ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి వృథాగా పోతున్న వరద నీరు..
తూర్పు గోదావరి జిల్లాలోని ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి వరద నీరు వృథాగా సముద్రంలో కలిసి పోతుంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు వృథాగా పోయిన 2000 టీఎంసీల వరద నీరుని అధికారులు సముద్రంలోకి రిలీజ్ చేశారు. ప్రస్తుతం బ్యారేజ్ నుంచి నాలుగు లక్షల ఇరవై మూడు వేల క్యూసెక్కుల మిగులు జలాలు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. గత నెల 26వ తారీఖున 13 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేయగా.. ప్రతి రోజు లక్ష నుంచి 50 వేల క్యూసెక్కుల వరకు నీటి ప్రవాహం తగ్గుతూ వస్తుంది. ఈ విధంగా లక్షలాది క్యూసెక్కుల వరద నీరు వృథాగా అంతర్వేది దగ్గర సముద్రంలో కలిసి పోతుంది.
పీజీటి టీచర్ నుంచి హీరోగా.. మోహన్ బాబుపై డిప్యూటీ సీఎం ప్రశంసలు
మోహన్ బాబు యూనివర్సిటీ మొదటి స్నాతకోత్సవంకు రావడం నా అదృష్టమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఏపీలోని చంద్రగిరిలో శ్రీ విద్యానికేతన్ 13వ గ్రాడ్యుయేషన్ డే, ఎంబీయూ మొదటి స్నాతకోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు, ఛైర్మన్ మంచు మోహన్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు అభినందనలు తెలిపారు. పట్టుదలతో ఏదైనా సాధించవచ్చు అని చెప్పడానికి మోహన్ బాబు జీవితం నిదర్శనమన్నారు. పీజీటి టీచర్ గా జీవితాన్ని మొదలు పెట్టి, స్వర్గం, నరకం సినిమా ద్వారా విలన్ గా సిని రంగ ప్రవేశం చేశారని గుర్తు చేశారు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పాత్రలలో నటించి ఎన్టీఆర్ తర్వాత అంతటి పేరుప్రఖ్యాతులు మోహన్ బాబు గడించారని ప్రశంసించారు. సినిమా రంగంలో బిజీగా ఉన్న కూడా పూర్తి వైరుధ్యం ఉన్న విద్యా వ్యవస్థలో అడుగు పెట్టి స్కూల్ నుంచి యూనివర్సిటీ వరకు తీసుకొచ్చారని కొనియాడారు.
దువ్వాడ శ్రీనివాస్, నేను కలిసే ఉంటాం.. డైవర్స్కి కూడా అప్లై చేశాం
శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలిలో దువ్వాడ కుటుంబ వ్యవహారంపై దివ్వల మాధురి మరోసారి స్పందించింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మా బంధాన్ని రాజకీయ కోణంలో చూడకండి.. వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడకూడదు అని చెప్పుకొచ్చింది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, నేను ఫ్రెండ్స్ అని చెప్పినా.. దువ్వాడపై, నాపై వాణి అనేక ఎలిగేషన్స్ చేయటంతోనే మా బంధం కొనసాగించాలని అనుకుంటున్నాం అని మాధురి వెల్లడించింది. అయితే, దువ్వాడ శ్రీనివాస్ నేను ఇక నుంచి కలిసే ఉంటాం అని దివ్వల మాధురి స్పష్టం చేసింది. దువ్వాడ, నేను ఇద్దరం డైవర్స్ కి అప్లై చేసాం.. దువ్వాడ శ్రీనుతో నా బందం కొనసాగుతుంది.. దువ్వాడను ఇంటి నుంచి గెంటి వేశారు.. దువ్వాడ శ్రీనివాస్ నాకు అండగా ఉన్నారు.. నేను దువ్వాడతో భవిష్యత్ లో కలిసి ముందుకు వెళ్తాం.. టీడీపీ దువ్వాడ విషయంలో రాజకీయం చేస్తుంది అని ఆరోపణలు గుప్పించింది. దువ్వాడ వాణి క్షమాపణ చెబితే నేను దేశం వదిలి వెళ్లిపోతాను అంటూ దివ్వల మాధురి పేర్కొనింది.
విద్యార్థులు క్రీడల్లో రాణించేందుకు తల్లిదండ్రులు ప్రోత్సహించాలి: సైనా
ప్రస్తుతం విద్యార్థులు క్రీడల్లో రాణించేందుకు వారి తల్లిదండ్రులు ప్రోత్సహించాలని స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ సూచించారు. క్రీడలకు ఉజ్వల భవిష్యత్తు ఉందన్నారు. బ్యాడ్మింటన్ తన ఆత్మలో ఉందని, ఎప్పటికీ వదిలిపెట్టను అని చెప్పారు. రెజ్లర్ వినేష్ ఫోగట్‌కు పతకం వస్తుందని తాను ఆశిస్తున్నా అని సైనా నెహ్వాల్ పేర్కొన్నారు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో మహిళల సింగిల్స్‌లో సైనా కాంస్య పతకం కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
మణికొండ మున్సిపల్ పరిధిలోని అల్కాపురి కాలనీలో ఏర్పాటు చేసిన ఓ స్పోర్ట్స్ షాప్‌ను సైనా నెహ్వాల్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సైనా మాట్లాడుతూ… ‘నేను బ్యాడ్మింటన్‌ను ఎప్పటికీ వదిలిపెట్టను. నా భర్త పారుపల్లి కశ్యప్ కూడా ఇదే రంగంలో కోచింగ్ ఇస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థులు క్రీడలో రాణించేందుకు వారి తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. క్రీడలకు ఉజ్వల భవిష్యత్తు ఉంది. పిల్లలకు పౌష్టికాహారం అందించి ఎప్పుడు ఫిట్‌గా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే’ అని అన్నారు.
కరెంట్ బిల్లుల చెల్లింపు కోసం QR కోడ్‌లు నిలిపివేత
విద్యుత్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని సైబర్ మోసాల సంఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో, క్యూఆర్ కోడ్‌తో వినియోగదారులకు ఇంధన బిల్లులను జారీ చేస్తామని గత నెలలో ప్రకటించిన సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (TGSPDCL) సదుపాయాన్ని నిలిపివేసింది. ఆగస్టు నుండి థర్డ్-పార్టీ యాప్‌ల ( UPIలు ) ద్వారా ప్రత్యక్ష చెల్లింపు నిలిపివేయబడిన తర్వాత యుటిలిటీ వెబ్‌సైట్ లేదా యాప్‌లో యునిక్ సర్వీస్ కనెక్షన్ (USC) నంబర్‌ను నమోదు చేయాల్సిన అవసరం లేకుండా అవాంతరాలు లేని చెల్లింపును అందించాలనే ఆలోచన ఉంది . అయితే, సైబర్ మోసగాళ్లు ఈ సదుపాయాన్ని దుర్వినియోగం చేస్తారనే భయంతో SPDCL ఈ ఆలోచనను విరమించుకుంది.
విశాఖ సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో ఫైర్ యాక్సిడెంట్..
విశాఖలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో ఆస్పత్రి సిబ్బంది భయంతో పరుగులు తీశారు. 5వ అంతస్తు అడ్మిన్ బ్లాక్లో మొదలైన మంటలు.. ఇతర బ్లాకుల్లోకి వ్యాపించాయి. ఈ క్రమంలో ఆస్పత్రిలో ఉన్న పేషంట్లకు ఇబ్బంది తలెత్తకుండా ఆస్పత్రి సిబ్బంది చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో.. వారు వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అగ్ని ప్రమాద ఘటనపై నగర కమీషనర్ ఎస్. బాగ్జీ మాట్లాడుతూ.. సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయని అన్నారు. ఆసుపత్రుల్లో తరుచు అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడం బాధకరం అని తెలిపారు. హెఆర్ డిపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని.. ప్రమాదం జరిగిన వెంటనే రోగులకు ఏమీ జరగకుండా వేరే వార్డులకు షిప్ట్ చేసారని అన్నారు. అనేక మంది ప్రాణాలు రక్షించుకోవాడానికి ఆసుపత్రులకు వస్తారు.. వారిని రక్షించుకోవాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందని పేర్కొన్నారు. నిర్లక్ష్యం వ్యవహరిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాలని కమీషనర్ హెచ్చరించారు. ఇప్పటికైన మిగిలిన ఆసుపత్రులు సెఫ్టీ ఆడిట్ చేసుకుని అంతా సరిగా ఉందా లేదా చెక్ చేసుకోవాలని సూచించారు.
“ఇది మోడీ ఇండియా”.. కాంగ్రెస్ నేతల ‘‘బంగ్లాదేశ్’’ వ్యాఖ్యలపై ఫైర్..
బంగ్లాదేశ్ అల్లర్లు, హింసను ఉద్దేశించి కొందరు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ.. భారత్‌లో కూడా ఇదే పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, సీడబ్ల్యూసీ సభ్యుడు సల్మాన్ ఖుర్షీద్ ఇటీవల ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో, భారత్‌లో కూడా బంగ్లాదేశ్ లాంటి పరిస్థితి రావచ్చని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్ అవుతోంది. కాంగ్రెస్ నేతలు దేశంలో బంగ్లాదేశ్ పరిస్థితి రావాలని కోరుకుంటున్నారా..? అని బీజేపీ ప్రశ్నించింది. ఇదిలా ఉంటే, మధ్యప్రదేశ్‌కి చెందిన ఓ కాంగ్రెస్ నేత మాట్లాడుతూ.. ప్రధాని మోడీకి కూడా హసినాకు పట్టిన గతే అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏదో రోజు ప్రజలు ప్రధాని ఇంటిని స్వాధీనం చేసుకుంటారని ఆయన చెప్పడంపై కేసు నమోదైంది.
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల కదలికలు.. పోలీసులు అప్రమత్తం
బలోద్‌లో ఇద్దరు మహిళలు, కొందరు సాయుధులతో సహా తొమ్మిది మంది మావోయిస్టుల యూనిఫారంలో మావోయిస్టు కార్యకలాపాలు సాగిస్తున్నట్లు ఛత్తీస్‌గఢ్ పోలీసులు ఆదివారం తెలిపారు. ఇది ఆగస్ట్ 4న గుర్తించబడింది. అదనంగా, మహామాయ పోలీస్ స్టేషన్ పరిసరాల్లో నలుగురు వ్యక్తులు కనిపించారు, జూలై 2021లో మావోయిస్టు ప్రభావిత జాబితా నుండి జిల్లా తొలగించబడినప్పటికీ ఆందోళనలు రేకెత్తించాయి. దొండి బ్లాక్‌లోని మహామాయ , దుల్కీ గనులు చరిత్ర కలిగి ఉన్నాయి. నక్సలైట్ హింస, ఇప్పుడు పునఃపరిశీలన జరిగింది. ఈ ప్రాంతం గతంలో గన్‌పౌడర్ దోపిడీ, వాహనాల పేలుళ్లు , దహనం వంటి ముఖ్యమైన సంఘటనలను ఎదుర్కొంది, ఇది మహామాయలో పోలీసు స్టేషన్ ఏర్పాటుకు దారితీసింది.
కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్ 19 గేటు.. స్పందించిన కర్నాటక డిప్యూటీ సీఎం
కర్ణాటకలోని హోస్పేట్లో గల తుంగభద్ర జలాశయం ఉన్న 33 గేట్లలో 19వ గేటు వరద నీటి దాటికి కొట్టుకుపోయింది. దీంతో ఆ గేటు నుంచి ఇప్పటివరకు లక్ష క్యూసెక్కుల నీరు వృథాగా దిగువకు వెళుతుంది. వాస్తవంగా తుంగభద్ర జలాశయానికి వరద తగ్గడంతో శనివారం రాత్రి 11 గంటల సమయంలో గేట్లను మూసివేస్తున్న క్రమంలో 19వ గేటు చైన్ లింక్ తెగి కొట్టుకుపోయింది. దీంతో.. కర్ణాటక అధికారుల్లో టెన్షన్ మొదలైంది. ఈ ప్రమాదం వల్ల తెలుగు రాష్ట్రాలకు భారీ నష్టం ఏర్పడనుంది. కాగా.. తుంగభద్ర డ్యామ్ లో 60 టీఎంసీలు ఖాళీ చేస్తేనే మరమ్మతులకు అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే 29 గేట్ల ద్వారా లక్ష 8 వేలు క్యూసెక్కులు విడుదల చేశారు. ఐదారు రోజుల్లో 60 టీఎంసీలు దిగువకు విడుదల చేయనున్నారు. దీంతో.. తెలుగు రాష్ట్రాల్లోని ఉమ్మడి మహబూబ్ నగర్, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలపై ప్రభావం పడనుంది. సాగునీటికి, తాగునీటికి ఇబ్బంది పడే అవకాశం ఉంది. అయితే.. సీడబ్ల్యుసీ చైర్మన్ రవీంద్ర, డిప్యూటీ సీఎం శివకుమార్, ఎమ్మెల్యేలు కాల్వ శ్రీనివాసులు, విరుపాక్షి తుంగభద్ర డ్యామ్ ను పరిశీలించారు.
పొన్నం అన్న ఉద్యమకారుడు.. ఉత్సహవంతుడు మంచి చేస్తాడు..
రవీంద్రభారతిలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి జాతీయ వారోత్సవాలు జరిగాయి. సర్దార్ పాపన్న మహారాజ్ ధర్మపాలన సంస్థ.. జైగౌడ్ ఉద్యమం ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కర్ణాటక కాంగ్రెస్ నేత ఎంఎల్సీ బీకే హరిప్రసాద్ గౌడ్ హాజరయ్యారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి కార్యక్రమానికి గౌడ ప్రతినిధులు.. గౌడ కులస్తులు.. వివిధ రంగాలకు చెందిన గౌడ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. పర్మినెంట్‌గా సర్వాయి పాపన్న జయంతి.. వర్ధంతి చేసేలా జీఓ ఇచ్చామని, వైన్స్ షాప్స్ లలో రిజర్వేషన్స్ తీసుకువచ్చాం.. హైదరాబాద్ లో కళ్లు దుకాణాలు పెట్టినమన్నారు. నేను మంత్రిగా ఉన్నప్పుడు గౌడ్స్ కు సంబంధించిన ఏ అంశం ఉన్న పొన్నంకు చెప్తుండే అని, ఏ సమావేశానికైనా నేనే స్వయంగా పొన్నంకు కాల్ చేసి ఇన్వైట్ చేశానన్నారు. నాకు చేతనైనంత నేను చేశాను.. పొన్నం అన్న కూడా చేస్తాడన్నారు.