నేడు ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణం. ఉదయం 10 గంటలకు ప్రమాణస్వీకారం కార్యక్రమం. కార్యక్రమానికి హాజరుకానున్న ప్రధాని మోడీ, చంద్రబాబు, పవన్, ఎన్డీఏ భాగస్వామ్యపక్ష నేతలు. విశాఖ: ఏపీ లిక్కర్ కేసులో సుదీర్ఘంగా కొనసాగిన సిట్ తనిఖీలు.. నరెడ్డి సునీల్ రెడ్డికి చెందిన కంపెనీల్లో ముగిసిన సోదాలు. నిన్న ఉదయం 11 గంటల నుంచి ఇవాళ తెల్లవారుజాము వరకు కొనసాగిన సిట్ విచారణ.. హార్బర్ పార్క్ ఏరియాలోని వెర్టిలైన్, గ్రీన్ ఫ్యూయల్ సంస్థల కార్యాలయాల నుంచి హార్డ్…
“ది లక్” – సామాన్యుల కోసం తొలి రియాలిటీ గేమ్ షో! దేశంలో రియాలిటీ షోల పట్ల ప్రజల్లో క్రేజ్ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు వచ్చిన షోలు ఎక్కువగా సెలబ్రిటీలు, సినీ తారలు లేదా ప్రముఖులను ఆధారంగా చేసుకుని సాగాయి. కానీ ఇప్పుడు పూర్తిగా కొత్త కాన్సెప్ట్తో ఒక వినూత్నమైన రియాలిటీ గేమ్ షో రాబోతుంది. అదే “ది లక్”. ఇది సామాన్యుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన తొలి అతిపెద్ద రియాలిటీ షో. ఈ…
ఆపిల్ iPhone 17 సిరీస్ లాంచ్.. ఏ ఫోన్ ఎంతకు లభిస్తుందంటే? ఆపిల్ (Apple) సంస్థ ప్రకటించిన iPhone 17 సిరీస్ తాజాగా లాంచ్ అయ్యింది. ఈ సిరీస్ లో భాగంగా iPhone 17, iPhone 17 Air, iPhone 17 Pro, iPhone 17 Pro Max మోడల్స్ వివిధ శ్రేణిలో మార్కెట్ లోకి రాబోతున్నాయి. మరి ఈ మొబైల్స్ మోడల్ ధరలు, స్టోరేజ్ ఆప్షన్స్, రంగులు, ప్రీ-ఆర్డర్ వివరాలు ఇలా ఉన్నాయి. iPhone 17…
డీజే బాణీలకు పోలీస్ అధికారులు స్టెప్పులు హైదరాబాద్ నగర వ్యాప్తంగా గణేశ్ నిమజ్జనాలు ఉత్సాహభరితంగా, ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. డీజేలు, బ్యాండ్లు, కోలాటాలు, డప్పుల మోతలు, సాంస్కృతిక ప్రదర్శనల నడుమ భక్తులు భారీగా ట్యాంక్బండ్ వైపు తరలివస్తున్నారు. శోభాయాత్రలో చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఉత్సాహంగా పాల్గొని వినాయకుడి నిమజ్జనాన్ని పండగలా మార్చుతున్నారు. ఈ సందర్భంలోనే ఒక ఆసక్తికర దృశ్యం కనిపించింది. డీజే పాటల బాణీలకు పోలీసు సిబ్బంది ఊరేగింపులో పాల్గొని డ్యాన్స్ చేశారు. ముఖ్యంగా ఖైరతాబాద్…
కాంతారా -1 మలయాళ రైట్స్ కొనుగోలు చేసిన స్టార్ హీరో కాంతారా కన్నడ సినిమా చరిత్రలో ఒక సెన్సేషన్. కన్నడ యంగ్ హీరో రిషబ్ శెట్టి దర్శకత్వం వహిస్తూ నటించిన ఈ సినిమా కన్నడ ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. ఈ సినిమాను జస్ట్ రూ. 16 కోట్లతో తీస్తే సుమారు రూ. 450 క్రోర్ కలెక్షన్లను రాబట్టుకొంది. తెలుగు, తమిళ్, హిందీ చిత్ర పరిశ్రమలలో రికార్డు స్థాయి వసూళ్లు రాబట్టింది. ఇప్పడు కాంతారా…
ఎమ్మెల్సీ పదవికి కల్వకుంట్ల కవిత రాజీనామా! ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్లు కల్వకుంట్ల కవిత అధికారికంగా ప్రకటించారు. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. మంగళవారం కవితను బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలో ఈరోజు హైదరాబాద్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పదవికి, బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు చెప్పారు. నిజామాబాద్ జిల్లా నుంచి స్థానిక సంస్థల…
సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట! తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. 2021లో నమోదైన కేసులో వ్యక్తిగత హాజరు నుంచి తెలంగాణ హైకోర్టు మినహాయింపు ఇచ్చింది. కౌంటర్ దాఖలు చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వర్ రావును కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది. సైఫాబాద్ పోలీస్స్టేషన్లో తనపై నమోదైన కేసును కొట్టేయాలని సీఎం రేవంత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏఐసీసీ పిలుపు మేరకు 2021లో…
త్వరలో ‘‘హైడ్రోజన్ బాంబు’’.. బీజేపీకి రాహుల్ గాంధీ వార్నింగ్.. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరోసారి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, ఎన్నికల సంఘం ఓటర్లను మోసం చేయడానికి కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. ‘‘త్వరలో ఓటు చోరిపై హైడ్రోజన్ బాంబు పేలుస్తా’’ అంటూ కామెంట్స్ చేశారు. ఎన్నికల కమిషన్ చేపట్టిన ‘‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’’ ద్వారా బీహార్లో ఓటర్లను తొలగిస్తున్నారని ప్రతిపక్షాలు అధికార బీజేపీ, ఎన్నిక సంఘంపై ఆరోపణలు గుప్పిస్తున్నాయి.…