హైదరాబాద్‌లో వాహనదారుల్లో చాలామందికి ట్రాఫిక్ నిబంధనలు తెలియవు. దీంతో వాళ్లు ఎలా పడితే అలా వాహనాన్ని నడిపేస్తుంటారు. రోడ్డు బాగుంది కదా అని 80 లేదా 100 కిలోమీటర్ల స్పీడ్‌లో వెళ్తుంటారు. అయితే హైదరాబాద్ సిటీలో ఎంవీ యాక్ట్ ప్రకారం బైకర్లు గంటలకు 60 కి.మీ. స్పీడ్‌తో మాత్రమే వెళ్లాలి. అయితే గత ఏడాది లంగర్‌హౌస్‌కు చెందిన ఓ బైకర్ 66 కి.మీ. వేగంతో వెళ్లడంతో ట్రాఫిక్ పోలీసులు రూ.వెయ్యి ఛలానా విధించారు. దీంతో సదరు వాహనదారుడు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులను ట్విట్టర్ వేదికగా ప్రశ్నించగా.. హైదరాబాద్ నగరంలో కేవలం 40 కి.మీ. వేగంతో మాత్రమే వెళ్లేందుకు అనుమతి ఉందని స్పష్టం చేశారు.
Read Also: న్యూఇయర్ ట్రీట్.. ఏపీలో మద్యం ప్రియులకు గుడ్‌న్యూస్
ఈ నేపథ్యంలో పలువురు నెటిజన్‌లు ఎంవీ యాక్ట్ వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీనిపై ట్విట్టర్‌లో సామాజిక కార్యకర్త విజయ్ గోపాల్ స్పందిస్తూ… అన్యాయంగా స్పీడ్ లిమిట్ పేరుతో ఛలాన్లు విధించడం సరికాదని హితవు పలికారు. ఎంవీ యాక్ట్ ప్రకారం సిటీలో 60 కి.మీ. స్పీడ్‌తో వెళ్లవచ్చని ఉందని… ఒకవేళ ఆ స్పీడ్‌ను తగ్గించినట్లయితే గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలని.. అంతేకానీ ఇష్టం వచ్చినట్లు ఛలాన్‌లు వేయడం సరికాదన్నారు. ఈ ట్వీట్‌కు డీజీపీని, సిటీ పోలీస్ కమిషనర్‌ను ట్యాగ్ చేశారు.
Liars..! We req @CVAnandIPS @AddlCPTrHyd to stop levying illegal speed limit challans on citizens pls. 60 kmph is the limit in the city & any reduction must be through a gazette & not circulars of the police. @CPHydCity @TelanganaDGP
— Vijay Gopal (@VijayGopal_) December 28, 2021
Cc @MORTHIndia @nitin_gadkari pls intervene https://t.co/nF59JBgoxS