రాజ్యసభలో ప్రధాని మోడీ ప్రసంగం.. సభ నుంచి విపక్షాలు వాకౌట్ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ప్రధాని నరేంద్ర మోడీ సమాధానమిచ్చారు. తన ప్రసంగంలో, ప్రధాని, ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకుంటూ, భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ, పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు, రైతుల రుణమాఫీ, మహిళా సాధికారత గురించి కూడా ప్రస్తావించారు. ప్రధాని మోడీ ప్రసంగం సందర్భంగా విపక్షాలు నినాదాలు చేశాయి. అనంతరం విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి.…
ఏపీలో కొత్త ఇసుక పాలసీపై సీఎం సంకేతాలు.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక, రోడ్లు, నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రులు, అధికారులతో సచివాలయంలో వరుసగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కొత్త ఇసుక పాలసీపై ఏపీ సీఎం సంకేతాలు ఇచ్చారు. టీడీపీ హయాంలోని ఇసుక పాలసీకి.. జగన్ ప్రభుత్వ ఇసుక పాలసీకి తేడాను అధికారులు వివరించారు. గత ప్రభుత్వ ఇసుక పాలసీ వల్ల జరిగిన నష్టాన్ని సీఎం…
హాజీపూర్ ఘటన మర్చి పోలేనిది.. హాజీపూర్ ఘటన మర్చి పోలేనిదని మాజీ ఎంపీ వి.హనుమంత రావు అన్నారు. రాహుల్ గాంధీ నిన్న పార్లమెంట్ లో వాస్తవాలు మాట్లాడారని తెలిపారు. హిందువుల మధ్య విద్వేషాలను పెంచొద్దని తెలిపారు. హింసను ప్రోత్సహించొద్దు అన్నారు.. న్యాయం గురించి మాట్లాడుతున్నారని అన్నారు. ఆయన ఎందుకు క్షమాపణ చెప్పాలి? అని ప్రశ్నించారు. బీజేపీ ఓటమి అంచుల నుండి బయట పడిందని తెలిపారు. ఇప్పుడు మోడీ ప్రభుత్వం మెజారిటీ ఉందని ఇష్టం వొచ్చినట్లు మాట్లాడితే సహించేది…
ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురి మృతి..హత్య, ఆత్మహత్య అనే కోణాల్లో దర్యాప్తు మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. రౌడీ గ్రామంలో భర్త, భార్య, ముగ్గురు పిల్లల మృతదేహాలు ఉరివేసుకుని కనిపించాయి. ఈ ఘటనతో గ్రామంలో కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులుసంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎఫ్ఎస్ఎల్ బృందం కూడా ఘటనా స్థలానికి చేరుకుంది. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. అలీరాజ్‌పూర్ ఎస్పీ రాజేష్ వ్యాస్ సమాచారం ప్రకారం.. గునేరి పంచాయతీ రౌడీ గ్రామంలోని…
గవర్నర్ రాధాకృష్ణన్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ రాజ్‌భవన్‌లో గవర్నర్ రాధాకృష్ణన్‌తో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. కేబినెట్ విస్తరణ, బిల్లులు, పెండింగ్ ఎమ్మెల్సీల నియామకంపై గవర్నర్‌తో సీఎం రేవంత్ చర్చ జరిపారు. జులై మూడో వారంలో అసెంబ్లీ సమావేశాలపై చర్చించినట్లు తెలిసింది. మరోవైపు కేబినెట్ విస్తరణపై జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై కూడా చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా బిల్లుల కోసమే గవర్నర్‌తో సీఎం సమావేశమైనట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. మాది మాటల ప్రభుత్వం కాదు……
టీ20 ఫార్మాట్‌కు రవీంద్ర జడేజా వీడ్కోలు విరాట్ కోహ్లీ, రోహిత్‌శర్మ బాటలోనే ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు టీ20 ఇంటర్నేషనల్‌కు వీడ్కోలు పలికారు. ఇప్పుడు ఒక్కరోజు తర్వాత జడేజా ఈ ఫార్మాట్‌కు బై బై చెప్పాడు. రవీంద్ర జడేజా ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో 4 లైన్ల సందేశాన్ని రాసి తన భావాలను వ్యక్తం చేశాడు. జడేజా ఇలా రాశాడు.. “నేను కృతజ్ఞతతో…
పోలవరంపై చంద్రబాబుకు మాత్రమే అవగాహన ఉంది.. చంద్రబాబు నాయుడుకు మాత్రమే పోలవరం ప్రాజెక్టు గురించి మొత్తం తెలుసని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ అన్నారు. ప్రాజెక్ట్ ఎక్కడ దెబ్బతిందో తెలిస్తే ఒక అవగాహన వస్తుందని పేర్కొన్నారు. డిసెంబర్ నుంచి పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభం అవుతున్నాయని తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తిచేసి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు ప్రాజెక్ట్ ఉపయోగపడుతుందన్నారు. వైయస్సార్సీపి ప్రభుత్వంలో ప్రాజెక్టు పూర్తిగా వైఫల్యం జరిగిందని ఆరోపించారు. ఇప్పుడు తప్పుడు…
కొత్తగూడెం పర్యటనకు బయలుదేరిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కొత్తగూడెం పర్యటనకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు బయలుదేరారు. ఆయనతో పాటు.. మంత్రులు కోమటిరడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి బేగంపేట విమానాశ్రయం చేరుకున్నారు. నేడు కొత్తగూడెంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఉదయం 11-00గంటలకు రూ.4కోట్ల రూపాయల DMFT నిధులతో బైపాస్ రోడ్డు నుంచి జివి మాల్ వరకు చేపట్టనున్న డ్రైన్ నిర్మాణ పనులు శంకుస్థాపన…
ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన తొమ్మిది కోచ్ లు.. 70మందికి గాయాలు రష్యాలోని కోమిలో ప్యాసింజర్ రైలు తొమ్మిది కోచ్‌లు పట్టాలు తప్పడంతో 70 మంది గాయపడ్డారు. ఇందులో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. అయితే ఇంకా ఎంతమంది మరణించారో తెలియడం లేదు. రైలు 511 ఆర్కిటిక్ సర్కిల్ మీదుగా ఈశాన్య కోమిలోని వోర్కుటా.. నల్ల సముద్రపు ఓడరేవు నోవోరోసిస్క్ మధ్య సుమారు 5,000 కిలోమీటర్ల దూరంలో ప్రయాణిస్తోంది. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..…
నేడు కృష్ణా జిల్లాలో పర్యటించనున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. పెనమలూరు మండలం తాడిగడపలో నిర్వహించనున్న రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు సంస్మరణ సభలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు. నేడు టీ-20 వరల్డ్ కప్‌లో భారత్-ఇంగ్లాండ్ సెమీఫైనల్ మ్యాచ్. రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం. నేడు ఏపీ ప్రభుత్వానికి రిపోర్డ్ చేయనున్న సీనియర్ IAS అధికారి పీయూష్ కుమార్. పీయూష్‌ను ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీగా నియమించనున్న చంద్రబాబు ప్రభుత్వం. ఇప్పటివరకు కేంద్ర వాణిజ్యశాఖలో…