చైనా మరో ఘనత.. భూమి మీదకు జాబిల్లి ఆవలి వైపు నమూనాలు చంద్రమండల యాత్రల్లో చైనా మరో ఘనత సాధించింది. ప్రపంచ చరిత్రలో తొలిసారి జాబిల్లికి ఆవలి వైపు నమూనాలు సేకరించి.. వాటిని విజయవంతంగా భూమి మీదకు తీసుకొచ్చింది. చంద్రుడి రెండో వైపు నుంచి మట్టి, శిథిలాలను మోసుకుని చాంగే-6 వ్యోమనౌక భూమిని చేరుకుంది. ఉత్తర చైనాలోని ఇన్నర్ మంగోలియా ప్రాంతాల్లో ఇది సురక్షితంగా ల్యాండ్ అయింది. మే 3వ తేదీన చాంగే-6 నింగికెగిరి దాదాపు 53…
వేణు స్వామి క్రేజ్ మాములుగాలేదు.. కన్నడ హీరోయిన్ తో పూజలు.. ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఈయన సోషల్ మీడియలో ఫెమస్ స్టార్ అయ్యాడు.. సెలెబ్రేటీల జాతకాలు ఇవే అంటూ చెబుతూ ట్రెండ్ అవుతున్నాడు. ఇప్పటివరకు ఆయనతో చాలా మంది హీరోయిన్లు పూజలు చేయించుకున్నారు. తెలుగు హీరోయిన్లు పూజలు చేయించుకున్న సంగతి తెలిసిందే.. కానీ ఇప్పుడు ఆయన ఖాతాలో మరో హీరోయిన్ వచ్చి చేరింది.. ఆమె ఎవరో…
పాకిస్థాన్‌లో కలకలం రేపుతున్న కాంగో వైరస్.. పాకిస్థాన్‌లో కాంగో వైరస్ కేసులు పెరుగుతున్నాయి. క్వెట్టా నుంచి తాజాగా మరో కొత్త కాంగో వైరస్ కేసు నమోదైంది. 32 ఏళ్ల రోగి ఫాతిమా జిన్నా ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో చేరారు. ఇప్పుడు వైద్య సంరక్షణలో ఉన్నారు. పాక్ కి చెందిన ఓ న్యూస్ ఛానెల్ ఈ విషయాన్ని వెల్లడించింది. రోగి పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని కిలా సైఫుల్లా జిల్లా కిలా సైఫుల్లా నగరంలో నివాసి అని ఆసుపత్రి వర్గాలు…
నేటి నుంచి లోక్ సభ సమావేశాలు.. నీట్ పరీక్షపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షం రెడీ 18వ లోక్‌సభ తొలి సమావేశాలు సోమవారం (జూన్ 24) నుంచి ప్రారంభం కానున్నాయి. లోక్‌సభ మొదటి సెషన్లో మొదటి రోజు ప్రతిపక్ష ఇండియా కూటమికి చెందిన ఎంపీలు సోమవారం ఉదయం పార్లమెంటు కాంప్లెక్స్‌లో సమావేశమై సభ వైపు కలిసి కవాతు చేస్తారు. కొత్తగా ఎన్నికైన ఎంపీలు ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అంతకుముందు లోక్‌సభ ప్రొటెం…
ఎవరికోసం సింగరేణిని వేలం వేస్తున్నారో కేంద్రం చెప్పాలి..? ఎవరికోసం సింగరేణిని వేలం వేస్తున్నారో చెప్పాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కేంద్రాన్ని ప్రశ్నించారు. కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు సింగరేణిని ప్రయివేటు పరం చేసేందుకు వేగంగా చర్యలు చేపట్టారని తెలిపారు. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డికి మంత్రి పదవి రావడంతో సింగరేణిని కాపాడతారని భావించామని తెలిపారు. సింగరేణి ఒక సంస్థ మాత్రమే కాదు ఈ ప్రాంతం కొంగు బంగారం లక్షలాది మందికి ఉపాధినిస్తున్న…
నీట్ వివాదంపై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు నీట్ పేపర్ లీక్‌పై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. విద్యార్థి సంఘాలతో పాటు ఆయా విపక్ష పార్టీలు నిరసనలు, ధర్నాలు చేపడుతున్నారు. కొద్ది రోజులుగా ఈ వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఇంకోవైపు సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఉభయసభలను ప్రతిపక్షాలు స్తంభింపజేసే అవకాశాలు ఉన్నాయన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. నీట్ పరీక్షలు సజావుగా నిర్వహించడం కోసం…
చూస్తుండగానే కుప్పకూలిన బ్రిడ్జీ.. రూ.కోట్లు నీళ్ల పాలు.. వారంలో రెండో ఘటన బీహార్‌లో మరో వంతెన కూలింది. సివాన్ జిల్లాలోని గండక్ కెనాల్‌పై నిర్మించిన వంతెన శనివారం కుప్పకూలింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. వంతెన కూలిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ వంతెన పాతదని ఓ అధికారి తెలిపారు. వంతెన కూలిపోవడంతో సమీపంలోని డజన్ల కొద్దీ గ్రామాలతో కనెక్టివిటీ కోల్పోయింది.…
నో ఫ్లై జాబితాలోనే ఖలిస్థానీ ఉగ్రవాదులు.. కెనడా కోర్టు కీలక తీర్పు కెనడా ప్రభుత్వం విధించిన నో ఫ్లై జాబితా నుంచి తమ పేర్లు తొలగించాలంటూ ఇద్దరు ఖలిస్థానీ వేర్పాటువాదులు చేసిన అభ్యర్థనను కెనడాలోని ఫెడరల్ కోర్టు ఆఫ్ అప్పీల్ తిరస్కరించింది. ఇద్దరు కెనడియన్ సిక్కులు విమానాలు ఎక్కేందుకు 2018లో నిషేధం విధించింది. అయితే ఇద్దరూ రవాణా భద్రతకు ముప్పు కలిగిస్తారని.. ఉగ్ర చర్యకు పాల్పడతారన్న సహేతుకమైన కారణాలు ఉన్నాయన్న ప్రభుత్వ వాదనతో కోర్టు ఏకీభవించి.. వారి…
అఖిల పక్షంగా ప్రధానిని కలుస్తాం.. కిషన్ రెడ్డి అవకాశం కల్పించాలి.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అవకాశం ఇస్తే అఖిల పక్షంగా వచ్చి ప్రధానిని కలుస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. నేడు 10వ బొగ్గు వేలం ప్రక్రియను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. సింగరేణికి భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని రిజర్వేషన్ ప్రకారం సింగరేణి కి బొగ్గు బ్లాకులు కేటాయించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున మల్లు…
తన క్యాంపు కార్యాలయాన్ని సందర్శించిన పవన్..పంచాయతీ రాజ్ శాఖ వ్యవహరాలపై ఆరా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయాన్ని పరిశీలించారు. పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఆ శాఖ కమిషనర్ కన్నబాబు, ఇతర ఉన్నతాధికారులు సాదర స్వాగతం పలికారు. క్యాంపు కార్యాలయానికి వచ్చిన పవన్ కళ్యాణ్‌కి పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. తన క్యాంప్ ఆఫీసులో అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ భేటీ అయ్యారు. పంచాయతీ రాజ్ శాఖ…