గత రెండు నెలల క్రితం దేశ వ్యాప్తంగా మంట పుట్టించిన టమాటా.. ఇప్పుడు చవకై పోయింది. కిలో రూ.300కు పలికి చుక్కలు చూపించి.. ఇప్పుడు పాతాళానికి పడిపోయింది. దీంతో రైతన్నలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్ లో టమాటా ధరలు భారీగా పడిపోయాయి. కిలో టమోటా రూ. 2 కూడా పలకడం లేదు.
Tomato Price: ఒకప్పుడు కిలో రూ.300 వరకు పలికిన టమాటా ధరలు ఇప్పుడు మామూలుగా మారాయి. దేశంలో సామాన్యులకు కిలో రూ.30 నుంచి రూ.40కి టమాటా లభిస్తుండడంతో రైతుల టెన్షన్ పెరిగింది.
మొన్నటి వరకు సామాన్యులను ఏడిపించిన టమాటా.. ఇప్పుడు రైతులను ఏడిపిస్తోంది. దాదాపు మూడు నెలల పాటు సాధారణ ప్రజలు వాటిని తినాలంటేనే భయపడ్డారు. కానీ ఇప్పుడు ఆ టమాటాలు కొనే నాథుడు లేక పశువులకు ఆహారంగా మారుతున్నాయి.
గత జూన్, జులై నెలలో టమోటా ధరలు అమాంతంగా పెరిగిన విషయం తెలిసిందే. మునుపెన్నడూ లేని రీతిలో ఏకంగా కిలో టమోటా ధర రూ. 200 దాటింది. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో అయితే కిలో టమోటా రూ. 250 వరకు పలికింది. ఆగస్టు 10 వరకు ఇదే పరిస్థితి నెలకొంది. దాంతో సామాన్య ప్రజలు టమోటా జోలికే పోలేదు. ప్రస్తుతం సీన్ మొత్తం మారిపోయింది. కొండెక్కిన టమాటా ధరలు ఈ 20 రోజుల్లో నేలకు దిగొచ్చాయి.
1KG Tomato Price Was RS 10 in Kurnool on Friday: రెండు నెలలుగా టమాటా ధరలు ఆకాశాన్నంటిన విషయం తెలిసిందే. గత నెలలో కిలో టమాటా ధర రూ. 200 నుంచి 240 వరకు పలికి ఆల్‌టైం రికార్డు క్రియేట్ చేసింది. అయితే పెరిగిన టమాటా ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. వందల ఎకరాల్లో సాగు చేసిన పంట ఒకేసారి చేతికి రావడంతో ధరలు దిగొచ్చాయి. ఆంద్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్‌లో…
Tomato Price Drop: దేశంలో ఇప్పటికీ చాలా చోట్లు టమాటా ధర కిలో రూ.100 చొప్పున టమాటా కొనుగోలు చేస్తున్న ప్రజలకు త్వరలో ఉపశమనం లభించనుంది. త్వరలోనే మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా సెప్టెంబర్ ప్రారంభంలో కొత్త పంట రావడంతో ప్రస్తుత ధరలలో భారీ తగ్గుదల ఉంటుందని భావిస్తున్నారు.
Apple Price Hike: భారీ వర్షాలు, వరదలు, విరిగిపడిన కొండ చరియల కారణంగా హిమాచల్ ప్రదేశ్లో వ్యవసాయం తీవ్రంగా దెబ్బతింది. ఆ రాష్ట్రంలో పండిన పంట సరఫరాలో జాప్యం కారణంగా టమాటాల తర్వాత ఆపిల్ ధరల్లో తీవ్ర పెరుగుదల నమోదైంది. దీంతో టమాటాలు, ఇతర కూరగాయలతో పాటు పండ్ల సరఫరా కూడా దెబ్బతింది.
మదనపల్లె వ్యవసాయ మార్కెట్ యార్డులో టమాట ధరలు భారీగా తగ్గాయి. గ్రేడ్ ‘ఏ’ టమాటాలు కిలో రూ. 50 నుంచి రూ. 64 వరకు పలికింది. గ్రేడ్ ‘బి’ రూ. 36 నుంచి రూ. 48 వరకు పలికింది.