నేడు ఖమ్మంకు రేవంత్.. ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం.. కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తూ వస్తుంది.. ఇందులో భాగంగానే మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా.. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు ఇవాళ (సోమవారం) కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. భద్రాచలంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ మైదానంలో నేటి మధ్యాహ్నం 1 గంటకు నిర్వహించనున్న కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ పథకం కింద…
ఆ సినిమాలో అన్నీ బూతులే.. కానీ, డబ్బులు బాగా వచ్చాయి తెలుగు, తమిళ సినిమాల్లో విభిన్నమైన సినిమాలు చేస్తూ తనదైన ప్రత్యేకతను సంపాదించుకున్న హీరో త్రిగుణ్. ఇప్పుడీ హీరో ‘లైన్ మ్యాన్’ చిత్రంతో కన్నడ సినీ ఇండస్ట్రీలోనూ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వటానికి సిద్ధమయ్యారు. వి.రఘుశాస్త్రి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కన్నడ, తెలుగు భాషల్లో విడుదలకు సిద్ధమవుతుండటం విశేషం. ప్రెస్టీజియస్ పర్పల్ రాక్ ఎంటర్టైనర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి ప్రచూర.పి, కాద్రి మణికాంత్, జ్యోతి రఘుశాస్త్రి,…
కాకర్ల ట్రస్ట్ సేవలు గుర్తించి టీడీపీ అధిష్టానం టికెట్.. పురిటి గడ్డపై మమకారంతో మెట్ట ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో.. ప్రజల జీవితాలు మార్చాలన్న ఆలోచనతో ఉదయగిరి నియోజకవర్గంలోని బొమ్మరాజు చెరువు సమీపంలో కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ను ఏర్పాటు చేశారు. గత రెండేళ్లుగా 16 పథకాలను సొంత నిధులతో ప్రజల్లోకి తీసుకువెళ్లి వేలాదిమందికి లబ్ధి చేకూర్చిన ఘనత ఉదయగిరి నియోజకవర్గం టీడీపీ-జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ కు దక్కింది. ట్రస్ట్ సేవలు సూపర్ సక్సెస్…
బీజేపీ మంత్రిని పట్టపగలు కాల్చిచంపిన దుండగులు.. ఉత్తరప్రదేశ్‌లో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. జౌన్‌పూర్‌లోని సిక్రారా పోలీస్ స్టేషన్ పరిధిలోని బోధాపూర్ గ్రామంలో గురువారం బీజేపీ జిల్లా మంత్రి ప్రమోద్ కుమార్ యాదవ్‌ను దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. బోధాపూర్‌లో నివాసముంటున్న మంత్రి ప్రమోద్‌కుమార్ యాదవ్ రోజూ ఉదయం జిల్లా కేంద్రానికి పని నిమిత్తం వస్తుంటారని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (సిటీ) బ్రిజేష్ కుమార్ తెలిపారు.…
పదేళ్ల తర్వాత పేదల కళ్లలో ఆనందం చూస్తున్నాం పదేళ్ల తర్వాత పేదల కళ్లలో ఆనందం చూస్తున్నామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ మూడు నెలల పాలనతో అన్నీ వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట పెరిగింది, బీఆర్ఎస్ ప్రతిష్ట అథ:పాతాళానికి దిగజారిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఛైర్మన్లు ఆ పార్టీని వీడటం ఆ పార్టీ భవిష్యత్తును చూపెడుతుందని, గతిలేకనే కేసీఆర్…
పవన్ కళ్యాణ్‌పై మంత్రి ఆదిమూలపు సురేష్ ఫైర్.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి ఆదిమూలపు సురేష్ ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ నిజంగా వామనుడే.. బలి చక్రవర్తి చంద్రబాబును పవన్ తొక్కబోతున్నాడు.. అది బాబు గమనించాలని ఎద్దేవా చేశారు. ఎవరైనా పార్టీ పెడితే అదికారంలోకి రావాలని కోరుకుంటారు.. ప్రజలకు సేవచేయాలని వస్తారు.. పవన్ లా వేరే వాళ్లను ముఖ్యమంత్రిని చేయాలని రారని పేర్కొన్నారు. జగనన్న దెబ్బకు పవన్‌కు భయమేస్తుంది అందుకే అతనికి కేటాయించిన 24 స్థానాలలో…
కేంద్రం జోక్యంతో భారతీయ యాప్‌ల పునరుద్ధరణకు అంగీకరించిన గూగుల్.. సర్వీస్ ఫీజుల వివాదంతో గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి భారతీయ యాప్‌లను తొలగించింది. అయితే, దీనిపై సదరు యాప్‌ల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఈ వివాదంతో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో సమస్య కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గూగుల్ కంపెనీ అధికారులతో సమావేశమైన తర్వాత, తొలగించిన యాప్‌లను పునరుద్ధరించేందుకు గూగుల్ అంగీకరించినట్లు సమాచారం. శుక్రవారం గూగుల్ 10…
గుడ్ న్యూస్.. ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాలు ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థల్లో (ఐటీఐ) ఖాళీగా ఉన్న 71 అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ (ఏటీఓ) పోస్టులకు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ఉపాధి, శిక్షణ శాఖ డైరెక్టర్, ఐఏఎస్ డా. బి.నవ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తమ…
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్ తాడేపల్లిగూడెం జెండా సభలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ సీఎం జగన్‌ను తొక్కడం కాదు.. పవన్ కల్యాణ్‌ను నాశనం చేస్తున్న చంద్రబాబును 80 లక్షల పాదాలు తిరిగి లేవకుండా పాతాళానికి తొక్కుతాయన్నారు. కుక్క కాటుకు చెప్పు దెబ్బలా కాపు సామాజిక వర్గం చంద్రబాబుకి బుద్ధి చెబుతుందన్నారు. ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా చంద్రబాబు, పవన్ కల్యాణ్…
పలు రాష్ట్రాలకు భారీ వర్షసూచన.. లిస్ట్ ఇదే! దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షంతో పాటు వడగండ్లు పడే అవకాశం ఉందని సూచించింది. ఈ మేరకు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు వాతావరణ శాఖ వార్నింగ్ (Warning) ఇచ్చింది. మార్చి 1 నుంచి 3 వరకు భారీ వర్షాలు (Rainfall) కురుస్తాయని పేర్కొంది. జమ్మూకాశ్మీర్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్‌లో భారీ వర్షాలతో పాటు మంచు…