో దాడి చేశారు. ఈ దాడిలో శ్రీనివాసరావు తీవ్రంగా గాయాలు ఆయ్యాయి.
Also Read : IND Vs NZ: ‘టై’గా ముగిసిన మూడో టీ20.. సిరీస్ టీమిండియాదే..!!
దీంతో.. శ్రీనివాసరావుకు ఒళ్లంతా రక్తస్రావం అయింది. అయితే.. వెంటనే రేంజర్ శ్రీనివాసరావుని కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో కొత్తగూడెం నుంచి ఖమ్మం తరలించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. బెండలపాడు సమీపంలోని ఎర్రబొడు అటవీ ప్రాంతంలో గతంలో పోడు నరుకుని వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనుల భూముల్లో ఫారెస్ట్ అధికారులు మొక్కలని నాటారు. ఈ నాటిన మొక్కల్ని తొలగించడానికి గిరిజనులు ప్రయత్నాలు చేస్తున్నారు.
Also Read : Bishweswar Tudu : రోజ్ గార్ మేళాలో 200 మందికి నియామక పత్రాలు అందజేత
ఈ విషయంలో పలుమార్లు ఫారెస్ట్ అధికారులకి గిరిజనులకు మధ్య వివాదాలు జరిగాయి. నాడు లాఠీఛార్జి కూడా చేశారు. గిరిజనులపై ఫారెస్ట్ అధికారులు పోలీసులు కూడా దాడులు చేశారు అయినప్పటికీ తమ భూముల్లో పోడు పట్టాలు ఇవ్వకుండా ఫారెస్ట్ అధికారులు ప్లాంటేషన్ చేయటాన్ని నిరసిస్తూ ఈరోజు మళ్లీ గిరిజనులు ప్లాంటేషన్ మొక్కలను ధ్వంసం చేస్తుండగా ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ సిబ్బందికి గిరిజనులకు మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు పై గిరిజనులు వేటకొడవళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో శ్రీనివాసరావుకి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.