ఏ తండ్రికి ఇలాంటి పరిస్థితి రాకూడదు.. నిఖిత కుటుంబ సభ్యుల ఆవేదన..! అమెరికాలోని మేరీల్యాండ్‌లో అనుమానాస్పద రీతిలో మృతిచెందిన గోడిశాల నిఖిత హత్య ఘటన కుటుంబ సభ్యులను తీవ్ర మనోవేదనకు గురిచేసింది. డబ్బులు ఇస్తానని చెప్పి పిలిపించుకుని, ఆర్థిక వివాదాల నేపథ్యంలో అర్జున్ శర్మ అత్యంత కిరాతకంగా నిఖితను హతమార్చాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. డిసెంబర్ 31న డబ్బులు కావాలంటూ అర్జున్ శర్మ ఫోన్ చేయడంతో నిఖిత అక్కడికి వెళ్లిందని, ఆ సమయంలో ఇద్దరి మధ్య గొడవ…
చాట్ జీపీటీ, గ్రోక్, జెమిని, ఇతర AI చాట్బాట్లను.. అడగకూడని విషయాలు ఇవే ChatGPT, Grok, Google Gemini వంటి AI చాట్బాట్ల వినియోగం పెరిగింది. పలు రంగాల్లోని వ్యక్తులు, విద్యార్థులు వీటిని ఉపయోగిస్తున్నారు. నిపుణులు వీటిని ఉపయోగిస్తున్నారు. ఈ టూల్స్ రాయడానికి, కొత్త విషయాలను నేర్చుకోవడానికి లేదా మీరు ఆలోచించగలిగే ఏదైనా విషయం గురించి వాస్తవాలను త్వరగా వెతకడానికి ఉపయోగపడతాయి. కానీ వాస్తవంగా చెప్పాలంటే, AIని అడగడానికి ప్రతి ప్రశ్న సురక్షితం కాదు. మీరు మీ…
భారత్ కూడా అమెరికా వెనిజువెలాను చేసినట్లు చేయాలి.. ఓవైసీ కీలక వ్యాఖ్యలు.. వెనిజువెలా అధ్యక్షుడు నికోలాస్ మడురోను అమెరికా సైన్యం సొంత దేశంలోనే పట్టుకుని అమెరికాకు తీసుకెళ్లిన ఘటనను ప్రస్తావిస్తూ ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే తరహాలో 26/11 ముంబై ఉగ్రదాడుల సూత్రధారులను కూడా భారత్‌కు తీసుకురావాలని డిమాండ్ చేశారు. కారకాస్‌లో జరిగిన అమెరికా సైనిక దాడిలో మడురోను, ఆయన భార్యను అదుపులోకి తీసుకుని అమెరికాకు తరలించిన సంగతి తెలిసిందే. డ్రగ్…
వెనిజులా అధ్యక్షుడిపై అమెరికా మోపబోతున్న కేసులు ఏంటి? వెనిజులాపై ఈ రోజు అమెరికా భీకర దాడులు చేసింది. రాజధాని కారకస్‌పై బాంబుల వర్షం కురిపించింది. ఏం జరుగుతుందో తెలిసే లోపే, ట్రంప్ బాంబ్ పేల్చాడు. తాము వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను తాము నిర్బంధించామని, యూఎస్‌కు తీసుకువస్తున్నట్లు ప్రకటించడంతో ప్రపంచం షాక్ అయింది. అయితే, ఈ దాడులపై ప్రపంచ దేశాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. క్యూబా, అర్జెంటీనా, కొలంబియా వంటి లాటిన్ అమెరికా…
తెలంగాణ స్థానిక ఎన్నికల్లో పెను మార్పు.. ఇద్దరు పిల్లల నిబంధనకు చెక్.. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. పంచాయతీరాజ్ చట్టంలోని 21వ సెక్షన్‌ను సవరిస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు రాష్ట్ర అసెంబ్లీ శనివారం అధికారికంగా ఆమోదం తెలిపింది. ఈ సవరణ ద్వారా, గత కొన్ని దశాబ్దాలుగా అమలులో ఉన్న “ఇద్దరు పిల్లల నిబంధన”ను ప్రభుత్వం పూర్తిగా తొలగించింది. అంటే, ఇకపై ఇద్దరి కంటే ఎక్కువ మంది సంతానం…
ఖమేనీకి వ్యతిరేకంగా తీవ్ర ఆందోళనలు.. పోలీసుల కాల్పుల్లో ఆరుగురు మృతి ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. గత ఆరు రోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రస్తుతం తీవ్ర రూపం దాల్చాయి. షియా మతాధికారుల కోట అయిన కోమ్కు చేరుకున్నాయి. దీంతో భద్రతా దళాలు అడ్డుకునేందుకు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇప్పటివరకు ఆరుగురు నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు. క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకారులు ఆందోళనలు చేపట్టారు.…
ఫరీదాబాద్‌లో దారుణం.. కదులుతున్న వ్యాన్‌లో మహిళపై గ్యాంగ్‌రేప్ ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మృగాళ్లలో మార్పు రావడం లేదు. కామంతో కళ్లు మూసుకుపోయిన కామాంధులు అఘాయిత్యాలకు తెగబడుతున్నారు. తాజాగా హర్యానాలోని ఫరీదాబాద్‌లో దారుణం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున 28 ఏళ్ల మహిళపై కదులుతున్న వ్యాన్‌లో రెండున్నర గంటల పాటు ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం రోడ్డుపై విసిరేసి పరారయ్యారు. ఈ ఘటన సంచలనం సృష్టిస్తోంది. సోమవారం-మంగళవారం మధ్య రాత్రిలో వివాహిత ఇంటికి వెళ్లేందుకు వాహనం కోసం…
20 ఏళ్లకే అరుదైన రికార్డ్.. ఏ హీరోయిన్‌కు దక్కని క్రెడిట్ సారా సొంతం! ‘సారా అర్జున్’.. ఈపేరు ఇప్పుడు భారతీయ సినీ రంగంలో మారుమోగుతోంది. మొదటి సినిమాలోనే తనకంటే 20 ఏళ్ల పెద్ద హీరోతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ‘చిన్న పిల్ల’ అంటూ విమర్శలు చేసిన నోళ్లతోనే వావ్ అనిపించుకుంది సారా. తొలి సినిమాతోనే భారీ హిట్ ఖాతాలో వేసుకుంది. వంద కాదు, రెండొందలు కాదు.. ఏకంగా వెయ్యి కోట్ల హీరోయిన్గా ఎదిగింది. ఎవరూ ఊహించని విధంగా…
భారత్-పాక్ యుద్ధం ఆపితే గుర్తించలేదు.. నెతన్యాహుతో ట్రంప్ ఆవేదన భారత్-పాకిస్థాన్ యుద్ధం విషయాన్ని ట్రంప్ మరోసారి ప్రస్తావించారు. రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపితే సరైన క్రెడిట్ దక్కలేదని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లో నెతన్యాహును కలిసిన సందర్భంగా మరోసారి ట్రంప్ గుర్తుచేశారు. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. అనంతరం భారత ప్రభుత్వం మే 7న పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. మే 10న ఇరు దేశాలు…
కొత్త టెర్రరిస్ట్ లీడర్‌ను సృష్టించిన పాకిస్థాన్.. ఎన్నిసార్లు కొట్టిన చావని పాము లాంటిది ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఉగ్రవాదం. నిజానికి ఆపరేషన్ సింధూర్ తర్వాత టాప్, వాంటెడ్ టెర్రరిస్ట్‌లు అయిన హఫీజ్ సయీద్, మసూద్ అజార్ వంటి వారు పాకిస్థాన్‌లో అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇదే టైంలో పాకిస్థాన్ ఒక కొత్త టెర్రరిస్ట్ లీడర్‌ను సృష్టించింది. ఇంతకీ ఆయన ఎవరు, ఎందుకని ఆయనకు పాకిస్థాన్ సైన్యం మద్దతు ఉందని చెబుతున్నారు.. ఇవన్నీ ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఈ కొత్త…