పెంపుడు కుక్క కరవడంతో వ్యక్తి మృతిచెందిన సంఘటన మధురానగర్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని కృష్ణాజిల్లా ప్రాంతానికి చెందిన డి.పవన్కుమార్ (37) తన స్నేహితుడు సందీప్ తో కలిసి గత ఐదేళ్ళుగా హైదరాబాద్ మధురానగర్ లో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. పవన్కుమార్ ప్రైవేటుసంస్థలో క్యాషియర్గా విధులు నిర్వహిస్తూ ఇటీవల అనారోగ్యం కారణంగా వెళ్ళడం లేదు. ప్రతిరోజు ఆసుపత్రికి స్నేహితునితో కలిసి వెళ్ళి వస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి కూడా ఆసుపత్రికి వెళ్ళి రాత్రి దాదాపు 11 గంటల సమయంలో తన గదిలోకి వెళ్ళి నిద్రపోయాడు.
READ MORE: Blackout Drill: పాక్‌తో ఉద్రిక్తతల మధ్య, పంజాబ్ కంటోన్మెంట్‌లో సైన్యం ‘‘బ్లాక్అవుట్ డ్రిల్’’..
పక్కనే అతని పెంపుడు కుక్క కూడా పడుకుంది. ఉదయం సందీప్ తలుపు తట్టగా పవన్ లేవలేదు. దాంతో అనుమానం వచ్చి చుట్టుపక్కల వారిని పిలిపించి తలుపు పగలకొట్టి లోనికి వెళ్ళగా అప్పటికే పవన్ చనిపోయి ఉన్నాడు. అతని మర్మాంగాలు రక్తంతో ఉన్నాయి. అతని పెంపుడు కుక్క నోటినిండా రక్తం ఉంది. దాంతో కుక్క అతని మర్మాంగాలు తినడం వల్లనే మృతిచెంది ఉంటాడని అనుమానిస్తున్నారు. పవన్కుమార్కు గతంలో వివాహం జరిగింది. భార్య విడాకులు ఇవ్వడంతో నగరంలో ఉంటున్నారు. స్నేహితుడు సందీప్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మధురానగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
READ MORE: Hari Hara Veera Mallu: “హరి హర వీరమల్లు”పై క్రేజీ అప్డెట్.. షుటింగ్‌కి హాజరైన పవన్ కళ్యాణ్..