టీడీపీ మహానాడు సందర్భంగా ఒంగోలులో శుక్ర, శనివారాల్లో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తున్నట్లు ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ వెల్లడించారు. ప్రజలందరూ ట్రాఫిక్ ఆంక్షలు పాటించి పోలీసులకు సహకరించాలని ఆమె సూచించారు. మహానాడు కార్యక్రమానికి వెళ్లే వాహనాల మార్గాలు: ★ గుంటూరు, విజయవాడ, చీరాల వైపు నుంచి మహానాడుకు వచ్చే వాహనాలు త్రోవగుంట ఫ్లై ఓవర్ ఎక్కకుండా బై లైన్/సర్వీస్ రోడ్‌లో ఎంటర్ అయ్యి కిమ్స్ అండర్ పాస్ ద్వారా విష్ణుప్రియ కళ్యాణ మండపం మీదగా…
గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ)లో 20వ వార్షికోత్సవ వేడుకల్లో ప్రధాని పాల్గొనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పరిధిలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇవాళ మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని అధికారులు వెల్లడించారు. గచ్చిబౌలి స్టేడియం నుంచి విప్రో జంక్షన్ వరకు ఉన్న ఐటీ కంపెనీలు తమ ఆఫీస్ టైమింగ్స్ మార్చుకోవాలని సూచించింది. ఈ రూట్లల్లో ప్రయాణం.. గచ్చిబౌలి నుంచి లింగంపల్లి:…
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వరంగల్‌లో పర్యటించనున్నారు.. ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఆవరణలో జరుగనున్న రైతు సంఘర్షణ సభలో పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలో.. ట్రాఫిక్ ఆంక్షలు విధించారు వరంగల్ పోలీసులు.. 6వ తేదీన రాహుల్ వరంగల్‌లో పర్యటించనుండగా.. ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఆవరణలో జరగనున్న భారీ బహిరంగసభలో పాల్గొనబోతున్నారు.. ఈ నేపథ్యంలో పలు కూడళ్లలో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని.. వాటిని ఫాలో కావాల్సిందిగా సూచించారు పోలీసులు. 06న (శుక్రవారం)మధ్యాహ్నం 2 గంటల నుండి హన్మకొండ…
హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ హెచ్‌ఐసీసీలో నేడు భారీ ఎత్తున టీఆర్‌ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. హెచ్‌ఐసీసీ పరిసర ప్రాంతాలైన కొత్తగూడ-హైటెక్స్, సైబర్ టవర్స్-ఐకియా రోటరీ, గచ్చిబౌలి జంక్షన్-కొత్తగూడ ప్రాంతాల్లోని కార్యాలయాల నిర్వాహకులు పనివేళల్లో స్వల్ప మార్పులు చేసుకోవాలని పోలీసులు సూచించారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు ట్రాఫిక్ రద్దీ ఉండే అవకాశం ఉంటుందని,…
హైదరాబాద్ నగరంలో నేటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ జాయింట్ సీపీ ఏవీ రంగనాథ్ వెల్లడించారు. నగరంలో నాలాల మరమ్మతుల కారణంగా నేటి నుంచి జూన్ 4 వరకు సికింద్రాబాద్ సీటీవో జంక్షన్ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రసూల్‌పురా నాలా మరమ్మతుల కారణంగా.. సీటీవో జంక్షన్ నుంచి రసూల్‌పురా వెళ్లే వాహనాలను హనుమాన్ దేవాలయం నుంచి ఎడమ వైపునకు మళ్లిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా రసూల్‌పురా నుంచి కిమ్స్ ఆస్పత్రి మీదుగా…
హనుమాన్ జయంతి విజయ యాత్ర రూట్ మ్యాప్ ను పరిశీలించారు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్. హనుమాన్ జయంతి ని పురస్కరించుకొని బజరంగ్ దళ్, విహెచ్‌పీల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం చారిత్రాత్మక గౌలిగూడ రాంమందిర్ నుండి నిర్వహించే శ్రీ వీర హనుమాన్ విజయ యాత్ర బైక్ ర్యాలీ రూట్ మ్యాప్ ను నగర పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్ పరిశీలించారు. ఆయనతో పాటు అడిషనల్ సీపీ చౌహాన్, కార్తికేయ , జాయింట్ సీపీ రమేష్ రెడ్డి, విశ్వ…
ఈనెల 6న ఆదివారం ఉదయం షీ టీమ్స్ ఆధ్వర్వంలో 5కే రన్, 2కే రన్ నిర్వహించనున్న నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ మేరకు పీపుల్స్ ప్లాజా నుంచి లేపాక్షి, ట్యాంక్ బండ్, పీవీఎన్‌ఆర్ మార్గ్ ప్రాంతాల్లో ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నెక్లెస్ రోడ్డు రోటరీ నుంచి ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ మీదుగా వెళ్లే వాహనాలను షాదాన్ కాలేజ్, నిరంకారీ భవన్…
హైదరాబాద్, వరంగల్ తరవాత శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం కరీంనగర్. కానీ అక్కడ నిఘా వ్యవస్థ మాత్రం అంతంతమాత్రం. ఇక ట్రాఫిక్ కష్టాలు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కరీంనగర్‌లో పరిస్థితి నగరవాసులకు నరకం చూపిస్తోంది. తెలంగాణలో అభివృద్ధి చెందుతున్న నగరాల్లో కరీంనగర్ ఒకటి. ఇప్పటికే స్మార్ట్ సిటీ నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే…! కానీ సిటీలో ఎక్కడ చూసినా సమస్యలే కనిపిస్తాయి ముఖ్యంగా ట్రాఫిక్ కష్టాలు సాధారణంగా లేవు. వాహన…
హైదరాబాద్ నగరంలో ఆదివారం నాడు ఎయిర్టెల్ ఆధ్వర్యంలో భారీ మారథాన్ జరగనుంది. పీపుల్స్ ప్లాజా నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు 42 కిలోమీటర్లు (ఫుల్ మారథాన్), 21 కిలోమీటర్లు (హాఫ్ మారథాన్), 10 కిలోమీటర్ల మారథాన్‌ను నిర్వహించనున్నారు. ఈ మారథాన్‌కు ఇప్పటికే 6వేల మందికి పైగా రిజిస్టర్ చేయించుకున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఎయిర్టెల్ హైదరాబాద్ మారథాన్ 10వ ఎడిషన్ నేపథ్యంలో పీపుల్స్ ప్లాజా నుంచి గచ్చిబౌలి మధ్య ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల…
దీపావళి పండుగ వచ్చిందంటే చాలు యాదవులు తమ ఐక్యతను చాటుతూ సదర్ ఉత్సవాలను నిర్వహిస్తుంటారు.. ఒక్కప్పుడు హైదరాబాద్‌కు పరిమితమైన ఈ ఆనవాయితీ క్రమంగా కాలనీలు.. టౌన్లు, గ్రామాలకు కూడా విస్తరించింది.. అయితే.. ఎన్నో సంవత్సరాలుగా హైదరాబాద్‌లో ఈ ఉత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నారు యాదవ సోదరులు.. ఇప్పటికే శుక్రవారం రాత్రి నగరంలోని కొన్ని ప్రాంతాల్లో సదర్ ఘనంగా జరగగా.. రెండో రోజులో భాగంగా ఇవాళ ఖైరతాబాద్, సైదాబాద్, బోయిన్పల్లి, కాచిగూడ, ఈస్ట్ మారెడ్‌పల్లి సహా మరికొన్ని ప్రాంతాలతో పాటు..…