నేడు బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం సందర్భంగా ఆలయ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధించినట్లు నగర ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ తెలిపారు. ఈ నేపథ్యంలో.. ఓ ప్రకటనను విడుదల చేశారు. నేడు అమ్మవారి కల్యాణం, రేపు (బుధవారం) రథోత్సవం సందర్భంగా ఆయా రోజుల్లో వాహనదారులు ప్రత్యామ్నాయ రహదారులను ఎంచుకుని ప్రయాణించాలని ఆయన కోరారు.
read also: Kaali Poster: కాళీ పోస్టర్‌పై వివాదం.. నోటిలో సిగరెట్, చేతిలో ఎల్జీబీటీ జెండా..
ట్రాపిక్ ఆంక్షలు :
గ్రీన్‌ల్యాండ్స్, దుర్గామాత ఆలయం, సత్యం థియేటర్ వైపు నుంచి ఫతేనగర్ వైపు వెళ్లే వాహనాలు ఎస్‌ఆర్‌నగర్ టీ జంక్షన్ వద్ద మళ్లి ఎస్‌ఆర్‌నగర్ కమ్యూనిటీ హాల్, అభిలాష టవర్స్, బీకేగూడ ఎక్స్‌రోడ్డు, శ్రీరామ్‌నగర్ ఎక్స్‌రోడ్డు, సనత్‌నగర్ రోడ్డు మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ఇక ఫతేనగర్ వైపు నుంచి బల్కంపేట వైపు వచ్చే వాహనాలు బల్కంపేట ప్రధాన రహదారి గుండా అనుమతించరు. వాహనదారులు బల్కంపేట–బేగంపేట లింక్‌రోడ్డులోకి మళ్లించి కట్టమైసమ్మ టెంపుల్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. కాగా.. గ్రీన్‌ల్యాండ్స్ బకుల్ అపార్ట్‌మెంట్స్, ఫుడ్‌వరల్డ్ వైపు నుంచి వచ్చే వాహనాలను బల్కంపేట వైపు అనుమతించరు. వాహనదారులు ఫుడ్‌వరల్డ్ ఎక్స్‌రోడ్డు వద్ద మళ్లి సోనాబాయి టెంపుల్, సత్యం థియేటర్, మైత్రివనం, ఎస్‌ఆర్‌నగర్ ‘టీ’జంక్షన్ వైపు వెళ్లాల్సి ఉంటంది. అంతేకాకుండా.. ఎస్‌ఆర్‌నగర్ టీ.జంక్షన్ నుంచి ఫతేగర్ వైపు వెళ్లే బై–లేన్స్, లింక్‌రోడ్లను మూసివేయడం జరిగిందని, వాహనదారులు గమనించి ట్రాఫిక్ సిబ్బందికి సహకరించాలన్నారు.
read also: Bengaluru Crime: యువతిని వేధించిన దుండగుడు.. కాపాడిన హిజ్రాలు
పార్కింగ్ ఏరియాలుః
బల్కం ఎల్లమ్మ కల్యాణం వీక్షించేందుకు వచ్చే వారి వాహనాల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ ప్రాంతాలను ఎంపిక చేశారు. అయితే.. ఆర్ అండ్ బీ కార్యాలయం, అమీర్‌పేట జీహెచ్‌ఎంసీ గ్రౌండ్, నేచర్‌క్యూర్ హాస్పిటల్ రోడ్డు వైపు పార్కింగ్ ప్రాంతం, పద్మశ్రీ, ఫతేనగర్ ఆర్‌యూబీ ప్రాంతాల్లో భక్తులు పార్కింగ్ చేసుకోవచ్చని జాయింట్ కమిషనర్ తెలిపారు.