“2047 నాటికి ఇస్లామిక్ దేశంగా ఇండియా”.. ఛంగూర్ బాబా కేసులో చార్జిషీట్.. ఉత్తర్ ప్రదేశ్‌లో బలరాంపూర్‌లో జలాలుద్దీన్ అలియాస్ ఛంగూర్ బాబా కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. బాబా ముసుగులో హిందువును, సిక్కు మతం మార్చే పెద్ద రాకెట్ ముఠాకు ఈయన నాయకత్వం వహిస్తున్న విషయాన్ని యూపీ పోలీసులు బట్టబయలు చేశారు. యూపీలోని నేపాల్ సరిహద్దుల్లో ఉండే బలరాంపూర్ జిల్లాలోని మాధ్‌పూర్ కేంద్రంగా, విలాసవంతమైన భవనం అడ్డాగా ఛంగూర్ బాబా ఈ అరాచకాలకు పాల్పడుతున్నట్లు…
డీజే బాణీలకు పోలీస్ అధికారులు స్టెప్పులు హైదరాబాద్ నగర వ్యాప్తంగా గణేశ్ నిమజ్జనాలు ఉత్సాహభరితంగా, ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. డీజేలు, బ్యాండ్లు, కోలాటాలు, డప్పుల మోతలు, సాంస్కృతిక ప్రదర్శనల నడుమ భక్తులు భారీగా ట్యాంక్‌బండ్ వైపు తరలివస్తున్నారు. శోభాయాత్రలో చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఉత్సాహంగా పాల్గొని వినాయకుడి నిమజ్జనాన్ని పండగలా మార్చుతున్నారు. ఈ సందర్భంలోనే ఒక ఆసక్తికర దృశ్యం కనిపించింది. డీజే పాటల బాణీలకు పోలీసు సిబ్బంది ఊరేగింపులో పాల్గొని డ్యాన్స్ చేశారు. ముఖ్యంగా ఖైరతాబాద్…
ఢిల్లీ అల్లర్ల కేసులో ఉమర్ ఖలీద్, షార్జీల్ ఇమామ్‌లకు బెయిల్ నిరాకరణ.. 2020 ఢిల్లీ అల్లర్ల కేసులో కుట్రకు సంబంధించి యాక్టివిస్టులు, జేఎన్‌యూ మాజీ విద్యార్థులు అయిన ఉమర్ ఖలీద్, షార్జీల్ ఇమామ్‌లో పాటు మరో ఏడుగురికి ఢిల్లీ హైకోర్టు మంగళవారం బెయిల్ నిరాకరించింది. జస్టిస్ నవీన్ చావ్లా, షాలిందర్ కౌర్‌తో కూడిన ధర్మాసనం ఈ ఇద్దరితో పాటు మొహమ్మద్ సలీమ్ ఖాన్, షిఫా ఉర్ రెహమాన్, అథర్ ఖాన్, మీరాన్ హైదర్, షాదాబ్ అహ్మద్ అబ్దుల్…
త్వరలో ‘‘హైడ్రోజన్ బాంబు’’.. బీజేపీకి రాహుల్ గాంధీ వార్నింగ్.. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరోసారి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, ఎన్నికల సంఘం ఓటర్లను మోసం చేయడానికి కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. ‘‘త్వరలో ఓటు చోరిపై హైడ్రోజన్ బాంబు పేలుస్తా’’ అంటూ కామెంట్స్ చేశారు. ఎన్నికల కమిషన్ చేపట్టిన ‘‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’’ ద్వారా బీహార్‌లో ఓటర్లను తొలగిస్తున్నారని ప్రతిపక్షాలు అధికార బీజేపీ, ఎన్నిక సంఘంపై ఆరోపణలు గుప్పిస్తున్నాయి.…
2500 ఇటుకల బిల్లు రూ. 1.25 లక్షలు! ఉత్తర్ ప్రదేశ్ లోని భాటియా గ్రామ పంచాయతీలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. 2500ల ఇటుకల బిల్లులో ఏకంగా రూ. 1.25 లక్షలు వేశారు. సర్పంచ్, కార్యదర్శి సంతకం చేసిన ఈ బిల్లు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, పరిపాలనలో కలకలం మొదలైంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. భాటియా గ్రామంలో ఒక బిల్లులో 2500 ఇటుకల ధరను రూ.1.25 లక్షలుగా చూపించిన కేసు వెలుగులోకి వచ్చింది, ఇది ప్రభుత్వ…
తెలంగాణ విజిలెన్స్ కొత్త డీజీగా విక్రమ్ సింగ్ మాన్ తెలంగాణ రాష్ట్ర విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ శాఖకు కొత్త డైరెక్టర్ జనరల్‌గా విక్రమ్ సింగ్ మాన్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న ఐపీఎస్ అధికారి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఆగస్టు 31తో పదవీ విరమణ చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 1998 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన విక్రమ్ సింగ్ మాన్ ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో అదనపు సీపీ (లా అండ్ ఆర్డర్)గా పనిచేస్తున్నారు.…
ఏపీ రైతులకు శుభవార్త.. అతి త్వరలోనే..! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు శుభవార్త. రాష్ట్రంలో పంట సాగు ముమ్మరంగా సాగుతున్న వేళ యూరియా కొరత నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర చర్యలు తీసుకుంది. కేంద్ర రసాయనాలు అండ్ ఎరువుల శాఖ మంత్రితో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చర్చలు జరిపారు. రైతులకు యూరియా అవసరాల దృష్ట్యా రాష్ట్రానికి 10,350 మెట్రిక్ టన్నుల యూరియాను విశాఖపట్నంలోని గంగవరం పోర్టులో దిగుమతికి కేంద్రం జీవో జారీ చేసింది. యూరియా…
యూరియా సరఫరాపై తుమ్మల ఓపెన్ లెటర్.. కేంద్రం వైఫల్యంతో రైతులు ఇబ్బందులు తెలంగాణ రైతాంగానికి ఉద్దేశించి వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బహిరంగ లేఖ విడుదల చేశారు. యూరియా కేటాయింపులు, స్వదేశీ–దిగుమతి సరఫరాల్లో కేంద్ర ప్రభుత్వం సమన్వయ లోపం, అసమర్థత కారణంగా రాష్ట్రాలకు అవసరమైన పరిమాణం సమయానికి చేరడం లేదని ఆయన తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రానికి కేటాయింపుల ప్రకారం రావాల్సిన యూరియాను వెంటనే తెప్పించేందుకు ఎంతవరకైనా పోరాడుతామని హామీ ఇచ్చారు. లేఖలో ప్రభుత్వం ఇప్పటి వరకు పాత…
తగలబడుతున్న రష్యా.. చమురు శుద్ధి ఫ్యాక్టరీలే ఉక్రెయిన్ టార్గెట్ రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపు కోసం ఒకవైపు ముమ్మరంగా ప్రయత్నాలు జరుతుంటే.. మరోవైపు ఈ రెండు దేశాలు ఒకదానిపై మరొకటి దాడులు చేసుకుంటునే ఉన్నాయి. మాస్కో-కీవ్‌ల మధ్య యుద్ధం 2022 ఫిబ్రవరి 24 నుండి కొనసాగుతోంది. ఇటీవల కాలంలో రెండు దేశాల మధ్య వివాదం తీవ్రమైంది. ఆగస్టు 15న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ – రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో అలాస్కాలో యుద్ధాన్ని ముగించడానికి సమావేశమయ్యారు. తర్వాత…