ప్రజ్వల్ కేసులో కర్ణాటక హోంమంత్రి కీలక సూచనలు
సార్వత్రిక ఎన్నికల వేళ కర్ణాటక రాజకీయాలను ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల వ్యవహారం కుదిపేసింది. కర్ణాటక రాష్ట్రాన్నే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన వీడియోలు బయటకు రాగానే.. దర్యాప్తు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ వ్యవహారం బయటకు పడగానే ప్రజ్వల్ విదేశాలకు పారిపోయారు. సిట్ లుకౌట్ నోటీసులు కూడా ఇచ్చింది. తాజాగా ఈ వ్యవహారంపై రాజకీయ పార్టీలు, నేతలకు కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర కీలక సూచనలు చేశారు. కేసు సున్నితత్వం దృష్ట్యా ఎవరూ ఎలాంటి బహిరంగ ప్రకటనలు కానీ, సమాచారం షేర్ చేయడం కానీ చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజల్వ్‌ను వెనక్కి రప్పించేందుకు దర్యాప్తు బృందం సిట్ విదేశాలకు వెళ్లడం లేదని చెప్పారు. అతనికి సంబంధించిన సమాచారాన్ని ఇంటర్ పోల్ పంచుకుంటుందని తెలిపారు.
బైక్‌పై రొమాన్స్ చేస్తూ ఎస్పీకి పట్టుబడ్డ జంట.. వీడియో వైరల్..
ఇటీవల కాలంలో పలు జంటలు బైకుపై నడిరోడ్డు మీద రొమాన్స్ చేసిన వీడియోలు వైరల్‌గా మారాయి. ఇలాంటి అభస్యకరమైన పనుల్ని ప్రజలు చూస్తున్నారనే సోయి లేకుండా ప్రవర్తిస్తున్నారు. తాజాగా మరోసారి ఛత్తీస్‌గఢ్‌లోని జష్‌పూర్‌లో ఇలాంటి ఘటనే ఎదురైంది. బైకుపై ఓ జంట రొమాన్స్ చేసింది. ఈ వీడియో వైరల్‌గా మారింది. కేటీఎం బైకు పెట్రోల్ ట్యాంక్‌పై అమ్మాయి ఎదురుగా కూర్చుని, యువకుడికి ముద్దులు ఇవ్వడం కెమెరాకు చిక్కింది. వీరిని ఎస్పీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు, రైడర్‌కి చలాన్ జారీ చేశారు.
ఉగ్రవాదులు-భద్రతా బలగాల మధ్య దాడులు.. ఏడుగురు పోలీసులు మృతి
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో భద్రతా బలగాలపై జరిగిన రెండు వేర్వేరు ఉగ్రవాదుల దాడుల్లో ఏడుగురు భద్రతా సిబ్బంది మరణించారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ మేరకు ఆదివారం అధికారులు సమాచారం అందించారు. మొదటి దాడిలో ఐదుగురు భద్రతా సిబ్బంది మరణించారని, ఇద్దరు గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉన్న ఉత్తర వజీరిస్థాన్ జిల్లాలోని హసన్ ఖేల్ ప్రాంతంలో శనివారం బాంబు నిర్వీర్య యూనిట్‌ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడి జరిగిందని పాకిస్థాన్ భద్రతా అధికారులు తెలిపారు. పేలుడు జరిగిన అనంతరం.. ఉగ్రవాదులు బలగాలపై కాల్పులు జరిపారని అధికారులు తెలిపారు.
హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన.. జీహెచ్‌ఎంసీ అప్రమత్తం..!
ఆదివారం సాయంత్రం, రాత్రి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) హైదరాబాద్ వాసులకు హెచ్చరికలు జారీ చేసింది. కురుస్తున్న వర్షాల వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు. వర్షం కారణంగా ఏవైనా సమస్యలు తలెత్తితే, సహాయం కోసం పౌరులు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF) 040-21111111 లేదా 9000113667 నంబర్‌లో సంప్రదించాలని కోరారు. దాదాపు రెండు గంటలపాటు కురిసిన భారీ వర్షాలకు 136.8 మిల్లీమీటర్ల వర్షపాతంతో సికింద్రాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. భారత వాతావరణ శాఖ (IMD) – హైదరాబాద్ ప్రకారం , రాబోయే నాలుగు రోజుల్లో హైదరాబాద్ , తెలంగాణలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొనసాగే అవకాశం ఉంది.
కోన వెంకట్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు
ప్రముఖ సినీ రచయిత, ఇటీవలే నిర్మాతగా మారిన కోన వెంకట్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయ్యింది. దళిత యువకుడిపై దాడి చేశారన్న ఆరోపణల నేపథ్యంలో బాపట్ల జిల్లా కర్ల పాలెంలో ఈ కేసు నమోదయ్యింది. కోన వెంకట్ బాబాయి రఘుపతి బాపట్ల ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈసారి మరో సారి బరిలోకి దిగారు. ఇక బాపట్లలో ఒక మండలానికి వైసీపీ ఇంచార్జ్ గా ఉన్నారు కోన వెంకట్. ఇక తాజాగా అదే మండలానికి చెందిన దళిత నేత కత్తి రాజేష్ వైసీపీకి రాజీనామా చేసి శనివారం తన అనుచరులతో కలిసి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేగేశ్న నరేంద్ర వర్మ సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ క్రమంలో రాజేష్ తమ వద్ద రూ.8 లక్షలు అప్పు తీసుకున్నాడు అంటూ వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రాజేష్ ను అదుపులోకి పోలీసులు తీసుకున్నట్టు చెబుతున్నారు.
మెక్సికోలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 6.4గా నమోదు
మెక్సికోలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 6.4గా నమోదైంది. మెక్సికోలోని చియాపాస్ కోస్ట్ సమీపంలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ తెలిపింది. భూకంపం 10 కిమీ (6.21 మైళ్లు) లోతులో సంభవించిందని జీఎఫ్‌జెడ్ తెలిపింది. అప్రమత్తమైన అధికారులు రంగంలోకి దిగి సహాయ చర్యలు చేపట్టారు. ఎంత నష్టం జరిగింది. ఎవరైనా చనిపోయారా? అన్నది ఇంకా తెలియలేదు. భూప్రకంపనలకు ప్రజలు భయాందోళనకు గురైనట్లు తెలుస్తోంది. కుదుపులు చోటుచేసుకోగానే ప్రజలు ఇళ్లలోంచి బయటకు పరుగులు తీసినట్లు సమాచారం.
హే హైదరాబాద్… ఓటేసేందుకు సిద్ధమా..!
రెండు నియోజకవర్గాలు, 75 మంది అభ్యర్థులు, 45.91 లక్షల మంది ఓటర్లు – హైదరాబాద్ నగరంలో అత్యంత విశిష్ట ఘట్టానికి రంగం సిద్ధమైంది. ఎన్నికల అధికారుల కట్టుదిట్టమైన నిఘా మధ్య, పౌరులు సోమవారం తమ ఓట్లు వేసి లోక్‌సభకు తమ ప్రతినిధులను ఎన్నుకుంటారు. పోలింగ్ ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందు, ఆదివారం, నగరం నలుమూలల నుండి పోలింగ్ అధికారులు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (EVMలు) కలిగి ఉన్న తమ పోలింగ్ సామగ్రిని సేకరించడానికి పంపిణీ , రిసెప్షన్ కేంద్రాల (DRCలు) వద్ద క్యూ కట్టారు. పోలీసు రక్షణతో సూర్యాస్తమయం కంటే ముందే తమ తమ పోలింగ్ స్టేషన్‌లకు చేరుకుని, ఈ ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమయ్యేలా సామగ్రిని ఏర్పాటు చేశారు. ఓటింగ్‌ను సులభతరం చేయడానికి, కార్యాలయాలు, విద్యా సంస్థలు, బ్యాంకులు , వ్యాపారాలు ఈరోజు మూసివేయబడతాయి. ఇది సుదీర్ఘ వారాంతంగా పరిగణించబడుతున్నందున, పౌరులు సెలవుల కోసం ఎన్నికలను దాటవేస్తారనే ఆందోళనలు ఉన్నాయి. అయితే, అధిక ఓటింగ్‌ను నమోదు చేసేందుకు ఎన్నికల అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
మాతృదినోత్సవం సందర్భంగా మోడీకి గిఫ్ట్.. థ్యాంక్స్ చెప్పిన ప్రధాని
మాతృదినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీకి ఊహించని బహుమానం దొరికింది. మోడీ మాతృమూర్తి దివంగత హీరాబెన్ చిత్రాన్ని ఆ పార్టీ అభిమానులు ఆయనకు అందించారు. దీంతో ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. మోడీ మాతృమూర్తి దివంగత హీరాబెన్ చిత్రాన్ని ఆ పార్టీ అభిమానులు ఆయనకు అందించారు. దీంతో వారికి మోడీ కృతజ్ఞతలు తెలియజేశారు. పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీలో ఈ అరుదైన సన్నివేశం ఆదివారం చోటుచేసుకుంది.
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకోవాలి..
భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఐదేళ్లకు ఒకసారి జరిగే ప్రజస్వామ్య వేడుకలో ప్రతి ఒక్క ఓటరు పాల్గొని రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణకు, ధృడమైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పాటుకు ప్రశాంత వాతావరణంలో న్యాయంగా, పాదర్శకంగా జరిగే ఎన్నికలు ఎంతో కీలకమని, అటు వంటి ఎన్నికల్లో రాష్ట్రంలోని ఓటర్లు అంతా పాల్గొని ప్రజాస్యామ్య వ్యవస్థను పరిరక్షించు కోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో నేడు జరుగనున్న ఎన్నికల్లో మొత్తం 4,14,01,887 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని, వీరిలో 2,03,39,851 మంది పురుషులు, 2,10,58,615 మంది మహిళలు మరియు 3,421 మంది ట్రాన్స్ జండర్స్ ఉన్నట్లు ఆయన తెలిపారు.
ఠాక్రే, పవార్‌లను పీఎం మోడీ ప్రలోభపెడుతున్నారు..
కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్‌లను ప్రలోభపెట్టేందుకు మోడీ ప్రయత్నిస్తున్నాడంటూ మండిపడ్డారు. దేశంలో నరేంద్రమోడీ మూడోసారి అధికారంలోకి రావడం కష్టమని ఖర్గే శనివారం అన్నారు. ఆర్జేడీకి చెందిన మనోజ్ కుమార్ ఝాతో కలిసి నిన్న బీహార్‌లో ఆయన మాట్లాడారు. ప్రధాని ప్రసంగాల్లో మునుపటి వాడి కనిపించడం లేదని చెప్పారు. మోడీ తెలంగాణ ప్రచారంలో ఉన్న సమయంలో తాను ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నానని, ప్రధాని ప్రసంగాల్లో అభిమానం, గర్వం కనిపించడం లేదని చెప్పారు.