వైసీపీ అధినేత జగన్ నేడు బెంగళూరు నుంచి రానున్నారు. ఆయన గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడ నుంచి రైజ్ ఆసుపత్రికి వెళ్లి అక్కడ ప్రత్యర్ధుల దాడిలో గాయపడిన వైసీపీ కార్యకర్తను పరామర్శించనున్నారు. అక్కడి నుంచి నేరుగా తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వెళ్లనున్నారు. ఎల్లుండి నంద్యాల వెళతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. నంద్యాల వెళ్లి అక్కడ హత్యకు గురైన వైసీపీ నేత సుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శిస్తారు. నేటి నుంచి జగన్ క్యాంప్ ఆఫీస్ లో వైసీపీ కార్యాలయం ప్రారంభం కానుంది. కొత్త కార్యాలయం నుంచి నేటి నుంచి కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. వైసీపీ నేతలు, జగన్ కూడా కార్యకర్తకు అందుబాటులో ఉండేలా ప్లాన్ చేశారు.
Cleanliness-Greenery: మొదటి రోజు ‘స్వచ్ఛదనం-పచ్చదనం’ సక్సెస్..
ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా నేతలు, కార్యకర్తలకు తగిన సమయం కేటాయిస్తున్నారు జగన్. తాడేపల్లి ఆఫీస్ లో ఉన్నా, పులివెందుల క్యాంప్ కార్యాలయంలో అయినా.. ఆయన నిత్యం ప్రజల్ని కలుస్తున్నారు. అదే సమయంలో టీడీపీ దాడుల్లో గాయపడ్డారని చెబుతున్న బాధితుల్ని కలిసి ఓదారుస్తున్నారు. వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్నిస్తున్నారు. వినుకొండ దాడిలో ప్రాణాలు కోల్పోయిన రషీద్ కుటుంబాన్ని కూడా నేరుగా కలసి ధైర్యం చెప్పారు జగన్. ఆమధ్య కడప రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అజయ్ అనే యువకుడిని జగన్ పరామర్శించారు. తాజాగా విజయవాడ ఆస్పత్రిలో ఉన్న వైసీపీ నేత గింజుపల్లి శ్రీనివాసరావుని కలిసేందుకు వస్తున్నారాయన.
Bangladesh Protest : బంగ్లాదేశ్‌లో దేవాలయాలను రక్షించడానికి రాత్రంతా నిలబడిన విద్యార్థులు