CM Revanth: మేడారంలో శ్రీ సమ్మక్క, సారలమ్మ అమ్మవార్ల ఆలయ అభివృద్ధి, విస్తరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆలయ పూజారులు, ఆదివాసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అలయ అభివృద్ధి, విస్తరణకు సంబంధించిన ప్రణాళికలు, డిజైన్‌లను అధికారులు పూజారులకు, ఆదివాసీ సంఘాలకు వివరించారు. ఈ ప్రణాళికలపై ఆలయ పూజారులు, ఆదివాసీ సంఘాల ప్రతినిధుల అభిప్రాయాలు తెలుసుకున్న సీఎం, వారి ఏకాభిప్రాయం పొందిన తర్వాతనే పనులు ప్రారంభించాలని నిర్ణయించారు. మేడారంలో ఆలయ…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం జాతర అభివృద్ధి ప్రణాళికలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 23న సీఎం మేడారంకు వెళ్లి క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులను పరిశీలించనున్నారు.
Nagoba Jatara: ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్‌లోని నాగోబా గుడి వద్ద నేడు నాగోబా మహా పూజల జాతర ఘనంగా ప్రారంభం కానుంది. రాత్రి మహాపూజతో జాతర ఆరంభమై ఫిబ్రవరి 4వ తేదీ వరకు కొనసాగుతుంది. మెస్రం వంశీయులు సంప్రదాయరీతిలో ఈ జాతరలో పాల్గొననున్నారు. నాగోబా మహా పూజ ప్రత్యేకంగా నాగోబా దేవుడి పూజార్చనతో ప్రారంభమవుతుంది. మహాపూజ అనంతరం తెల్లవారుజామున కొట్టకోడళ్ళ బేటింగ్ (దేవుడికి పరిచయం చేసే సంప్రదాయం) నిర్వహించనున్నారు. ఇది వంశీయ సంప్రదాయానికి ఎంతో ప్రత్యేకమైన ఆచారం.…