లోకేష్‌పై మంత్రి రోజా ఫైర్.. వైసీపీ నేతలను ఎందుకు చీపుర్లతో కొట్టాలి..? వైసీపీ నేతలు ఓట్లు అడగడానికి వస్తే చీపుర్లతో కొట్టాలంటూ టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన కామెంట్లపై ఘాటుగా స్పందించారు మంత్రి ఆర్కే రోజా.. అసలు వైసీపీ నేతలపై ఎందుకు చీపుర్లు వాడాలని ఆమె ప్రశ్నించారు.. అమ్మఒడి, చేదోడు, ఆసరా వంటి వాగ్దానాలు నెరవేర్చినందుకు? వైసీపీ నేతలపై చీపుర్లు వాడాలా? ఆదర్శప్రాయమైన విద్యా విధానాలు మరియు పథకాలు అమలు చేస్తున్నందుకు చీపుర్లతో కొట్టాలా?…