దేశంలో తాత్కాలిక ప్రయోజనాల కోసం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని, అది రాబోయే తరాలకు ప్రమాదకరం అన్నారు సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క. పీపుల్స్ మార్చ్ పేరుతో ఖమ్మం జిల్లాలో పాదయాత్ర చేపట్టారు భట్టి విక్రమార్క. ఎన్టీవీ ఫేస్ టు ఫేస్ లో అనేక విషయాలు ప్రస్తావించారు. తనదైన రీతిలో సమాధానాలిచ్చారు. తాత్కాలిక ప్రయోజనాల కోసం మోడీ ప్రయత్నించడం పట్ల లౌకికవాదులు కళ్ళు తెరవాలన్నారు. సీఎల్పీ నేతగా తాను రాష్ట్రమంతా యాత్రలు చేస్తా. పీసీసీ అధ్యక్షుడిగా…
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో జరిగిన అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన రాకేష్ కుంటుంబాన్ని పరామర్శించేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బయలుదేరారు. కాగా ఘట్‌కేసర్‌లో రేవంత్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. టీపీసీసీ చీఫ్ సహా పలువురిని అదుపులోకి తీసుకున్నారు. రేవంత్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తున్న వాహనాన్ని కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నాయి. ఈ క్రమంలో పోలీసులు, కాంగ్రెస్ నేతల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని రేవంత్ నిలదీశారు. అరెస్ట్ గురించి రాతపూర్వకంగా పత్రం ఇస్తేనే పోలీస్‌స్టేషన్‌కు వస్తానంటూ రేవంత్…
అత్తా కోడళ్ళ పంచాయతీ లెక్క బీజేపీ, టీఆర్ఎస్ పంచాయతీ అని టీపీసీసీ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. గురువారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో రేవంత్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్, బీజేపీ ఇద్దరూ కలిసే ఉన్నారని విమర్శించారు. వాళ్ళు వేరు వేరు అని ఎప్పుడూ అనుకోవద్దని, ఏ విషయంలో సరే వాళ్ళు విడిపోయారు చెప్పండని ప్రశ్నించారు. అప్పులు చేసి రాష్ట్రాన్ని ముంచుతున్నాడు కెసిఆర్ అని చెప్పింది బీజేపీ నే అని గుర్తు చేశారు రేవంత్ రెడ్డి. అప్పులు తెచ్చుకో అని 4…
ఇవాల్టి నుంచి కాంగ్రెస్ చింతన్ శిబిర్ కార్యక్రమం ప్రారంభం కానుంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భట్టి విక్రమార్క అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈమేరకు కీసరలో రెండు రోజుల పాటు మేధోమథన సదస్సు జరగనుంది. ఉదయ్‌పూర్ తీర్మానాలపై చర్చించి వాటికి టీపీసీసీ ఆమోదం తెలుపుకుంటుంది. వచ్చే ఎన్నికలే టార్గెట్‌గా భవిష్యత్తు కార్యాచరణపై నేతలు చర్చించుకుంటారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కమ్ ఠాగూర్ హాజరు కానున్నారు. 2 రోజుల సమావేశాల్లో రాజస్థాన్ లోని ఉదయ్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఎనిమిదేళ్లుగా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు విఫలం అయ్యాయని విమర్శించారు. రాష్ట్రానికి వస్తున్న ప్రధాని మోదీ… తెలంగాణ ఏర్పాటుపై చేసిన వ్యాఖ్యల పట్ల క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అంశాలపై రేవంత్ పలు ప్రశ్నలు సంధిస్తూ సమాధానలు చెప్పాలని లేఖలో కోరారు. కాళేశ్వరంలో అవినీతిపై సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు. నిజామాబాద్‌లో పసుపు బోర్డు…
కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. తెలంగాణ కాంగ్రెస్ లో ఆయనో సంచలనం. ఈరోజు ఆయన బర్త్ డే సందర్భంగా కీలక విషయాలు పంచుకున్నారు. తాను మచ్చలేని రాజకీయా నాయకుడిని అని చెప్పుకొచ్చారు మాజీమంత్రి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. 20ఏళ్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా ఉన్న తాను ప్రజలకు, కార్యకర్తలకు అండగా ఉన్నానని గుర్తుచేసారు. వచ్చే ఎన్నికల్లో నల్లగొండ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగానే బరిలోకి దిగుతానని ఆయన కార్యకర్తలకు స్పష్టం చేసారు. తాను అధికారపార్టీలో…