దేశంలో ద్రవ్యోల్బణం కారణంగా కూరగాయల ధరలు మండిపోతున్నాయి. బెండకాయ, పొట్లకాయ, కొత్తిమీర, పచ్చిమిర్చి, క్యాప్సికమ్‌తో సహా అన్ని రకాల ఆకుకూరలు ఇప్పుడు ప్రియం అయ్యాయి. ఇప్పటికీ టమాటా కూడా అత్యధిక ధర పలుకుతోంది.
Onion Price: దేశవ్యాప్తంగా టమాటా ధరలు పెరిగిపోవడంతో సామాన్యుల పరిస్థితి దారుణంగా మారింది. టమాటా ధరలు తగ్గుముఖం పట్టడంతో ప్రస్తుతం ఉల్లి ధర ప్రజలను కంటతడిపెట్టించేందుకు రెడీ అవుతోంది.
Tomato Price: హైదరాబాద్‌లో టమాటా ధరలు ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. గతంలో టమాటా ధరలు కిలో రూ.200కి చేరగా, వారం రోజుల తర్వాత పరిస్థితులు చక్కబడి రూ.140కి లభించాయి.
Tomato Price in Madanapalle Today: వంటింట్లో నిత్యం వాడే ‘టమాటా’ ధరలకు రెక్కలొచ్చిన విషయం తెలిసిందే. గత 40-45 రోజులుగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ టమాటా ధరలు ఆకాశాన్నంటాయి. కొన్ని మార్కెట్‌లలో కిలో టమాటా రూ. 150 నుంచి 200 వరకూ పలుకుతోంది. దీంతో టమాటాలను కొనాలంటే సామాన్య ప్రజలు జడుసుకుంటున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో.. టమాటా ధరలు పెరుగుతున్నాయి కానీ ఏమాత్రం తగ్గట్లేదు. ఈ క్రమంలో మదనపల్లె మార్కెట్‌లో టమాటా ధరలు రికార్డు…
Tomatoes Tulabharam in Anakapalli Nukalamma Temple: సాధారణంగా దేవాలయాల్లో నిలువెత్తు సొత్తుని దేవుడికి సమర్పిస్తారు. బెల్లం, పంచదార లేదా నాణేలతో తులాభారం వేస్తుంటారు. ఇది మన ఆనవాయితీ. అయితే ఇప్పటివరకూ ఎవరూ వేయని ఓ అరుదైన తులాభారం జరిగింది. తన కూతురిపై ఉన్న ప్రేమతో ప్రస్తుతం ఎంతో ఖరీదైన టమాటాలతో తులాభారం వేశారు తల్లిదండ్రులు. తమ కుమార్తెకు నిలువెత్తు టమాటాలతో తులాభారం వేశారు. ఈ ఘటన అనకాపల్లి జిల్లాలో (Tomatoes Tulabharam in AP) చోటుచుకుంది.…
Tomato: దేశంలో ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా టమాటా మోత మోగుతోంది. రోజు రోజుకు వాటి ధర పెరుగుతూనే ఉంది. ప్రభుత్వ గణాంకాలను పరిశీలిస్తే జూన్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.81 శాతంగా ఉంది.
Tomato Price Hike: గత నెల రోజులుగా దేశవ్యాప్తంగా టమాటా ధరలు ఆకాశాన్నంటాయి. చాలా చోట్ల టమాట ధరలు రూ.200 దాటాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం దృష్ట్యా, ఉత్తరాఖండ్‌లోని కొంత భాగానికి చెందిన ప్రజలు తక్కువ ధరకు టమాటాలు కొనుగోలు చేసేందుకు కొన్ని ప్లాన్స్ వేస్తున్నారు.
Tomato: దేశంలో టమాటా రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అయితే కిలో టమాటా రేటు రూ.250కి చేరింది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో టమాటా ధరలు విపరీతంగా ఉన్నాయి. మెట్రో నగరాల్లో అయితే కిలో టమాటా రూ. 150-200 మధ్య పలుకుతోంది. ఈ నేపథ్యంలో టమాటా ధరలకు కళ్లెం వేయాలని కేంద్రం భావిస్తోంది. వినియోగదారుడికి అందుబాటు ధరలో టమాటాను అందించేందుకు సిద్ధమవుతోంది.
Tomato Price: దేశమంతటా విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో టమాటా, ఇతర కూరగాయల ధరలకు ఊరట లభించదన్న స్పష్టమైన సంకేతాలు అందాయి. దీంతో పాటు టమాటా ధర మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.