తన కూతురి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఆంజనేయులును హత్య చేసిన ఆంజనేయ ప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నాడు. చెన్నై ఎయిర్‌పోర్టులో ఆయనను కడప పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కూతురి జోలికొస్తే తన కత్తే సమాధానం చెబుతుందని ఓ తండ్రి ఇచ్చిన తీర్పు సంచలనం సృష్టిస్తోంది. కూతురి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన బంధువును కువైట్ నుంచి వచ్చి మరీ హత్య చేశాడు ఓ తండ్రి. తిరిగి కువైట్ వెళ్లి ఆ హత్య తానే చేశానని సెల్ఫీ వీడియోను విడుదల చేశాడు. అంతే కాకుండా పోలీసుల చేతకానితనం వల్లే తాను హంతకుడిగా మారాల్సి వచ్చిందని అంటున్నాడు.
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో విషాదం చోటుచేసుకుంది. లాడ్జిలో ఉరివేసుకొని ఆర్మీ జవాన్ ఆత్మహత్య చేసుకున్నాడు. నర్సీపట్నంలోని కేఎన్ఆర్ లాడ్జిలో ఆర్మీ జవాన్ ఫ్యానుకు ఉరివేసుకొని అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు
ఇంటి పైకప్పుపై వేసిన బండరాయి బోల్తా పడి తలపై పడడంతో మూడేళ్ల బాలుడు మృతిచెందిన ఘటన సోమవారం సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. అక్కన్నపేటలోని కటుకూరి గ్రామ వాసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోతులు ఆడుకుంటూ పైకప్పుపైకి దూకడం వల్ల బండరాయి బోల్తా పడింది.
హైదరాబాద్‌లో మరో దారుణమైన ఘటన వెలుగు చూసింది.. నగర శివారులో మైనర్ బాలికపై ఆటో డ్రైవర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.. కాచిగూడ ప్రాంతానికి చెందిన ఓ బాలిక కోఠిలోని ఓ కాలేజీలో చదువుకుంటుంది.. నాలుగు రోజుల క్రితం బాలిక తనకు తెలిసిన ఆటోలో కాలేజీకి బయల్దేరింది.. అయితే, కళాశాలకు వెళ్తున్న బాలికకు మాయమాటలు చెప్పిన ఆటో డ్రైవర్.. శివారులోని మేడిపల్లికి తీసుకొని వెళ్లాడు.. మేడిపల్లిలో 4 రోజుల పాటు రోజు ఒకో…