హైదరాబాద్ పాతబస్తీలోని గుల్జార్‌హౌస్ ప్రాంతంలో సంభవించిన ఘోర అగ్నిప్రమాదం భారీ నష్టా్న్ని మిగిల్చింది. తాజాగా గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాద కారణాలను అధికారులు గుర్తించారు. అగ్నిప్రమాదానికి ఏసీ కంప్రెషర్ పేలుడే కారణమని తేల్చారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న ఏసీలోని కంప్రెషర్లు పేలిపోవడంతో ప్రమాదం జరిగిందని నిర్ధారణకు వచ్చారు. అధికారుల వివరాల ప్రకారం.. కొన్ని రోజులుగా నిరంతరాయంగా ఏసీలను నడుపుతుండటంతో ఘటన జరిగింది.
పెంపుడు కుక్క కరవడంతో వ్యక్తి మృతిచెందిన సంఘటన మధురానగర్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని కృష్ణాజిల్లా ప్రాంతానికి చెందిన డి.పవన్కుమార్ (37) తన స్నేహితుడు సందీప్ తో కలిసి గత ఐదేళ్ళుగా హైదరాబాద్ మధురానగర్ లో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. పవన్కుమార్ ప్రైవేటుసంస్థలో క్యాషియర్గా విధులు నిర్వహిస్తూ ఇటీవల అనారోగ్యం కారణంగా వెళ్ళడం లేదు. ప్రతిరోజు ఆసుపత్రికి స్నేహితునితో కలిసి వెళ్ళి వస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి కూడా…
హైదరాబాద్‌లో మరో లిఫ్ట్ ప్రమాదం చోటు చేసుకుంది. సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో అపార్ట్మెంట్లో లిప్టు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బాలుడు అక్బర్ (10)మృతి చెందాడు. బంతితో ఆడుతూ బంతి లిఫ్ట్ గోతిలో పడడంతో తీయడానికి వెళ్లాడు అక్బర్ పటేల్. అదే సమయంలో లిఫ్ట్ వెయిట్ తలపై పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు.
బీహార్ రాష్ట్రంలో ఘోరం చోటు చేసుకుంది. కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ మనుమరాలిని ఆమె భర్త కాల్చి చంపాడు. పట్టపగలే ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఈ ప్రాంతమంతా కలకలం రేగింది. కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ మనవరాలు సుష్మా దేవి(32) 14 ఏళ్ల క్రితం రమేష్ అనే వ్యక్తిని ప్రేమించింది. వీరిద్దరూ 14 ఏళ్ల కిందట కులాంతర పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం బిహార్‌లోని గయా జిల్లా టెటువా గ్రామంలో నివిస్తున్నారు.
హైదరాబాద్ నగరంలో మరోసారి హిట్ అండ్ రన్ ఘటన చోటు చేసుకుంది. నార్సింగిలో జరిగిన ఈ ఘోర ప్రమాదంలో యువ ఇంజనీర్ నవీన్ చారీ ప్రాణాలు కోల్పోయాడు. ఎంతో ఆసక్తితో, ఆశలతో తన మొదటి ఉద్యోగం ప్రారంభించిన నవీన్ చారీ ఆ రోజు పని ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ఈ విషాదం జరిగింది. కోకాపేట్ టీ-గ్రీల్ వద్ద నవీన్ చారీ తన ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం అతడిని వేగంగా ఢీకొట్టింది.…
హైదరాబాద్ బాలనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నవవధువు ఆత్మహత్య చేసుకుంది.. పెళ్లయిన నెల రోజులకే గంట విజయ గౌరీ(20) ఇంట్లో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్న ఆ యువతికి గత నెల ఫిబ్రవరి 6న నందిగామ విజయనగరానికి చెందిన ఈశ్వర రావు(35) తో వివాహం జరిగింది.. మృతురాలి స్వస్థలం పార్వతీపురం. ఉద్యోగ నిమిత్తం నగరానికి వచ్చిన ఈశ్వరరావు బాలనగర్ పీఎస్ పరిధిలోని బాల్ రెడ్డినగర్‌లో ఇల్లు తీసుకొని అద్దెకు ఉంటున్నాడు.. గత నెల…
అమెరికాలో కేశంపేటకు చెందిన విద్యార్థని కాల్చి చంపారు. రంగారెడ్డి జిల్లా కేశంపేట గ్రామానికి చెందిన గంప ప్రవీణ్ (27) మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ప్రవీణ్ ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్లాడు.
మెదక్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు మంజీరా నదిలో మునిగి ఇద్దరు మృతి చెందారు. కొల్చారం (మం) పోతంశెట్ పల్లి శివారులో రెండో బ్రిడ్జి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఏడుపాయల జాతరకు వచ్చిన నలుగురు యువకులు స్నానం కోసం నదిలోకి దిగారు.
SLBC Tragedy: తెలంగాణలోని శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (SLBC) టన్నెల్ ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. కొన్నిరోజుల క్రితం ఈ టన్నెల్లో నిర్మాణ పనులు జరుగుతుండగా అనుకోని ప్రమాదం చోటుచేసుకుంది. 8 మంది లోపల చిక్కుకుపోయారు. ఈ సంఘటన జరిగి ఎనిమిదో రోజుకు చేరుకుంది, కానీ ఇంకా పూర్తి స్థాయిలో రెస్క్యూ పూర్తవ్వలేదు. పనులు పూర్తి చేసేందుకు రెస్క్యూ బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయి. ప్రస్తుతం మట్టి తొలగింపు ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. అధికారులు కార్మికుల ఆనవాళ్లను…
పాపన్నపేట (మం) బాచారం గ్రామానికి చెందిన భర్త ఆశయ్య (55).. ఈ నెల 15న పొలం పనులకు వెళ్లి కాలు జారి పడ్డాడు. అయితే అతని కాలు, నడుముకు గాయమై నడవలేని స్థితిలో ఉన్నాడు. అయితే భర్త ఆరోగ్యం కుదుటపడటానికి ఆస్పత్రికి డబ్బులు ఖర్చు అవుతాయని భావించిన భార్య శివమ్మ.. తన అల్లుడితో కలిసి భర్తను చంపేసింది.