ఆదర్శంగా సీఎం కుమారుడు.. సామూహిక వివాహా వేడుకలో పెళ్లి.. ప్రస్తుత కాలంలో సాధారణ ఎమ్మెల్యే కుమారుడి పెళ్లి అంటేనే అంగరంగ వైభవంగా జరుగుతుంది. కోట్ల రూపాయలు ఖర్చు చేసి వివాహాలు చేస్తున్నారు. కానీ, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ కుమారుడు మాత్రం ఈ విషయంలో చాలా మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మోహన్ యాదవ్ చిన్న కుమారుడు అభిమన్యు యాదవ్ అత్యంత నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు. అభిమన్యు యాదవ్, ఇషితా యాదవ్ సామూహిక వివాహ వేడుకల్లో ఒకటయ్యారు. పరువు…
సర్పంచ్ పోరుకు కన్నతల్లితోనే పోటీ.. నామినేషన్ దాఖలు చేసిన తల్లీకూతుళ్లు జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం తిమ్మయ్యపల్లిలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. సర్పంచ్ స్థానానికి తల్లీకూతుళ్లు పోటీకి దిగారు. తల్లి గంగవ్వ, కూతురు పల్లెపు సుమ నామినేషన్ దాఖలు చేశారు. తిమ్మయ్యపల్లి సర్పంచ్ స్థానం బీసీ మహిళ రిజర్వ్ చేశారు. పల్లెపు సుమ అదే గ్రామానికి చెందిన అశోక్‌ను 2017లో ప్రేమ వివాహం చేసుకుంది. దీంతో ఇరు కుటుంబ మధ్య కలహాలు మొదలయ్యాయి. మొన్నటి వరకు…
టీటీడీ కల్తీ నెయ్యి కేసులో బిగ్ ట్విస్ట్.. టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రారంభంలో ఫిర్యాదు చేసిన అధికారుల పేర్లు కూడా ఇప్పుడు నిందితుల జాబితాలో చేరాయి. ఈ సందర్భంగా సిట్ (SIT) మరో మెమో దాఖలు చేస్తూ మొత్తం 11 మందిని అదనంగా నిందితులుగా నమోదు చేసింది. అయితే, ఈస్ట్ పీఎస్‌లో కల్తీ నెయ్యి జరిగిందని ఫిర్యాదు చేసిన అప్పటి జీఎం మురళీకృష్ణపై కూడా కేసు నమోదు కావడం పెద్ద చర్చగా…
ఎస్సీ రిజర్వేషన్ జాక్‌పాట్.. ఏకైక అభ్యర్థిగా మల్లమ్మ ఎంపిక వరంగల్ జిల్లా సంగెం మండలంలోని ఆశాలపల్లి గ్రామ పంచాయతీలో రిజర్వ్ సీటు కారణంగా కొంగర మల్లమ్మ సర్పంచ్‌గా ఎన్నుకోబడ్డారు. ఆ ఊరిలో 1,600 కి పైగా ఓటర్లు ఉన్నప్పటికీ, ఎస్సీ మహిళా రిజర్వ్ సీటు కారణంగా ఒక్కరే మహిళ ఉండటంతో.. మల్లమ్మకు ఈ పదవి లభించింది. గ్రామ పంచాయతీకి రిజర్వేషన్ కింద ఎస్సీ మహిళా స్థానంలో ఒక్కరు మాత్రమే ఉండటంతో సర్పంచ్ పదవి మల్లమ్మకు వెళ్లింది అని…
మూడు కొత్త జిల్లాలు, ఐదు కొత్త రెవెన్యూ డివిజన్లకూ గ్రీన్ సిగ్నల్..! ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలనా వ్యవస్థలో మరో కీలక మార్పు చోటుచేసుకుంది. రాష్ట్రంలో మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారికంగా ఆమోదం తెలిపారు. తాజా నిర్ణయంతో మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాలు కొత్తగా ఏర్పడనున్నాయి. ఇందులో రంపచోడవరం కేంద్రంగా కొత్తగా పోలవరం జిల్లా ఏర్పాటు కానుంది. ప్రజలకు పరిపాలన మరింత చేరువ కావాలని, సేవల వేగవంతమైన అందుబాటు కోసం ప్రభుత్వం ఈ…
ప్రభాస్ ను దాచేస్తున్న వంగా.. కారణం అదేనా ! నేడు జరిగిన స్పిరిట్ మూవీ ఈవెంట్‌కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ కార్యక్రమం మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఈవెంట్ ఫొటోల్లో ఒక విషయం అందరి దృష్టిని ఆకర్షించింది. అది రెబల్ స్టార్ ప్రభాస్ కనిపించకపోవడం. సాధారణంగా ఇలాంటి కీలక ఈవెంట్లకు ఆయన వచ్చినప్పుడు ఫొటోలు బయటకు రావడం కామన్. కానీ ఈసారి అలా జరగలేదు. దీంతో ప్రభాస్ రాలేదని అనుకుంటున్నారు. కానీ…
మెగాస్టార్ చేతుల మీదుగా స్పిరిట్ ప్రారంభం ప్రభాస్ – డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా భారీ చిత్రం ‘స్పిరిట్’ రెగ్యులర్ షూట్ ఎట్టకేలకు ప్రారంభం అయ్యింది. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే ప్రభాస్ అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఎప్పుడెప్పుడు షూట్ మొదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. నేడు ఈ మూవీ భారీ ముహూర్త పూజ కార్యక్రమాలతో అధికారికంగా లాంచ్ అయింది. ఈ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా…
మెట్రో దగ్గర ఫేక్ దందా..పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్న నకిలీ సిబ్బంది.. ప్రజలను బురిడీ కొట్టించేందుకు.. నకిలీ రాయుళ్లు ఎక్కడిపడితే అక్కడ రెడీగా ఉంటున్నారు. ఢిల్లీలోని జనక్ పురి ఈస్ట్ మెట్రో స్టేషన్ వ్యక్తి.. వాహనదారులను ఆపి డబ్బులు వసూలు చేస్తున్నాడు. దీంతో నకిలీ వసూళ్ల పర్వం బయటపడిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే.. ఇలాంటి బురీడీ రాయుళ్లు ప్రతినిత్యం మనకు ఎక్కడో ఓ చోట తారసపడుతుంటారు. ప్రతి ఒక్క…
కులతత్వ విషాన్ని చిమ్ముతున్న వాళ్లను బీహారీలు తిరస్కరించారు.. సూరత్‌లో స్థిరపడిన బీహారీలు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మరోసారి స్పందిస్తూ.. విపక్ష పార్టీలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కులతత్వ విషాన్ని చిమ్ముతున్న వారిని, ముస్లిం లీగ్ -మావోయిస్టు భావజాలం కలిగిన వారిని ఇక్కడి ప్రజలు తిరస్కరించారని తెలిపారు. అలాగే, పదేళ్ల నుంచి వరుస ఓటములపై రాహుల్…
అడవిలో ఫోటోలు దిగుతున్న యువకుడు.. పొదల్లోకి లాక్కెళ్లిన పులి రోజు ఎన్నో రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఒక వీడియో మాత్రం అందరిని ఒక్కసారిగా భయభ్రాంతులకు గురిచేసింది. అయితే.. ఓ వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్ కోసం అడవిలో కారు దిగి.. పోటోలు దిగుతుండగా.. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు గానీ.. ఓ పులి ఆ యువకుడిని పొదల్లోకి లాక్కెళ్లింది. దీంతో అక్కడున్న వాళ్లంతా భయాందోళనకు గురయ్యారు. ఈ వీడియో వైరల్ అవుతుంది.…