మూడు కొత్త జిల్లాలు, ఐదు కొత్త రెవెన్యూ డివిజన్లకూ గ్రీన్ సిగ్నల్..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలనా వ్యవస్థలో మరో కీలక మార్పు చోటుచేసుకుంది. రాష్ట్రంలో మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారికంగా ఆమోదం తెలిపారు. తాజా నిర్ణయంతో మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాలు కొత్తగా ఏర్పడనున్నాయి. ఇందులో రంపచోడవరం కేంద్రంగా కొత్తగా పోలవరం జిల్లా ఏర్పాటు కానుంది. ప్రజలకు పరిపాలన మరింత చేరువ కావాలని, సేవల వేగవంతమైన అందుబాటు కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ కేబినెట్ 10 కీలక నిర్ణయాలు.. ఇవే..!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్ విద్యుత్ అవసరాలు, పరిశ్రమల వృద్ధి, నగర పాలన సంస్కరణలు, మౌలిక సదుపాయాల విస్తరణ.. అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కేబినెట్ విస్తృత చర్చలు జరిపింది. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టూ వేగంగా పెరుగుతున్న అర్బన్ అభివృద్ధిని క్రమబద్ధీకరించేందుకు, విద్యుత్ సరఫరా వ్యవస్థను బలోపేతం చేసేందుకు తీసుకున్న నిర్ణయాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
సిద్ధరామయ్య, డీకే శివకుమార్ బలాబలాలపై కాంగ్రెస్ అంచనా..
కర్ణాటక కాంగ్రెస్‌లో పొలిటికల్ డ్రామా కొనసాగుతూనే ఉంది. రెండు పవర్ సెంటర్స్ అయిన సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వర్గాల మధ్య పోరు ముదిరింది. ఈ సమస్య ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ముందుంది. కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో 2.5 ఏళ్లు సీఎం పదవిని పంచుకోవాలని అప్పట్లో కాంగ్రెస్ హైకమాండ్ ఒప్పందం చేసింది. ప్రస్తుతం, ఈ సమయం అయిపోవడంతో డీకే వర్గం ఎమ్మెల్యేలు నాయకత్వ మార్పు గురించి కాంగ్రెస్ అధిష్టానాన్ని అడుగుతున్నారు. ఇదిలా ఉంటే, కర్ణాటకలో నాయకత్వ మార్పు లాభాలు, నష్టాల గురించి కాంగ్రెస్ అధిష్టానం అంచనా వేస్తోంది. సీఎం సిద్ధరామయ్య వారసుడిగా డీకే శివకుమార్‌కే అవకాశం ఉందని, ఇందులో మూడో వ్యక్తి పేరు లేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఇప్పటికీ కాంగ్రెస్ నాయకత్వ మార్పు గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
బిగ్ బాస్ లోకి మళ్లీ గౌతమ్.. ఏంటీ ట్విస్టులు
బిగ్ బాస్ సీజన్ 9 లో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ సీజన్లోనే చాలా ట్విస్టులు కనిపిస్తున్నాయి. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా కాంట్రవర్సీ కంటెస్టెంట్లను తీసుకువచ్చి నానా రచ్చ చేయాలని చూశారు. కానీ ప్రేక్షకులు చిరాకు పడటంతో వాళ్ళందరినీ బయటకు పంపించేశారు. ఇక ఈ సీజన్ లో ఆల్రెడీ ఎలిమినేట్ అయిన వారిని తీసుకువచ్చి పోటీ పెట్టారు. అందులో విన్ అయిన భరణిని హౌస్ లో ఉంచారు. సోమవారం నామినేషన్ కు సంబంధించి రచ్చరచ్చ జరిగింది. ఏకంగా పవన్, కళ్యాణ్ కొట్టుకున్నారు. ఇదే మహా దారుణమైతే ఇప్పుడు ఇంకో దారుణం జరిగింది.
పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మూడు విడతల్లో పోలింగ్.. అమల్లోకి ఎలక్షన్ కోడ్
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈ సందర్బంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని మీడియాతో మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె ఎన్నికలకు సంబంధించిన కీలక వివరాలను తెలియజేశారు. ఈ ఎన్నికలు మొదటి విడత పోలింగ్ డిసెంబర్ 11, రెండో విడత డిసెంబర్ 14, మూడో విడత డిసెంబర్ 17 తేదీల్లో జరుగనున్నాయి.ఈ ఎన్నికలతో సంబంధం ఉన్న అన్ని వివరాలు, ఓటర్ల జాబితాలు సహా సమగ్ర సమాచారం అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండనున్నాయని కమిషనర్ తెలిపారు. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల నియమావళి (ఎలక్షన్ కోడ్) అమల్లోకి వచ్చింది.
జీహెచ్ఎంసీలో కలువనున్న 27 మున్సిపాలిటీలు ఇవే..
హైదరాబాద్‌ను మెట్రోపాలిటన్ నగరంగా మరింత విస్తరింపజేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో, ఔటర్ రింగ్ రోడ్ (ORR) పరిధిలో ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)లో విలీనం చేయాలని నిర్ణయించింది. ఒకే పట్టణ ప్రణాళిక కింద మొత్తం మెట్రో ప్రాంతాన్ని తీసుకువచ్చి, రోడ్లు, నీటి సరఫరా, పారిశుద్ధ్యం, డ్రైనేజ్ వంటి సేవల్లో సమాన స్థాయి అందించడం ప్రధాన ఉద్దేశ్యంగా కేబినెట్ పేర్కొంది. GHMC పరిధి పెరగడం వల్ల పన్ను వసూళ్లు గణనీయంగా పెరగడంతో పాటు మరిన్ని పెట్టుబడులు రానున్నాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. విలీనం ప్రతిపాదనపై సమగ్ర నివేదిక సమర్పించాలంటూ GHMC కమిషనర్‌కు ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
సర్పంచ్ అభ్యర్థులను ఏకగ్రీవం చేస్తే.. రూ.10 లక్షల ప్రోత్సాహకం
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే… ఆ గ్రామాభివ్రుద్ది కోసం ప్రత్యేకంగా రూ.10 లక్షల నిధులను అందజేస్తానని కేంద్ర మంత్రి ప్రకటించారు. తాను ఒక్కసారి మాట ఇస్తే తప్పే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీ ప్రజలను ఏకం చేసి అభివ్రుద్ధి వైపు ద్రుష్టి సారించేలా ప్రోత్సహించేందుకే ఈ నిధులను ప్రకటించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ మేరకు బండి సంజయ్ ఈరోజు మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన సారాంశమిదే…
విశాఖపట్టణం గూఢచర్య కేసులో ఇద్దరు నిందితులకు శిక్షలు.. NIA ప్రత్యేక కోర్టు తీర్పు
పాకిస్థాన్ అనుబంధంగా ఉన్న విశాఖపట్టణ నేవీ గూఢచర్య కేసులో మరో ఇద్దరు నిందితులకు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ప్రత్యేక కోర్టు శిక్షలను విధించింది. సింపుల్ ఇంప్రిజన్ (SI)తో పాటు జరిమానా కూడా విధించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కేసులో రాజస్థాన్‌లోని ఝున్‌ఝునూ జిల్లాకు చెందిన అశోక్ కుమార్, అల్వార్ జిల్లాకు చెందిన వికాస్ కుమార్‌లకు UA(P) చట్టం సెక్షన్ 18, అధికార రహస్యాల చట్టం (Official Secrets Act) సెక్షన్ 3 కింద ప్రతి సెక్షన్‌కు 5 సంవత్సరాలు 11 నెలలు జైలు శిక్ష విధించారు. అలాగే కోర్టు విధించిన రూ.5,000 జరిమానా చెల్లించకపోతే మరొక సంవత్సరం SI అనుభవించాల్సి ఉంటుంది. ఈ తీర్పును విశాఖపట్టణంలోని NIA ప్రత్యేక కోర్టు ప్రకటించింది.
స్మృతి మంధాన పెళ్లి కథలో కొత్త ట్విస్ట్.. పలాష్ తల్లి సంచలన వ్యాఖ్యలు
లెజెండరీ బ్యాట్స్‌మెన్ స్మృతి మంధాన ప్రస్తుతం తన పెళ్లి కారణంగా వార్తల్లో నిలిచింది. ఈ స్టార్ క్రికెటర్ వివాహం నవంబర్ 23న జరగాల్సి ఉండగా, ఆమె తండ్రి గుండెపోటు కారణంగా దానిని వాయిదా వేయాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు స్మృతి మంధానకు కాబోయే భర్త పలాష్ ముచ్చల్ తల్లి అమితా ముచ్చల్ ఒక ముఖ్యమైన విషయాన్ని వెల్లడించింది. ఇప్పటి వరకు ఈ వివాహాన్ని వాయిదా వేసింది ఈ స్టార్ క్రికెటర్ వాయిదా వేసిందని అందరూ అనుకున్నారు. కానీ ఈ పెళ్లిని వాయిదా వేయాలనే నిర్ణయం మొదట్లో తన కుమారుడు పలాష్ తీసుకున్నారని అమితా వెల్లడించారు.
బీఆర్‌ఎస్ హయాంలో ఇండస్ట్రియల్ ల్యాండ్ కన్వర్షన్‌లో అక్రమాలు
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎలాంటి స్పష్టమైన విధానం లేకుండా, కేబినెట్ అనుమతి కూడా లేకుండా కొందరికే ఇండస్ట్రియల్ ల్యాండ్ కన్వర్షన్ అనుమతులు ఇచ్చారని, ఆ వివరాలన్నింటిని త్వరలో ప్రజల ముందుంచుతామని తెలిపారు. ఈ నేపథ్యంలోనే పూర్తి పారదర్శకతతో కొత్త ఇండస్ట్రియల్ ల్యాండ్ కన్వర్షన్ పాలసీని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని చెప్పారు. పరిశ్రమలను ORR వెలుపలికి తరలించడం, హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా మార్చడం, ప్రజలపై అదనపు పన్ను భారాన్ని పెట్టకుండానే ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూర్చడం ఈ కొత్త పాలసీ ప్రధాన లక్ష్యాలు అని వివరించారు. 50 శాతం SOR రేటుతో అందరికీ సమాన అవకాశాలు కల్పించే విధంగా ఈ పాలసీ రూపొందించామని స్పష్టం చేశారు.