సుమన్ శెట్టికే జై కొడుతున్న బిగ్ బాస్ ఫ్యాన్స్.. కప్ కొట్టేస్తాడా..?
బిగ్ బాస్ సీజన్ 9 మొదలైన దగ్గర నుంచి ఒక కంటెస్టెంట్ మీదే అందరి దృష్టి ఉంది. ఆయనే సుమన్ శెట్టి. మొదటి వారం నుంచే ఆయన తన కామెడీ, ఇన్నోసెంట్, సింపుల్ నేచర్‌తో, నిజాయితీతో ప్రేక్షకుల మనసు గెలుచుకుంటున్నారు. సోషల్ మీడియాలో కూడా ఆయన ఫ్యాన్‌బేస్ రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఆయన ఆటకు, మాటలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఆయనకు భారీగా ఓటింగ్ వస్తోంది. ఇక శనివారం బిగ్ బాస్ నుంచి తాజాగా ఓ ప్రోమో విడుదలైంది. ‘శివ’ సినిమా రీ-రిలీజ్ సందర్భంగా నాగార్జున, ఆ గెటప్‌లోనే స్టేజ్‌పై ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను అలరించారు. అలాగే అమల, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా బిగ్ బాస్ స్టేజ్‌పై సందడి చేశారు.
టీమిండియాలో మరో డిఎస్పీ.. నియామకపత్రం అందజేత..
భారతీయ మహిళా క్రికెట్ జట్టులోకి మరో డిస్పీ వచ్చారు. భారత మహిళా క్రికెట్ జట్టుకు స్టార్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ అయిన రిచా ఘోష్, పశ్చిమ బెంగాల్ పోలీసులో డిఎస్పీ (డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్)గా నియమితులయ్యారు. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (CAB) సన్మాన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆమెకు నియామక లేఖను స్వయంగా అందజేశారు. భారత మహిళా జట్టు ఇటీవలి ప్రపంచ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన రిచా సైతం డిఎస్పీ బాధ్యతలు స్వీకరించనుంది.
మూడు మ్యాచ్‌లు ఓడాక.. డ్రెస్సింగ్ రూంలో జరిగిందిదే..
ఎన్నో ఏళ్ల నిరీక్షణకు ఫలితం దక్కింది. భారత మహిళల క్రికెట్ జట్టు చిరస్మరణీయ విజయం సాధించి ప్రపంచ కప్ గెలుచుకుంది. తొలిసారి టీమిండియా ప్రపంచకప్ ను ఒడిసిపట్టుకుంది. అత్యంత ఆసక్తిగా జరిగిన మహిళల ప్రపంచకప్ ఫైనల్‌లో భారత జట్టు ఎలాంటి తడబాటు లేకుండా అదరగొట్టింది. వరల్డ్ కప్ సాధించిన భారత జట్టులో తెలంగాణకు చెందిన అరుంధతి రెడ్డి ఉండటం మన తెలుగు రాష్ట్రాలకు ఎంతో గర్వకారణం. అయితే.. తాజాగా అరుంధతి ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. వరల్డ్ కప్ సాధించడం ఎంతో గర్వకారణం అని వెల్లడించింది.
మేం విడిపోవాలని కోరుకున్నారు.. రాజీవ్ తో బంధంపై సుమ కామెంట్స్
టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా క్రేజ్ తెచ్చుకున్న సుమ కనకాల తన వ్యక్తిగత జీవితంపై చాలా అరుదుగా మాట్లాడుతుంటుంది. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో తన భర్త రాజీవ్ కనకాలతో ఉన్న బంధంపై స్పష్టత ఇచ్చింది. నాకు వచ్చే కలలు చాలా వరకు నిజం అవుతుంటాయి. అలా ఓ సారి రాజీవ్ కు యాక్సిడెంట్ అయినట్టు కల వచ్చింది. వెంటనే కాల్ చేస్తే నిజంగానే యాక్సిడెంట్ అయిందని చెప్పాడు. ఇక మా పెళ్లి బంధంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కున్నాం. పెళ్లి అయి 25 ఏళ్లు అవుతోంది కాబ్టటి ఇన్నేళ్ల జీవితంలో గొడవలు చాలా కామన్. కానీ మేం విడిపోయినట్టు ఎన్నో వార్తలు, రూమర్లు వస్తుంటాయి. మేం విడిపోవాలని చాలా మంది కోరుకున్నారు. కానీ మేం కలిసే ఉంటాం అని తెలిపింది.
బేగంపేట్ క్యులినరీ హోటల్ మేనేజ్‌మెంట్ అకాడమీలో డ్రగ్స్ కలకలం.. ఆరుగురు విద్యార్థులకు పాజిటివ్
డ్రగ్స్ మత్తులో యువత తమ జీవితాలను చిత్తు చేసుకుంటున్నాయి. డ్రగ్స్ ను పూర్తిగా రూపుమాపేందుకు ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకొచ్చి అమలు చేస్తున్నప్పటికీ అడ్డుకట్టపడడం లేదు. తాజాగా హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. బేగంపేట్ క్యులినరీ హోటల్ మేనేజ్‌మెంట్ అకాడమీలో డ్రగ్స్ కలకలం సృష్టించింది. సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. ఆరుగురు విద్యార్థులు గంజా సేవించినట్లు పోలీసులు గుర్తించారు. ఆరు మంది విద్యార్థులకు డ్రగ్ టెస్టు నిర్వహించగా పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. ఈగల్, నార్కోటిక్స్ పోలీసులు సంయుక్తంగా విద్యార్ధులకు పరీక్షలు చేశారు. పట్టుబడిన వారు చివరి సంవత్సరం చదువుతున్న హోటల్ మేనేజ్‌మెంట్ విద్యార్థులుగా గుర్తించారు. వారిని తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చి.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరిలించినట్లు తెలిపారు. విద్యార్థుల స్నేహితుడే డ్రగ్స్ సరఫరా చేసినట్లు పోలీసులు తెలిపారు.
రజినీకాంత్ అన్నయ్యకు హార్ట్ ఎటాక్..
సూపర్ స్టార్ రజినీకాంత్ కుటుంబంలో ఆందోళన కలిగించే ఘటన జరిగింది. ఆయన అన్న సత్యనారాయణ రావు గైక్వాడ్ హార్ట్ ఎటాక్‌కు గురయ్యారు. ప్రస్తుతం ఆయన బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే రజినీకాంత్ చెన్నై నుండి బెంగళూరుకు చేరుకుని అన్నయ్యను చూసుకున్నారు. వైద్యులు ఆయనకు ప్రత్యేక చికిత్స అందిస్తూ, ఆరోగ్య పరిస్థితిని దగ్గరగా పర్యవేక్షిస్తున్నారు. రజినీకాంత్ బెంగుళూరులో వెళ్తున్న ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సత్యనారాయణ రావు గతంలోనే మోకాలి చిప్ప మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నారు.
ఐదేళ్లలో లక్షా 30 వేల ఎర్రచందనం చెట్లను నరికేశారు
తిరుపతి పరిధిలోని మామండూరు అటవీ ప్రాంతం, మంగళంలోని ఎర్రచందనం గోదాము పరిశీలించిన అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ వన సంపదపై కొనసాగుతున్న అక్రమాలను అరికట్టడానికి కట్టుబడి ఉన్నట్టు వెల్లడించారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్‌లో అటవీ అధికారుల అనుభవాలను పరిగణలోకి తీసుకుని నిర్వహించిన సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎర్రచందనం చెట్లు సాంస్కృతిక-ఆధ్యాత్మిక పరంపరకు అందమైన భాగమని, వాటిని రక్షించడం పై ప్రభుత్వ బాధ్యత ఉందని తెలిపారు.
కేటీఆర్ మాటలు నమ్మకండి.. జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ తేదీ దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీలు గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నాయి. తమ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కేటీఆర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ మాటలు నమ్మొద్దని జూబ్లీహిల్స్ ఓటర్లకు సూచించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. మళ్ళీ ఐదేళ్లు మేమే అధికారంలో ఉంటామని తెలిపారు. జూబ్లిహిల్స్ ఓటర్లు… నవీన్ యాదవ్ యువకుడికి ఓటేయాలని కోరుతున్నానని అన్నారు. నవీన్ యాదవ్ పట్టువిడవకుండా రాజకీయ పోరాటం చేస్తున్నాడు అని తెలిపారు.
ఎల్లుండి ఏపీకి కేంద్ర బృందం.. ఈ జిల్లాల్లో పర్యటన
కేంద్ర బృందం ఎల్లుండి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానుంది. నవంబర్ 10, 11 తేదీల్లో ‘మొంథా తుఫాన్’ ప్రభావిత జిల్లాల్లో నష్టాల స్థితిని ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఈ బృందం రెండు రోజుల పర్యటన చేపడుతోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక అంచనాలు సిద్ధం చేసి, సంబంధిత వివరాలను కేంద్రానికి పంపింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ పౌసుమి బసు నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో కూడిన బృందం ఏర్పాటైంది.
సరైన సమయంలో సరైన నిర్ణయం ఉంటుంది
తిరువూరు… పంచాయతీ.. నివేదిక సీఎం చంద్రబాబు కు చేరింది సరైన సమయంలో సరైన నిర్ణయం తీస్కుంటామన్నారు సీఎం చంద్రబాబు. టీడీపీ క్రమ శిక్షణా సంఘంతో చంద్రబాబు భేటి అయ్యారు. తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, ఎంపీ కేశినేని చిన్ని మధ్య కొన్నాళ్లుగా సాగుతున్న కోల్డ్‌వార్‌పై ఆ పార్టీ క్రమశిక్షణ కమిటీ సిద్దం చేసిన నివేదిక సీఎం చంద్రబాబుకు చేరింది. విచారణలో భాగంగా ఇద్దర్నీ ప్రశ్నించింది కమిటీ. ప్రధానంగా తన టికెట్ కోసం 5 కోట్లు అడిగారన్న అంశంపై ఎంపీ చిన్నిని వివరణ అడిగింది. రెండు సందర్భాల్లో కొలికపూడి వివరణను కూడా తీసుకుంది. ఇద్దరి అభిప్రాయాలు, వారు సమర్పించిన ఆధారాలను నివేదికలో పొందుపర్చిన క్రమశిక్షణా కమిటీ.. ఆ రిపోర్ట్‌ను చంద్రబాబుకు సమర్పించింది. సుమారు గంటపాటు చంద్రబాబుతో భేటీ అయ్యింది క్రమ శిక్షణా కమిటీ.