మరోసారి పోడు సాగుపై అధికారులు మరోసారి కన్నెర్ర చేశారు. పోడు సాగు చేసుకుంటున్న గిరిజనులపై దాడులు చేశారు. గిరిజన మహిళలపై బెల్ట్ తో అధికారులు దాడులు చేయడం కలకలం రేపుతోంది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. చంద్రుగొండ మండలం ఎర్రబోడు గ్రామంలో పోడు చేసుకుంటున్న గిరిజన మహిళలపై ఫారెస్ట్ అధికారులు బెల్ట్ తో దాడి చేశారు. వ్యవసాయ పనులు ప్రారంభం కావడంతో గతంలో లాగే పోడు వ్యవసాయం చేసేందుకు గిరిజనులు సన్నద్ధం అయిన సందర్భంలో అధికారులు వీరిని అడ్డుకునేందుకు దాడులు చేశారు.
ప్రస్తుతం గిరిజనులు, అధికారుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఈ భూములు ప్రభుత్వానికి చెందినవని ఫారెస్ట్ అధికారులు ట్రెంచ్ కొట్టడానికి ఫారెస్ట్ అధికారులు ప్రయత్నించారు. పోడు భూముల వివాదం భద్రాద్రి జిల్లాలోని చందుగొండ, ముల్కల పల్లిలో ఎక్కువగా జరుగుతున్నాయి. ఒడిశా, చత్తీస్ గఢ్ నుంచి 30 ఏళ్ల క్రితం వచ్చిన గిరిజనులు నివాసం ఏర్పాటు చేసుకుని పోడు వ్యవసాయం చేస్తున్నారు. అయితే దీన్ని ఫారెస్ట్ అధికారులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో ఫారెస్ట్ అధికారులు దాడులు చేశారని గిరిజనులు ఆరోపిస్తున్నారు. అయితే బెల్ట్ తో ఫారెస్ట్ అధికారులు మహిళలపై దాడులు చేయడం కాస్త వివాదాస్పదం అయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటు ములుగు, భూపాలపల్లి, కుమ్రం భీం జిల్లాల్లో పోడు వ్యవసాయం ఎక్కువగా ఉంది.