ఆగని ఇసుక మాఫియా ఆగడాలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలు పెరిగిపోతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా.. ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినా ఇసుక అక్రమాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా ఇసుక అక్రమ తవ్వకాలకు పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు కేంద్రంగా మారింది. అనిగండ్లపాడు రీచ్ వద్ద ఇసుక మాఫీయా హల్చల్ చేసింది. గ్రామ సరిహద్దు వద్ద ర్యాంపు నుంచి ఇసుకను తెలంగాణకు తరలిస్తున్నాయి. అన్నిండ్లపాడు గ్రామ సరిహద్దు వద్ద ర్యాంపులో…
బైక్పై టపాసులు తీసుకెళ్తుండగా పేలుడు: దీపావళి పండుగ రోజున ఏలూరు నగరంలో విషాదం చోటు చేసుకుంది. టపాసులను బైక్పై తీసుకెళ్తుండగా ఒక్కసారి పేలిపోయాయి. బండి గోతిలో పడి టపాసులు రాపిడికి గురై పేలుడు సంభవించినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ పేలుడు దాటికి వాటిని తరలిస్తున్న వ్యక్తి శరీరం ముక్కలు ముక్కలుగా ఎగిరిపడింది. పేలుడు దాటికి యాక్టివా బండి పూర్తిగా దగ్ధమైంది. సమీపంలో ఉన్న నలుగురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు దాటికి ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది.…
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లతో మంత్రి నారా లోకేష్ భేటీ.. ఏపీని సందర్శించండి..! ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా అమెరికాలో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పర్యటన కొనసాగుతోంది.. ఇప్పటికే పలు దిగ్గజ సంస్థలతో భేటీ అయిన ఆయన.. తాజాగా ప్రపంచ సాఫ్ట్ వేర్ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో భేటీ అయ్యారు.. రెడ్మండ్ లోని సంస్థ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన లోకేష్ టీమ్.. మైక్రోసాఫ్ట్ ప్రతినిధులతో సమావేశం అయ్యాంది.. ఈ సందర్భంగా…