అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన వాణిజ్య యుద్ధం, విలీన బెదిరింపుల నేపథ్యంలో కెనడా ప్రధాని మార్క్ కార్నీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బలమైన ఆధిక్యాన్ని సంపాదించడం కోసం ముందస్తు ఎన్నికలకు మార్క్ కార్నీ పిలుపునిచ్చారు. ఏప్రిల్ 28న ముందస్తు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అధికారి లిబరల్ పార్టీ ఆఫ్ కెనడా… ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కన్జర్వేటివ్ పార్టీ ఆఫ్ కెనడాతో తలపడనుంది.
ఇది కూడా చదవండి: Hanamkonda: ముస్లిం అమ్మాయితో మాట్లాడిన హిందూ యువకుడిపై దాడి..
కెనడా ప్రధానిగా జస్టిన్ ట్రూడో వైదొలిగిన తర్వాత.. ప్రధానమంత్రి బాధ్యతలను ఆర్థిక నిపుణుడైన మార్క్ కార్నీ (60) మార్చి 14న బాధ్యతలు చేపట్టారు. అక్టోబర్‌లో ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ట్రంప్ విధానాన్ని ఎదుర్కొనేందుకు ముందుగా మార్క్ కార్నీ ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. దీంతో ఏప్రిల్ 28న ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం కెనడాలో లిబరల్ పార్టీకి మెజార్టీ ఉన్నా.. బలమైన ప్రభుత్వం ఏర్పాటు దిశగా కార్నీ ఈ నిర్ణయం తీసుకున్నారు. పొరుగున ఉన్న కెనడాను అమెరికాలో 51వ రాష్ట్రంగా మారుస్తానని ట్రంప్ పదే పదే హెచ్చరిస్తున్నారు. ఈ బెదిరింపులను దృష్టిలో పెట్టుకుని మార్క్ కార్నీ ఈ ముందస్తు ఎన్నికలకు వెళ్లారు.
ఇది కూడా చదవండి: Venky Kudumula : నితిన్, శ్రీలీల వలన రాబిన్ హుడ్ కు బజ్ రాలేదు
పార్లమెంట్‌ను రద్దు చేసి ఏప్రిల్ 28న ఎన్నికలు నిర్వహించాలని గవర్నర్ జనరల్‌ను అభ్యర్థించినట్లు కార్నీ తెలిపారు. ట్రంప్ ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వమన్నారు. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలంటే.. బలమైన ప్రభుత్వం అవసరం అని కార్నీ పేర్కొ్న్నారు.
ఇది కూడా చదవండి: Salman Khan : రష్మికకు లేని బాధ మీకెందుకు..