వెన్నెల సంఘటనపై స్పందించిన పవన్: పదోతరగతి విద్యార్థి వెన్నెల తల్లిదండ్రులు మధురపూడి విమానాశ్రయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను కలిశారు. తమ కుమార్తె విషయంను పవన్ దృష్టికి వెన్నెల కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. వెన్నెల ఆత్మహత్యకు పాఠశాల యాజమాన్యమే కారణమని తల్లిదండ్రులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలంటూ నేడు పవన్ కాన్వాయ్కి అడ్డుపడ్డారు. మధ్యాహ్నం వచ్చి మాట్లాడతానని డిప్యూటీ సీఎం పవన్ వారికి భరోసా ఇచ్చారు. ఇదో ఆచారమట మరి: దీపావళి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని…
శ్రీకాకుళం జిల్లాలో సీఎం పర్యటన: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. దీపావళి పండుగ రోజు సీఎం దీపం పథకం 2.0 గురించి చెప్పారు. దీపావళి కానుకగా శ్రీకాకుళం జిల్లా నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేసేందుకు సిద్ధం అయ్యారు. ఈ క్రమంలో శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఇచ్ఛాపురం నియోజకవర్గం, ఈదుపురంలో దీపం 2.0 ఉచిత సిలిండర్ల…