బిగ్ సర్ప్రైజ్… OG ఫస్ట్ లుక్ వచ్చేస్తుంది…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అడగకముందే అదిరిపోయే అప్డేట్స్ ఇస్తున్నారు ఓజి మూవీ మేకర్స్. అందుకే రోజు రోజుకి ఓజి పై హైప్ పెరుగుతునే ఉంది. ప్రస్తుతం పవన్ చేస్తున్న సినిమాల్లో… ఓజి పై సాలిడ్ బజ్ ఉంది. పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా, ఒక పవన్ అభిమానిగా సుజీత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్‌లో జరుగుతోంది. కుదిరితే ఈ ఏడాదిలోనే ఓజి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి ఆన్ సెట్స్ వర్కింగ్ స్టిల్స్ మాత్రమే బయటికొచ్చాయి. ఆ స్టిల్స్ పవన్ ఫ్యాన్స్‌కు పిచ్చెక్కిస్తున్నాయి. అలాంటిది ఇక పవన్ ఓజి ఫస్ట్ లుక్ బయటిస్తే రచ్చ రంబోలానే. ఇప్పుడా సమయం రానే వచ్చేసినట్టు తెలుస్తోంది. బిగ్ సర్ప్రైజ్ ఇస్తూ ఓజి ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.
లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం ఓజి ఫస్ట్ లుక్‌ని ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగష్టు 15న రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అదే జరిగితే పవన్ ఫ్యాన్స్‌కు పండగేనని చెప్పొచ్చు. త్వరలోనే దీని పై క్లారిటీ రానుందని అంటున్నారు. ఇక ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తున్నాడు. పవర్ స్టార్ ఫాదర్‌గా ఓ బాలీవుడ్ బడా స్టార్ నటిస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే ప్రస్తుతం థియేటర్లో బ్రో మూవీ భారీ వసూళ్లను రాబడుతోంది. మూడు రోజుల్లోనే వంద కోట్ల గ్రాస్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది బ్రో. ఈ సినిమా తర్వాత వస్తున్న ఓజి, సెంచరీ కాదు డబుల్ సెంచరీ కొట్టడం ఖాయమని చెప్పొచ్చు.
స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం.. సెన్సెక్స్ దాదాపు 400 పాయింట్ల నష్టం
నేడు భారత స్టాక్ మార్కెట్ భారీ క్షీణతతో ప్రారంభమైంది. సెన్సెక్స్ దాదాపు 400 పాయింట్ల భారీ పతనంతో ప్రారంభమైంది. మార్కెట్ ప్రారంభంలో అడ్వాన్స్ డిక్లైన్ రేషియోను పరిశీలిస్తే.. 900 స్టాక్స్ గ్రీన్ మార్క్ చూపగా.. దాదాపు 450 స్టాక్స్ క్షీణతతో ట్రేడవుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు అర శాతం క్షీణతతో ట్రేడవుతోంది.
నేడు BSE సెన్సెక్స్ 394.91 పాయింట్ల పెద్ద పతనంతో 66,064 స్థాయి వద్ద ప్రారంభమైంది. అంటే 0.59 శాతం. మరోవైపు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 78.15 పాయింట్లు లేదా 0.40 శాతం క్షీణతతో 19,655 వద్ద ప్రారంభమైంది. 30 సెన్సెక్స్‌లో కేవలం 5 స్టాక్‌లు మాత్రమే బూమ్‌ను చూస్తున్నాయి.. ట్రేడింగ్ 25 స్టాక్‌లలో క్షీణతతో కనిపిస్తోంది. ప్రారంభంలో టాటా స్టీల్ షేరు గరిష్టంగా 1.62 శాతం ట్రేడింగ్ నష్టాన్ని చూపుతోంది. నిఫ్టీలోని 50 స్టాక్‌లలో 9 మాత్రమే బూమ్‌ను చూస్తున్నాయి. 41 స్టాక్‌లలో క్షీణతతో ట్రేడింగ్ కొనసాగుతోంది.
పాపం.. లిఫ్ట్‌లో ఇరుక్కొని, మూడు రోజులు నరకయాతన అనుభవించి..
ఉజ్బెకిస్థాన్‌లోని తాష్కెంట్‌లో ఒక విషాద ఘటన చోటు చేసుకుంది. ఒక మహిళ ప్రమాదవశాత్తూ లిఫ్టులో ఇరుక్కుని, ప్రాణాలు కోల్పోయింది. సహాయం కోసం మూడు రోజుల పాటు దిక్కులు పిక్కటిల్లేలా అరిచినా.. ప్రయోజనం లేకుండా పోయింది. సహాయం లేక, ఊపిరి ఆడక, ఆకలికి తట్టుకోలేక.. ఆ మహిళ చివరికి ప్రాణాలు వదిలింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఓల్గా లియోన్టీవా(32) అనే మహిళ జులై 24వ తేదీన తన పనులు ముగించుకొని, ఇంటికి బయలుదేరింది. ఈ క్రమంలోనే 9 అంతస్తుల భవంతి నుంచి కిందకు దిగేందుకు లిఫ్ట్ ఎక్కింది. లిఫ్ట్ డోర్స్ క్లోజ్ అయ్యాయి కానీ, లిఫ్ట్ మాత్రం కిందకు కదల్లేదు. అది అలాగే స్టక్ అయిపోయింది.
దీంతో భయభ్రాంతులకు గురైన ఓల్గా.. ఆ లిఫ్ట్ నుంచి బయటకు వచ్చేందుకు ఎంతో ప్రయత్నించింది. గట్టిగట్టిగా కేకలు వేస్తూ.. సహాయం కోసం ఆర్థించింది. కానీ.. ఎవ్వరూ ఆమె ఆర్థనాదాలు వినలేకపోయారు. అసలు ఆ లిఫ్ట్ ఆగిపోయిందన్న విషయాన్ని కూడా ఎవ్వరూ గమనించలేకపోయారు. అదే సమయంలో ఫోన్ కూడా పని చేయకపోవడంతో.. ఆ మహిళ లిఫ్ట్‌లోనే ఇరుక్కుపోయింది. మరోవైపు.. ఆఫీస్‌కి వెళ్లిన ఓల్గా తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి, సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. రెండు రోజుల పాటు ఆమె కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. కానీ.. ఎక్కడా ఆమె ఆచూకీ లభ్యమవ్వలేదు. చివరికి.. ఆమె లిఫ్ట్‌లో ఇరుక్కుని చనిపోయిందని పోలీసులు గుర్తించారు.
నేడు ఆకాశంలో అద్భుతం
ఆకాశంలో ఈరోజు అద్భుతమైన దృశ్యం ఆవిష్కరణ కానుంది. గగనతలంలో ఈరోజు సూపర్ మూన్ కనువిందు చేయనుంది. 2023 లో ముఖ్యమైన నాలుగు సూపర్ మూన్ లు ఆవిష్కృతం అవుతుండగా, మొదటిది జూలై 3 వ తేదీన అంటే సంభంవించింది. అయితే.. ఈ నెలలో రెండు సూపర్ మూన్‌లు ఆకాశంలో కనివిందు చేయనున్నాయి. నేడు మొదటి సూపర్ మూన్ దర్శనమివ్వనుండగా, ఇదే నెల 30న బ్లూ మూన్ కనువిందు చేయనున్నట్లు శాస్త్రవేత్తల వెల్లడించారు. ఇవాళ అర్థరాత్రి 12.01 గంటలకు పౌర్ణమి కంటే కొంచెం పెద్దగా, ప్రకాశవంతంగా చంద్రడు కనిపించనున్నాడు. మళ్లీ 30న రెండో పౌర్ణమి సందర్భంగా కనిపించనున్న బ్లూ బూన్ కనిపించనుంది.
ఇలాంటి ఘటన 2037 వరకు మళ్లీ జరగదని శాస్ట్రవేత్తల వెల్లడించారు. సాధారణ రోజుల్లో కంటే భూమికి దగ్గరగా చంద్రుడు రావడం వల్లే.. జాబిలి పెద్ద ఆకారంలో మరింత కాంతివంతంగా కనిపించింది. ఈ భౌగౌళిక దృగ్విషయాన్ని ఆయా దేశాలు, ప్రాంతాల్లో వేర్వేరు పేర్లతో పిలుస్తుంటారు. సాధారణంగా ఒక ఏడాదిలో రెండు లేదా మూడు సూపర్‌మూన్‌లు ఏర్పడుతుంటాయి. ఆగస్టు 30వ తేదీన ఏర్పడబోయే సూపర్‌మూన్ మాత్రం చాలా అరుదు. అలాంటి సందర్భాన్ని మళ్లీ 2032 వరకు మనం చూడలేకపోవచ్చు. ఫుల్ మూన్ సమయంలో, జాబిల్లి కక్ష్య భూమికి దగ్గరగా ఉన్నప్పుడు సూపర్‌మూన్ ఆవిష్కృతమౌతుంది.
నేడు కాంగ్రెస్‌లోకి జూపల్లి కృష్ణారావు
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో ఢిల్లీలో నేడు బీఆర్‌ఎస్ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, పాలమూరు జిల్లాకు చెందిన ఇతర నేతలు కాంగ్రెస్‌లో చేరనున్నారు. పాలమూరు జిల్లా కొల్లాపూర్‌లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రసంగించే భారీ బహిరంగ సభలో జూపల్లి తదితరులు గ్రాండ్ ఓల్డ్ పార్టీలో చేరాల్సి ఉన్నప్పటికీ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు, వరదల కారణంగా సభ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో చేరిక ఆలస్యమైతే భిన్నమైన కోణాల్లో రాజకీయ ప్రచారం జరుగుతుందని భావించిన జూపల్లి కృష్ణారావుకాంగ్రెస్‌లో చేరాకే పెద్ద ఎత్తున కొల్లాపూర్ సభ నిర్వహించాలని తలపెట్టారు.
అయితే.. వివిధ కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న కాంగ్రెస్‌లో చేరిక వ్యవహారంపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు జూపల్లితో పాటు ఆయన వర్గీయులు నిన్న ఢిల్లీకి వెళ్లారు. ఈ క్రమంలో నేడు మధ్యాహ్నం 3 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో మల్లికార్జున ఖర్గే సమక్షంలో వారు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. అయితే.. జూపల్లి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి, బీఆర్‌ఎస్ ఎల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి తనయుడు కూచకుళ్ల రాజేష్‌రెడ్డి, వెల్దండ సింగిల్ విండో చైర్మన్ జూపల్లి భాస్కర్‌రావు, వనపర్తికి చెందిన మేఘారెడ్డి తదితరులు ఢిల్లీకి వెళ్లారు. వారి వెంట టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి కూడా ఉన్నారు.
నేడు జీఎస్టీ కౌన్సిల్ సమావేశం.. ఆన్‌లైన్ గేమింగ్‌పై 28శాతం పన్నుపై నిర్ణయం
జీఎస్టీ కౌన్సిల్ వర్చువల్ సమావేశం బుధవారం అనగా ఈరోజు ఆగస్టు 2న జరగనుంది. కౌన్సిల్ చీఫ్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. ఆన్‌లైన్ గేమింగ్ బిజినెస్ చేస్తున్న వారికి నేటి సమావేశం ముఖ్యమైంది. ఆన్‌లైన్ గేమింగ్, క్యాసినో, గుర్రపు పందేలపై ఏకరీతిగా 28 శాతం పన్ను విధించాలని జీఎస్టీ కౌన్సిల్ గత సమావేశంలో నిర్ణయించింది. దీని తర్వాత పెద్ద ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలు, వాటి CEOలు ఈ నిర్ణయాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. దీంతో కొత్త తరం స్టార్టప్‌లకు ఇబ్బందులు ఎదురవుతాయని కంపెనీలు వాదించాయి. అందుకే ఆన్‌లైన్ గేమింగ్, క్యాసినో, గుర్రపు పందేలపై 28 శాతం జీఎస్టీ విధించాలన్న ప్రతిపాదనపై బుధవారం మంత్రుల బృందం చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది.
సినీ ఇండస్ట్రీలో విషాదం.. ‘లగాన్’ ఆర్డ్ డైరెక్టర్ ఆత్మహత్య!
ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్.. ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు మరణిస్తున్నారు. ఒకరి మరణ వార్తను మరిచిపోయే లోపే.. ఇంకొకరు కాలం చేస్తున్నారు. కొందరు అనారోగ్య, వయో సంబంధిత కారణాలతో చనిపోతుంటే.. మరికొంతంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. తాజాగా బాలీవుడ్ మూవీ ‘లగాన్’ ఆర్డ్ డైరెక్టర్ ఆత్మహత్య చేసుకున్నారు.
ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ చంద్రకాంత్ దేశాయ్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన వయసు 58 సంవత్సరాలు. కర్జాత్‌లోని తన ఎన్డీ స్టూడియోలో చంద్రకాంత్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన అకాల మరణం గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చంద్రకాంత్ మరణంతో సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. బాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయన కుటుంబానికి సంతాపం తెలుపుతున్నారు. లగాన్ హీరో అమిర్ ఖాన్.. చంద్రకాంత్ పార్థివ దేహాన్ని చూడడనికి వెళుతారని సమాచారం.
సినిమా గురించి ఆసక్తికర పోస్ట్ చేసిన విజయ్ దేవరకొండ..
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ వరుస సినిమాలను ప్రకటిస్తూ దూసుకుపోతున్నాడు… రీసెంట్ గా ఈ హీరో నటించిన క్రేజీ మూవీ ‘ఖుషి’సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది.శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు సిద్ధం అవుతుంది.. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ,సమంత జంటకు మంచి క్రేజ్ ఏర్పడింది.వీరి కెమిస్ట్రీని తెరమీద చూడాలని ప్రేక్షకులు అంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా సెప్టెంబర్ 1న విడుదల కాబోతుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.సినిమా విడుదల దగ్గర పడుతుందటంతో మేకర్స్ ప్రమోషన్స్ లో మరింత స్పీడ్ పెంచాలని చూస్తున్నారు..ఈ సినిమా ట్రైలర్ ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.తాజాగా విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ ను చేసాడు.అందులో 8 రోజులు, 14 రోజులు, 30 రోజులు అంటూ విజయ్ దేవరకొండ ఒక ట్వీట్ చేయగా ఇందులో 8 రోజులు అనేది ట్రైలర్ విడుదల తేదీ అని అంతా అనుకుంటున్నారు.ఇక 14 రోజులు అంటే ఏంటో తెలియాల్సి ఉంది.అలాగే 30 రోజులు అంటే సినిమా విడుదల తేదీ అని తెలుస్తుంది..మొత్తానికి విజయ్ అలా హింట్ ఇచ్చేసాడు.మరి విజయ్ దేవరకొండ ఇచ్చిన హింట్ ప్రకారం ఈ సినిమా ట్రైలర్ ఆగస్టు 9న విడుదల అవుతుందో లేదో చూడాలి..
కామాంధుడు.. 91 మంది బాలికలపై అత్యాచారం..1600లైగింక వేధింపుల కేసులు
ఆస్ట్రేలియాలో 91 మంది యువతులపై ఓ వ్యక్తి అత్యాచారానికి ఒడిగట్టాడు. ఇంతటి దారుణానికి పాల్పడినందుకు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాకుండా నిందితులు 1,600కు పైగా చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు చైల్డ్ కేర్ అధికారి. అతను వివిధ నగరాల అమ్మాయిలను తన బాధితులను చేశాడు. 25 ఏళ్లలో 1623 లైంగిక నేరాలకు పాల్పడిన నిందితులను ఆస్ట్రేలియా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ 45 ఏళ్ల వ్యక్తి తన గుర్తింపును బహిరంగపరచనప్పటికీ 15 ఏళ్లుగా బ్రిస్బేన్, సిడ్నీ.. విదేశాలలో సుమారు డజను పిల్లల సంరక్షణ కేంద్రాలను చూసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఆస్ట్రేలియా చరిత్రలో చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడిన అత్యంత దారుణమైన కేసుగా నిపుణులు అభివర్ణించారు.