పూర్తి చేసిన రోడ్లకు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ.. ఎక్స్ (ట్విట్టర్)లో ఓ పోస్టు పెట్టారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. "గిరిజన గ్రామాలకు, PVTG ప్రాంతాలకు రహదారులు నిర్మించాలనే ఉద్దేశ్యంతో గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ PM జన్ మన్ పథకం ద్వారా అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండలం, లక్కవరం నుండి చీదిగోంది వరకు సహకారంతో దాదాపు రూ.87.19 లక్షల వ్యయంతో 1.01 కి.మీ…
అల్లూరి జిల్లా అరకులోయ మండలం గన్నెల పంచాయితీ డప్పుగుడ గ్రామంలో గడబంటు భీమన్న(46) హత్యకు గురయ్యాడు. హత్య చేసిన చిట్టపురి పొల్లు అనే వ్యక్తి హత్యకు వాడిన కత్తితో సహా అరకులోయ పోలీస్ స్టేషన్‌లో వెళ్లి లొంగిపోయాడు. హత్యకు ఆర్థిక వ్యవహారాలే కారణమని డిఎస్పీ షేక్ సహాబాజ్ అహమద్ తెలిపారు. ఓ వైపు హత్యకు ఆర్థిక వ్యవహారాలే కారణమని చెబుతుండగా.. గ్రామస్థులు, బంధువులు మాత్రం హత్యకు చేతబడే కారణమని చెపుతున్నారు.
AP Govt: వర్షాకాలం కావడంతో అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలోని ఏజెన్సీ నియోజకవర్గంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో గిరిజన ప్రాంతాల్లో వాగులు దాటి రావాల్సిన చోట నెలలు నిండిన గర్భిణీ స్త్రీలను ముందుగా గుర్తించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలించాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
BJP Celebrations: కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రేపటి నుంచి దేశవ్యాప్తంగా పండగ చేసుకోనుంది. ముఖ్యంగా గిరిజన జనాభా ఎక్కువున్న ప్రాంతాల్లో ఈ ఉత్సవాలను మరింత ఉత్సాహంగా నిర్వహించనుంది.