ప్రస్తుతం దేశవ్యాప్తంగా వందేభారత్ ట్రైన్లు చైర్ కార్స్‌తో నడుస్తున్నాయి. కాగా.. స్లీపర్ వెర్షన్ త్వరలో అందుబాటులోకి రానుంది. స్లీపర్ వందే భారత్ సహాయంతో ప్రయాణీకులు హాయిగా పడుకుని నిద్రపోతూ చాలా దూరం ప్రయాణించవచ్చు. ఈ క్రమంలో.. రైల్వే ప్రయాణికులకు ఇది శుభవార్త లాంటిది. వందే భారత్ స్లీపర్ రైలు ట్రాక్‌పై ట్రయల్‌కు సిద్ధంగా ఉంది. ఈ రైలు ట్రయల్ రన్ త్వరలో ప్రారంభం కానుంది.
భారత్‌లో హైడ్రోజన్‌తో నడిచే రైళ్లు త్వరలో పట్టాలెక్కనుంది. ఈ క్రమంలో.. జర్మనీకి చెందిన TUV-SUD రైలు భద్రతకు సంబంధించి సేఫ్టీ ఆడిట్ నిర్వహించనుంది. ఈ రైలు ట్రయల్ రన్ డిసెంబర్ 2024లో ప్రారంభమవుతుందని సమాచారం. జర్మనీ, ఫ్రాన్స్, స్వీడన్, చైనాలో హైడ్రోజన్ రైళ్లు నడుస్తున్నాయి.
దేశ ఆర్థిక రాజధాని ముంబై-అహ్మదాబాద్ మధ్య త్వరలో వందే భారత్ రైలు ప్రారంభం కానుంది. రేపు (ఆగస్టు 9న) 20 కోచ్‌లతో తొలి వందేభారత్ రైలు ట్రయల్‌ని భారతీయ రైల్వే నిర్వహించబోతోంది. 130 కి.మీ వేగంతో ప్రయాణించే ఈ రైలును తొలిసారిగా ట్రయల్ చేయనున్నారు. అహ్మదాబాద్-వడోదర-సూరత్-ముంబై సెంట్రల్ మధ్య రైలు ట్రయల్ రన్ జరుగనుంది. ఉదయం 7 గంటలకు అహ్మదాబాద్ స్టేషన్ నుండి బయలుదేరి మధ్యాహ్నం 12:15 గంటలకు ముంబై సెంట్రల్ చేరుకుంటుంది.