139 డ్రోన్స్ నిఘాలో పోలింగ్ కేంద్రాలు.. ప్రైవేటు డ్రోన్స్‌కు నో పర్మిషన్..!
జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నిక సందర్భంగా భద్రత, పర్యవేక్షణ విషయంలో ఎన్నికల అధికారులు కీలక చర్యలు చేపట్టారు. ఈ ఎన్నికల నిర్వహణలో మొదటిసారిగా డ్రోన్లను వినియోగించనున్నారు. పోలింగ్ లొకేషన్లలో 139 డ్రోన్లను ఉపయోగించి సెక్యూరిటీ మానిటరింగ్ చేయాలని అధికారులు నిర్ణయించారు. డ్రోన్ల నుంచి వచ్చే ఫీడ్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం కానుంది. ఈ మేరకు కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ఏర్పాటు చేసిన డ్రోన్ల ఏర్పాట్లను చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి, జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ పరిశీలించారు.
ఉత్తరప్రదేశ్‌లో 40 మిలియన్ల సంవత్సరాల నాటి డైనోసార్ శిలాజం లభ్యం..
ఉత్తరప్రదేశ్‌లోని సహ్రాన్‌పూర్ జిల్లాలోని సహన్సారా నది ఒడ్డున తవ్వకాలలో మూడు కొమ్ముల డైనోసార్ అయిన ట్రైసెరాటాప్స్‌కు చెందినదిగా భావిస్తున్న శిలాజం బయటపడింది. ఈ ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో లక్షలాది సంవత్సరాల నాటి ట్రైసెరాటాప్స్ ముక్కు కొమ్ము బయటపడిందని నిపుణులు భావిస్తున్నారు. నేచురల్ హిస్టరీ అండ్ కన్జర్వేషన్ సెంటర్ వ్యవస్థాపకుడు మొహమ్మద్ ఉమర్ సైఫ్ మాట్లాడుతూ.. ఒక కొత్త శిలాజం బయటపడింది. అది ట్రైసెరాటాప్స్ కి చెందినదిగా భావిస్తున్నారు… ఆ శిలాజం దాని ముక్కులో ఒక భాగం. ఇది ట్రైసెరాటాప్స్ కు చెందినదని మనం ఖచ్చితంగా చెప్పలేకపోయినా, ప్రపంచవ్యాప్తంగా కనిపించే ఇతర ట్రైసెరాటాప్స్ శిలాజాలను ఇది పోలి ఉంటుంది. దీని స్వరూపం, ఆకారం, పరిమాణంతో పోలి ఉంటాయి అని అన్నారు.
అమెరికన్లకు ట్రంప్ గిఫ్ట్.. ‘టారిఫ్ డివిడెండ్’ పేరుతో సర్‌ప్రైజ్ ప్యాకేజ్!
సంచలనాలకు కేంద్ర బిందువు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం ఒక ఆశ్చర్యకరమైన ప్రకటన చేశారు. వాస్తవానికి ఆయన ప్రకటన చాలా మంది అమెరికన్లకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ లాంటిదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చాలా మంది అమెరికన్లకు త్వరలో $2,000 (రూ. 1.77 లక్షలు) చెల్లింపు అందుతుందని ట్రంప్ ప్రకటించారు. ట్రంప్ దీనిని తన “టారిఫ్ డివిడెండ్”గా అభివర్ణించారు. అంటే సుంకాల నుంచి వచ్చే ఆదాయం ఆధారంగా డబ్బు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌లో వరుస పోస్ట్‌లలో ఆయన ఈ ప్రకటన చేశారు. వాస్తవానికి ఇది అమెరికన్ రాజకీయాల్లో సరికొత్త సంచలనం సృష్టించింది.
దేవుడితో రాజకీయాలు చేయటం వాళ్లకు బాగా అలవాటు
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు ప్రభుత్వ విధానాలు, దేవాలయాలను రాజకీయ ప్రయోజనాలకు వినియోగిస్తున్నారని ఆరోపిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ, తిరుమలలో 1985 నుంచి భక్తులకు ఉచిత భోజనం అందిస్తున్నారని, ఇందుకోసం భక్తులు 27 వేల కోట్లకు పైగా విరాళాలు సమకూర్చారని తెలిపారు. “నేను అక్కడ భోజనం చేసినప్పుడు, భోజనం బాగుందని మాత్రమే చెప్పాను. దాన్ని కూడా రాజకీయంగా మలచటం చంద్రబాబు స్టైల్,” అని ఆయన వ్యాఖ్యానించారు. దేవుడిని రాజకీయాలకు వాడటం వాళ్లకు అలవాటు అని, లడ్డూ ప్రసాదం విషయాన్ని చంద్రబాబు రాజకీయ రంగంలోకి లాగారంటూ వ్యాఖ్యానించారు.
వెండికి కూడా బ్యాంక్ లోన్.. కండిషన్స్ అప్లై..!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సామాన్యులకు అత్యవసర ఆర్థిక అవసరాల సమయంలో ఉపశమనాన్ని అందించే లక్ష్యంతో ఒక కీలక నిర్ణయం తీసుకుంది. “Reserve Bank of India (Lending Against Gold and Silver Collateral) Directions, 2025” పేరుతో కొత్త మార్గదర్శకాలను ప్రకటిస్తూ.. త్వరలో బంగారంతో పాటు వెండి ఆభరణాలు, నాణేలపై కూడా రుణ సదుపాయం కల్పించనుంది. ఈ నూతన నిబంధనలు 2026 ఏప్రిల్ 1 నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. ఇప్పటివరకు కేవలం బంగారంపైనే లోన్ లభించేది. అయితే, ఇప్పుడు తొలిసారిగా వెండిపై కూడా రుణాల కోసం RBI అనుమతి ఇవ్వడం విశేషం.
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. పూర్తి వివరాలు ఇవే..!
రాష్ట్రంలో భారీ పెట్టుబడుల దిశగా ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. మొత్తం రూ. లక్ష కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పార్థసారథి వెల్లడించారు. ముఖ్యంగా క్వాంటం కంప్యూటింగ్ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక విధానానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన దాదాపు మూడున్నర గంటల పాటు సాగిన కేబినెట్ సమావేశంలో 70 అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు.
సర్ ప్రైజ్.. SSMB29 నుంచి సాంగ్ రిలీజ్
సూపర్ స్టార్ మహేశ్ బాబు – దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న భారీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ “గ్లోబ్ ట్రోటర్ నుంచి భారీ సర్‌ప్రైజ్ బయటకు వచ్చింది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే మేకర్స్ ఓ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ సాంగ్ పేరు “గ్లోబ్ ట్రాటర్”. స్పెషల్ ఏంటంటే ఈ పాటను హీరోయిన్ శ్రుతి హాసన్ స్వయంగా పాడింది. ఆమె వాయిస్, లిరిక్స్, మ్యూజిక్ కలిపి ఈ సాంగ్‌కి కొత్త ఫీల్‌ను తెచ్చాయి. “సంచారి.. సంచారి..” అంటూ సాగే లైన్స్, హీరో పాత్రలోని స్పిరిట్‌ను, అతని జర్నీని హైలెట్ చేస్తున్నాయి. ఈ నెల 15న జరగబోయే గ్రాండ్ ఈవెంట్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్న సమయంలో ఈ సడెన్ సాంగ్ రిలీజ్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ పాటను సినిమాకోసం చేశారా.. లేదంటే ప్రమోషన్ కోసం రూపొందించారా అన్నది తెలియదు. కానీ శ్రుతి హాసన్ పాడినందున, ఈ సాంగ్ సినిమాలోనే ఉండే అవకాశం ఎక్కువగా ఉందని అభిమానులు అంచనా వేస్తున్నారు. కానీ రాజమౌళి మూవీ నుంచి ఎలాంటి చడీ చప్పుడు లేకుండా ఇలా రిలీజ్ చేయడం షాకింగ్ అంటున్నారు ఫ్యాన్స్.
ఢిల్లీ పేలుడు ఎఫెక్ట్.. హైదరాబాద్ సిటీలో నాకా బందీ..!
దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు సంభవించడంతో దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ పార్కింగ్ ప్రాంతంలో పార్క్ చేసిన కారులో ఈ పేలుడు సంభవించింది. ఇది హైగ్రేడ్ ఎక్స్‌ప్లోజివ్‌తో ఉపయోగించిన చర్యగా అనుమానిస్తున్నారు. ఎర్రకోట గేట్ నంబర్ 1 దగ్గర జరిగిన ఈ పేలుడు ధాటికి ఐదు కార్లు ధ్వంసమవగా, పేలుడు వల్ల ఇతర వాహనాలకు మంటలు అంటుకున్నాయి. ఎనిమిది మంది మృతి చెందగా, పదుల సంఖ్యలో క్షతగాత్రులు అయ్యారు. బాధితులకు LNJP ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఏడు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పివేశారు.
అల్లూరి జిల్లాలో అదృశ్యమైన ఇద్దరు బాలికలు సేఫ్
అల్లూరి జిల్లా కించూరు ప్రాంతంలో నాలుగు రోజులుగా అదృశ్యమై కుటుంబాలను ఆందోళనకు గురిచేసిన ఇద్దరు బాలికలు చివరకు సురక్షితంగా దొరికారు. పెదబయలు ఆశ్రమ పాఠశాలకు చెందిన 6వ తరగతి విద్యార్థిని వసంత, 5వ తరగతి విద్యార్థిని తేజ.. పాఠశాల నుండి బయటకు వచ్చిన తర్వాత ఇంటికి వెళితే తల్లిదండ్రులు మందలిస్తారన్న భయంతో ఇంటికి వెళ్లకుండా కించూరు గ్రామ శివారులోని కొండ గుహ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడే గత నాలుగు రోజులు గడుపుతూ, గుహ పరిసరాల్లో లభించిన కందలు, మూలాలు తింటూ, నీటితో దాహం తీర్చుకుంటూ, చలి వణుకులతో కష్టాల్లో ఉండిపోయారు.