ముగిసిన మొదటిరోజు ఆట.. స్కోర్ ఎంతంటే? కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ తొలి రోజు వార్ వన్ సైడ్ లా ముగిసింది. టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకోగా.. ఆ నిర్ణయం పూర్తిగా ఫలితాన్ని ఇచ్చింది. భారత బౌలర్ల దెబ్బకు దక్షిణాఫ్రికా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 159 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ఆరంభం బాగానే కనిపించినా.. ఆ తర్వాత భారత బౌలర్లు…
కుంభ, మందాకిని అదుర్స్.. ఇక నెక్స్ట్ రుద్ర, సోషల్ మీడియా షేకే! ‘సూపర్ స్టార్’ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న ‘ఎస్ఎస్ఎంబీ 29’ నుంచి వరుస అప్డేడ్స్ వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి చిత్ర యూనిట్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది. ఆయన ‘కుంభ’ అనే పాత్రలో విలన్‌గా నటిస్తున్నట్టుగా తెలిపారు. అయితే వీల్ చైర్లో ఉన్న కుంభ లుక్‌పై కాస్త ట్రోలింగ్ జరిగింది కానీ.. సైంటిఫిక్‌గా రాజమౌళి…
ఇస్లామాబాద్ ఆత్మాహుతి దాడికి భారత్ కారణం.. పాక్ ప్రధాని ఆరోపణలు.. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ కోర్టు వెలుపల ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 12 మంది మరణించారు. అంతకుముందు, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు సమీపంలో ఉన్న వానాలోని క్యాడెట్ కాలేజీపై సోమవారం దాడి జరిగింది. ఈ రెండు దాడుల్లో భారత్ పాత్ర ఉందని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆరోపించారు. ఈ రెండు దాడులు ‘‘భారత స్పాన్సర్ ఉగ్రవాద ప్రాక్సీ దాడులు’’ అని నిందించారు. పాకిస్తాన్‌ను అస్థిరపరిచేందుకు…
భూముల వేలంలో రికార్డు.. రాయదుర్గంలో గజం ధర రూ.3.40 లక్షలు తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGIIC) నిర్వహించిన వేలంలో భూముల ధరలు రికార్డు సృష్టించాయి. హైదరాబాద్ నాలెడ్జ్ సిటీకి నడిబొడ్డున ఉన్న రాయదుర్గం ప్రాంతంలో ఒక ఎకరం భూమికి చదరపు గజానికి రూ.3,40,000 ల చొప్పున గణనీయమైన ధర పలికింది. చదరపు గజానికి ₹3,40,000 ల చారిత్రాత్మక ధరతో ఈ వేలం మునుపటి రికార్డును బద్దలు కొట్టింది. గతంలో, 2017లో చదరపు గజానికి రూ.88,000…
దేవాలయాల్లో తొక్కిసలాటల నివారణకు కీలక నిర్ణయం రాష్ట్రంలోని దేవాలయాల్లో తొక్కిసలాట ఘటనల నివారణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించింది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దేవాలయాల్లో తొక్కిసలాటల నివారణ, భద్రతా చర్యల పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసిన ఈ ఉపసంఘం, క్రమం తప్పకుండా పరిస్థితులను సమీక్షించి సూచనలు ఇవ్వనుంది. ప్రత్యేకంగా, 2019-24 మధ్యలో దేవాలయాలపై జరిగిన దాడులు, వాటిపై తీసుకున్న చర్యలపై…
సుమన్ శెట్టికే జై కొడుతున్న బిగ్ బాస్ ఫ్యాన్స్.. కప్ కొట్టేస్తాడా..? బిగ్ బాస్ సీజన్ 9 మొదలైన దగ్గర నుంచి ఒక కంటెస్టెంట్ మీదే అందరి దృష్టి ఉంది. ఆయనే సుమన్ శెట్టి. మొదటి వారం నుంచే ఆయన తన కామెడీ, ఇన్నోసెంట్, సింపుల్ నేచర్‌తో, నిజాయితీతో ప్రేక్షకుల మనసు గెలుచుకుంటున్నారు. సోషల్ మీడియాలో కూడా ఆయన ఫ్యాన్‌బేస్ రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఆయన ఆటకు, మాటలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఆయనకు భారీగా…
వర్షం కారణంగా రద్దైన ఐదో T20 మ్యాచ్.. సిరీస్ భారత్ కైవసం భారత్- ఆస్ట్రేలియాల మధ్య 5T20 సిరీస్ జరిగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నేడు T20 సిరీస్‌లోని ఐదవ, చివరి మ్యాచ్ (నవంబర్ 8) బ్రిస్బేన్‌లోని గబ్బాలో జరిగింది. ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. భారత్ ఆట ప్రారంభించిన కాసేపటికే వర్షం అంతరాయం కలిగించింది. వర్షం కారణంగా మ్యాచ్ డ్రా…
ఉప ఎన్నికలో 25 వేల ఓట్లు వస్తే.. కిషన్ రెడ్డికి మరొకసారి పొన్నం ఛాలెంజ్! కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ మరోసారి సవాల్ విసిరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థికి 25 వేల ఓట్లు వచ్చాయని, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో 25 వేలకు ఒక్క ఓటు తగ్గకుండా తీసుకువస్తే.. మీరేం (కిషన్ రెడ్డి) చెబితే అందుకు తాను సిద్ధం అని చెప్పారు. 25 వేల ఓట్లు బీజేపీ…
కేసీఆర్‌కు 40 లెటర్లు రాశాను.. కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు.. ఓటు వేయక పోతే సన్న బియ్యం, ఫ్రీ బస్ ఆగిపోతుంది అని సీఎం అన్నారు.. సన్నబియ్యంలో కేంద్ర ప్రభుత్వానిదే సింహభాగం.. ఏ విధంగా సీఎం ఆపుతారో చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. సకల సమస్యలకు పరిష్కారం ఫ్రీ బస్సు అనే విధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చిన నిధులను, వచ్చిన సంస్థల వివరాలు కిషన్‌రెడ్డి వివరించారు. వచ్చే ఏడాది…
మౌనం వీడిన షేక్ హసీనా.. ‘బంగ్లాదేశ్ నిరసనల వెనక ఆ రెండు దేశాల హస్తం’ దేశం విడిచి వెళ్లిన తర్వాత తొలిసారిగా బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా తన మౌనాన్ని వీడారు. దేశంలో విద్యార్థుల నిరసనల తర్వాత జరిగిన తిరుగుబాటు గురించి ఆమె తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. తనకు వ్యతిరేకంగా జరిగిన విద్యార్థుల నిరసనలు అమెరికా కుట్రపన్ని పాకిస్థాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగ్రవాద దాడి అని షేక్ హసీనా పేర్కొన్నారు. షేక్ హసీనా..…