మహారాష్ట్రలో ఓ టీనేజ్ బాలిక తన బాయ్ ఫ్రెండ్ తో పారిపోయేందుకు ఏకంగా కిడ్నాప్ డ్రామా ఆడింది. చివరకు పోలీసు విచారణలో అసలు విషయం తెలిసింది. వివరాల్లోకి వెళ్తే పాల్ఘర్ జిల్లాకు చెందిన 17 ఏళ్ల బాలిక కిడ్నాప్ తన బాయ్ ఫ్రెండ్ తో పారిపోయేందుకు కట్టకథను అల్లింది. పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. పాల్ఘర్ లోని విరార్ ప్రాంతంలో నివసిస్తున్న బాలిక, స్థానికంగా ఉన్న ఓ కంపెనీలో హౌస్ కీపింగ్ విభాగంలో పనిచేస్తుంది.