అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై 50శాతం సుంకాలు విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అవసరమైతే మరిన్ని సుంకాలు విధించేందుకు కూడా వెనకాడబోనని ట్రంప్ హెచ్చరిస్తున్నారు. భారత్ మాత్రం రష్యాతో బంధం కొనసాగుతుందని, టారిఫ్‌ల భారాన్ని మోసేందుకు సిద్ధమని ప్రకటించింది. అయితే ట్రంప్ ఎందుకిలా రెచ్చిపోతున్నారు? ఆయన రాజకీయ, వ్యూహాత్మక లక్ష్యాలు ఏంటి? భారత్-రష్యా సంబంధాలను దెబ్బ కొట్టేందుకే ట్రంప్ ఇలా చేస్తున్నారా..? లాంటి అనేక ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. భారత్‌పై ట్రంప్ సుంకాలు..!…
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్-పాకిస్తాన్ విషయాన్ని ప్రస్తావించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో తానే ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ చేసేలా ఒప్పించానని చెప్పాడు. ఇప్పటికే ఈ విషయాన్ని 20 కన్నా ఎక్కువ సార్లు ట్రంప్ చెప్పాడు. మరోవైపు, ట్రంప్ వ్యాఖ్యలపై భారతదేశంలో రాజకీయ యుద్ధం ప్రారంభమైంది. ప్రధాని మోడీ ట్రంప్‌కు లొంగిపోయాడని కాంగ్రెస్ విమర్శిస్తోంది. ఇలా ఉంటే, పాకిస్తాన్ డీజీఎంఓ, భారత డీజీఎంఓకి కాల్ చేసి, కాల్పుల విరమణను కోరడంతోనే…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై 145 శాతం సుంకం విధించిన విషయం తెలిసిందే. తాజాగా చైనా కూడా యూఎస్‌కు తగిన సమాధానం ఇచ్చింది. అమెరికా ఉత్పత్తులపై సుంకాన్ని 84 శాతం నుంచి 125 శాతానికి పెంచుతున్నట్లు చైనా ప్రకటించింది. ఈ అదనపు టారిఫ్ ఏప్రిల్ 12 నుంచి వర్తిస్తుంది. ఏప్రిల్ 12 నుంచి చైనాలో అమెరికన్ ఉత్పత్తులపై సుంకం 84 శాతం నుంచి 125 శాతానికి పెరుగుతుందని చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన వాణిజ్య యుద్ధం, విలీన బెదిరింపుల నేపథ్యంలో కెనడా ప్రధాని మార్క్ కార్నీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బలమైన ఆధిక్యాన్ని సంపాదించడం కోసం ముందస్తు ఎన్నికలకు మార్క్ కార్నీ పిలుపునిచ్చారు. ఏప్రిల్ 28న ముందస్తు ఎన్నికలు జరగనున్నాయి.
USA-India Tariffs: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన భారీ ప్రతీకార సుంకాల ప్రకటన ప్రపంచ వ్యాప్తంగా గందరగోళాన్ని సృష్టిస్తోంది. ప్రపంచ వాణిజ్య వ్యవస్థపై దీని ప్రభావం ఎంతగానో ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్ సహా అనేక దేశాలపై అధిక సుంకాలను విధించనున్నట్లు ట్రంప్ వెల్లడించడంతో వివిధ దేశాల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లివిట్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నాడు జరిగిన మీడియా సమావేశంలో ఆమె…
ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దేశాలైన అమెరికా, చైనాల మధ్య చాలా కాలంగా ఉద్రిక్తత నెలకొంది. ఇరు దేశాలు పరస్పరం కంపెనీలపై అనేక ఆంక్షలు విధించుకున్నాయి. దాదాపు మూడు దశాబ్దాలుగా చైనా ప్రపంచ కర్మాగారంగా ఉంది.