బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై సీఎం చిట్ చాట్.. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడం తథ్యమని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పుడు తన వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు ఖండించినా.. అది ఎప్పటికీ జరుగి తీరుతుందని అన్నారు. విలీనం అయిన వెంటనే కేసీఆర్ కు గవర్నర్ పదవి, కేటీఆర్ కు కేంద్రమంత్రి పదవి వస్తుందని అన్నారు. రాష్ట్రంలో హరీష్ రావు ప్రతిపక్ష నేత అవుతారని అన్నారు. విలీనం,…
తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈనేపథ్యంలో 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కోటలో సీఎం రేవంత్రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జాతీయ జెండా ఎగురవేసి తొలిసారి గోల్కొండ కోట నుంచి జాతిని ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. భారతదేశ ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బ్రిటీషు బానిస సంకెళ్లు తెంచి… స్వేచ్ఛా వాయువులు…
తెలంగాణలో రాజ్యసభ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ జారీ రాష్ట్రంలో రాజ్యసభ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. బీఆర్ఎస్ సభ్యుడు కె.కేశవరావు రాజీనామాతో ఖాళీ ఏర్పడిన సంగతి తెలిసిందే. నేటి నుంచి ఈ నెల 21 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఆగస్టు 27న పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. ఒకవేళ ఎన్నిక అవసరమైతే.. సెప్టెంబర్ 3న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదేరోజు…
ఇన్స్టాగ్రామ్ యువతి ఆత్మహత్య కేసులో ట్విస్ట్.. సూసైడ్ నోట్ రాసిన శ్రీహరి . ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన యువకుడి వేధింపులతో యువతి ఆత్మహత్య కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన యువకుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. తను కూడా ఆమెను ప్రేమించానని.. కానీ తేజస్విని చనిపోయిందని తెలిపాడు. నేను కూడా తనదగ్గరకు వెళుతున్నా అంటూ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యాశాఖపై…
భక్తులకు శుభవార్త.. విష్ణు పుష్కరిణిలో సంకల్ప స్నానాలు చేసే అవకాశం.. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి భక్తులకు ఆలయ నిర్వహాకులు శుభవార్త తెలిపారు. సుమారు పదేళ్ల తర్వాత మళ్లీ కొండపైనున్న విష్ణు పుష్కరిణిలో భక్తులకు సంకల్ప స్నానం ఆచరించే అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. స్వామివారి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రావణ మాసం మొదటి ఆదివారం యాదగిరిగుట్ట దేవస్థానంలో ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య చేతుల మీదుగా అధికారులు విష్ణు పుష్కరిణిలో స్నానమాచరించారు. ఆలయ అధికారులు…
ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి వృథాగా పోతున్న వరద నీరు.. తూర్పు గోదావరి జిల్లాలోని ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి వరద నీరు వృథాగా సముద్రంలో కలిసి పోతుంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు వృథాగా పోయిన 2000 టీఎంసీల వరద నీరుని అధికారులు సముద్రంలోకి రిలీజ్ చేశారు. ప్రస్తుతం బ్యారేజ్ నుంచి నాలుగు లక్షల ఇరవై మూడు వేల క్యూసెక్కుల మిగులు జలాలు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. గత నెల 26వ తారీఖున 13 లక్షల క్యూసెక్కుల వరద…
మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి సంబంధించిన మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇవాళ మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలోని మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ తరగతి గదిలో విద్యార్థి అరుణ్ (19) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీనిపై విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఏబీవీపీ, ఎన్ఎస్యూఐ తదితర విద్యార్థి సంఘాలు కళాశాల వద్ద నిరసన తెలిపాయి. తరగతులు నుంచి బయటకు వచ్చి విద్యార్థులు కూడా కళాశాల వద్దకు చేరుకున్నారు. మరోవైపు…
రేపే క్వాలిఫికేషన్ రౌండ్.. ‘గోల్డ్’ ఆశలు నీరజ్ చోప్రా పైనే! భారత్ నుంచి మరో ప్లేయర్ పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ ఇప్పటి వరకు మూడు పతకాలు మాత్రమే సాధించింది. షూటింగ్లోనే ఆ మూడు పతకాలు దక్కాయి. అయితే ఇప్పటి వరకు ఒక్క గోల్డ్ మెడల్ కూడా భారత్ ఖాతాలో చేరలేదు. దాంతో ఇప్పుడు అందరి ఆశలు టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత, జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రాపైనే ఉన్నాయి. నీరజ్ ఈసారి కూడా…
5న కలెక్టర్ల కాన్ఫరెన్స్.. వీటిపై ఫోకస్ పెట్టిన సీఎం చంద్రబాబు.. ఆంధ్రప్రదేశ్లో నూతనంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి కలెక్టర్ల కాన్ఫరెన్స్కు సిద్ధం అవుతున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ నెల 5వ తేదీన సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.. ఈ సమావేశానికి మంత్రులు హాజరుకానున్నారు.. సచివాలయంలో ఈ నెల ఐదో తేదీన జరిగే కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహణ ఏర్పాట్లపై రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా…