Centre Issues Advisory To States On Tomato Flu: హ్యాండ్ ఫుట్ అండ్ మౌత్ డీసీజ్(హెచ్ఎఫ్ఎండీ) వ్యాధి సాధారణంగా టొమాటో ఫ్లూగా పిలువబడే ఈ వ్యాధి దేశంలో విస్తరిస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ కేసులు బయటపడ్డాయి. ముఖ్యంగా కేరళ, తమిళనాడు, హర్యానా, ఒడిశా రాష్ట్రాల్లో కేసులు నమోదు అయ్యాయి. దేశంలో తొమ్మిదేళ్ల కన్నా తక్కువ వయసు ఉన్న పిలల్లో 100కు పైగా టొమాటో ఫ్లూ కేసులు నమోదు అయ్యాయని లైవ్ మింట్ నివేదిక వెల్లడించింది.