Babu Mohan : ప్రముఖ నటుడు బాబు మోహన్ మరోసారి ఎమోషనల్ అయ్యాడు. నటుడుగా ఎంతో పేరు సంపాదించుకున్న ఆయన.. పొలిటికల్ గా ఆ స్థాయిలో రాణించలేకపోయారు. ఇప్పుడు మళ్లీ సినిమాల్లో నటిస్తున్నాడు. తజాఆగా చిల్డ్రన్స్ డేలో భాగంగా ఓ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన భావోద్వేగ వ్యాఖ్యలు అక్కడున్న వారిని కంటతడి పెట్టించాయి. చిన్నప్పుడే నాకు పోలీస్ అవ్వాలి అనే పెద్ద కోరిక ఉండేది. జంబలకడిపంబ సినిమాలో పోలీస్ పాత్ర దక్కడంతో…
UP: ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో హృదయ విదారక సంఘటన జరిగింది. స్కూల్ వ్యాన్ ఢీకొని రెండున్నరేళ్ల చిన్నారి విషాదకరంగా మరణించింది. బుధానా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉమర్‌పూర్ గ్రామంలో ఈ హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
UP: తన భార్య వేరే వ్యక్తితో లేచిపోవడంతో మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో జరిగింది. తన నలుగురు పిల్లలతో కలిసి అను యమునా నదిలోకి దూకినట్లు పోలీసులు శనివారం తెలిపారు. శుక్రవారం తన భార్యతో జరిగిన వివాదం తర్వాత సల్మాన్ ఈ తీవ్ర చర్యకు పాల్పడ్డాడు. దూకడానికి ముందు తన వీడియోను రికార్డ్ చేసి, తన సోదరి గులిస్టాకు పంపాడు. తన భార్య ఖుష్నూ, ఆమె లవర్ తన ఆత్మహత్యకు బాధ్యులు…
Husband carries wife’s body on Bike in Nagpur: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒక వ్యక్తి తన భార్య మృతదేహాన్ని బైక్‌పై స్వగ్రామానికి తరలించే ప్రయత్నం చేశాడు. అంబులెన్స్ అందుబాటులో లేకపోవడం, రోడ్డుపై ఎవరూ సాయం చేయకపోవడంతో.. భర్త నిస్సహాయంగా ఉండిపోయాడు. తీవ్ర నిరాశకు గురైన భర్త తన భార్య మృతదేహాన్ని బైక్‌కు కట్టి తీసుకెళ్లాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన…
Telangana Gulf Worker Dies Mid-Flight: గల్ఫ్ దేశాలలో పనిచేస్తున్న తెలుగు కార్మికుల గుండెలు ఆగిపోతున్న సంఘటనలు ఇటీవలి రోజుల్లో బాగా పెరుగుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులు, ఏజెంట్ల మోసాలు, ఇతర కారణాలతో చాలా మంది కార్మికులు తీవ్ర ఒత్తిడికి గురై.. గుండెపోటుతో మరణిస్తున్నారు. తాజాగా మరో గల్ఫ్ కార్మికుని గుండె గాల్లోనే ఆగిపోయింది. దమ్మామ్ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఫైట్‌లోనే మరణించాడు. Also Read: Telangana Rains: తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు! జగిత్యాల జిల్లా…
Accident : హైదరాబాద్ శివారులోని బాచుపల్లి ప్రాంతంలో హృదయవిదారక రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మల్లంపేట సమీపంలోని పల్లవి స్కూల్ జంక్షన్ వద్ద టిప్పర్ ఒక స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ప్రయాణిస్తున్న ఆరేళ్ల బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు అభిమన్యు రెడ్డి (6), నిజామాబాద్‌కు చెందినవాడు. కుటుంబంతో కలిసి ఇటీవల మల్లంపేటలో నివాసం ఉంటున్నాడు. బాలుడు గీతాంజలి ఇంటర్నేషనల్ స్కూల్‌లో 1వ తరగతి చదువుతున్నాడు. ఇవాళ ఉదయం మాదిరిగానే తల్లి స్కూటీపై అభిమన్యును స్కూల్‌కు…
Illegal Affair : మెదక్ జిల్లాలో వివాహేతర సంబంధం కారణంగా రెండు కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. హావేలి ఘనపూర్ మండలం సుల్తాన్‌పూర్ గ్రామానికి చెందిన నరేష్ (31), సునీత (28) మధ్య గత కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఇద్దరికీ కుటుంబాలు ఉన్నప్పటికీ, వారి సంబంధం తీవ్రతరమైంది. నరేష్‌కు భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉండగా, సునీతకూ భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ వ్యవహారం గ్రామంలో తెలిసిపోయింది. పెద్దలు పంచాయతీ పెట్టి వారిద్దరిని మందలించారు.…
Bengaluru Stampede: ఐపీఎల్ 2025 టైటిల్‌ను గెలుచుకున్న సందర్భంగా బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన ఆర్సీబీ విజయోత్సవ వేడుకలు విషాదంగా ముగిసాయి. ఈ వేడుకల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, 30 మంది కి పైగా గాయపడ్డారు. స్టేడియం బయట సుమారు రెండు లక్షల మంది అభిమానులు భారీగా గుమికూడటంతో, పరిస్థితిని పోలీసులు నియంత్రించలేకపోయారు. Read Also: Chinnaswamy Stadium Stampede: బెంగళూరులో తొక్కిసలాట.. ఎగ్జాట్లీ ఏ సమయంలో జరిగిందంటే..? ఈ…
సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్ మండలం చాట్లపల్లి గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. BMW కారును కొనివ్వలేదన్న కారణంతో 21 ఏళ్ల యువకుడు జానీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. స్థానికంగా నివసించే కనకయ్యది మధ్య తరగతి కుటుంబం. కానీ.. కొద్దిరోజులుగా తనకు BMW కారు కావాలని కుమారుడు జానీ అడిగాడు.
హర్యానాలోని పంచకులాలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రవీణ్ మిట్టల్ అనే వ్యాపారవేత్త తన కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు. అతని భార్య, తల్లిదండ్రులు, ముగ్గురు పిల్లలు సహా ఏడుగురు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అప్పుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. దాదాపు 20 కోట్ల రూపాయలు అప్పులు ఉన్నట్లు సంచలన విషయాలు రాసుకొచ్చారు.