Tomato Prices Fall Down: మొన్నటి వరకు టమాటాలు కొనుగోలు చేయాలంటేనే సామాన్యులు ఆలోచించాల్సిన పరిస్థితి.. కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.. ఇప్పుడు కొనేవాడు లేడు కదా.. పంట పండించిన రైతుకు గుట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్నాడు.. ఒకానొక సమయంలో కిలో టమాట రూ.300కు చేరువయ్యింది.. ఈ సమయంలో సామాన్యుడి వంటగదిలో టమాట కనిపించడమే మానేసింది.. రైతులకు లాభాలు చూపించింది.. అయితే ఊహించినట్లుగానే ఇప్పుడు భారీగా పతనం అయ్యింది..
Read Also: Vivek Ramaswamy: నేను యూఎస్ ప్రెసిడెంట్ అయితే.. రష్యాకు రామస్వామి బిగ్ ఆఫర్
పలు రాష్ట్రాల్లో కిలో టమాటా ఇప్పటికే రూ.50కి దిగువకు వెళ్లిపోయింది.. హైదరాబాద్ లాంటి సిటీల్లో బహిరంగ మార్కెట్‌లో వంద రూపాయలకు నాలుగు కిలోల వరకు విక్రయిస్తున్నారు.. అదే హోల్‌సెల్ మార్కెట్‌లో అయితే రూ. 15, రూ. 20 దాకా దొరుకుతోంది కూడా. హైదరాబాద్‌లోనూ కేజీ రూ. 20 దాకా పలుకుతోంది. మరోవైపు.. ఈ రోజు హోల్‌సెల్ మార్కెట్‌లో టమాటా ధర భారీగా పడిపోయింది.. టమాటకు పెట్టిన పేరైన మదనపల్లె మార్కెట్ యార్డ్‌లో కేజీ టమాట రూ.8కి దిగివచ్చింది.. దీంతో, గిట్టుబాటు ధర కూడా రావడంలేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు. మొన్నటి వరకు టమాట పండిన రైతులు లక్షాధికారులు, కోటీశ్వరులు అయ్యారు.. ఇప్పుడు మాత్రం గిట్టుబాటు కూడా కావడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు.