Tomato Price Drop: దిగొచ్చిన టమాటా ధర… కేవలం కిలో రూ.30కే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tomato Price Drop: దేశంలో ఇప్పటికీ చాలా చోట్లు టమాటా ధర కిలో రూ.100 చొప్పున టమాటా కొనుగోలు చేస్తున్న ప్రజలకు త్వరలో ఉపశమనం లభించనుంది. త్వరలోనే మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా సెప్టెంబర్ ప్రారంభంలో కొత్త పంట రావడంతో ప్రస్తుత ధరలలో భారీ తగ్గుదల ఉంటుందని భావిస్తున్నారు. నేషనల్ కమోడిటీస్ మేనేజ్మెంట్ సర్వీసెస్ లిమిటెడ్ (ఎన్‌సిఎంఎల్) మేనేజింగ్ డైరెక్టర్, సిఇఒ సంజయ్ గుప్తా ప్రకారం.. ఈ నెలాఖరు నాటికి సరఫరా పెరుగుతుంది కాబట్టి, సెప్టెంబర్ మధ్య నాటికి ధరలు గణనీయంగా తగ్గి కిలో రూ. 30కి చేరుకుంటాయని ఆయన భావిస్తున్నారు.
Also Read
- Koti Deepotsavam 2026 : త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణంతో ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి పారవశ్యం.!
- Ration Cardholders: రేషన్ కార్డుదారులకు శుభవార్త.. డిసెంబర్ 1 నుంచి షాపుల్లో అవి కూడా..
- Ind Vs Nepal: నేపాల్‌పై భారత్-ఏ భారీ విజయం.. 306 పరుగుల తేడాతో వరల్డ్ రికార్డు బద్దలు..
- OTR: రాజమహేంద్రవరం వైసీపీలో వెన్నుపోట్ల కలకలం
దేశవ్యాప్తంగా సగటు టమాటా ధర జూలై 14న క్వింటాల్‌కు రూ.9,671 నుంచి ఆగస్టు 14న రూ.9,195కి తగ్గినట్లు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించిన డేటా ద్వారా తెలుస్తోంది. జూలై మధ్య నాటికి దేశంలోని అనేక ప్రాంతాల్లో టమాటాల రిటైల్ ధరలు కిలో రూ. 250కి చేరుకున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక నుండి తాజా పంట రావడంతో ప్రస్తుతం ధరలు తగ్గి చాలా నగరాల్లో కిలోకు రూ. 80-120గా ఉన్నాయి. ఆగస్టు రెండో వారం నుంచి మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి టమాటాలు మార్కెట్లకు రావడం ప్రారంభమయ్యాయి. టొమాటోలు ఎక్కువగా పండే నాసిక్, కోలార్ ప్రాంతాల నుండి వస్తున్నాయి. రైతులు కూడా కూరగాయల వినియోగాన్ని నిలిపివేసి పట్టణ ప్రాంతాలకు పెద్దఎత్తున సరుకులు పంపుతున్నారు. దీంతో ధరల నియంత్రణకు దోహదపడుతుందని మహారాష్ట్రలోని నారాయణగఢ్ ఝున్ను వ్యవసాయోత్పత్తి మార్కెట్ కమిటీ కార్యదర్శి ప్రియాంక చతుర్వేది తెలిపారు. జూన్, ఆగస్టు మధ్య ఆఫ్-సీజన్లో టమాటాలను ఉత్పత్తి చేసే రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్ణాటక మాత్రమే. జూన్ ప్రారంభంలో అకాల వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్నాయి. దీంతో సాగు తగ్గింది.
Read Also:CJI: కిందిస్థాయి కోర్టుల్లోనూ సాంకేతికత
ఈ రెండు రాష్ట్రాల ఉత్పత్తి దేశ అవసరాలకు సరిపోదు. ఈ నెలాఖరులోగా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఆంధ్రప్రదేశ్ వంటి ఇతర రాష్ట్రాల నుంచి రాక ప్రారంభం కాగానే ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది. అక్టోబర్ నాటికి టమాటా ధరలు భారీగా తగ్గుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అక్టోబరు మధ్య నాటికి హోల్‌సేల్ మార్కెట్లలో కిలో ధర రూ.5-10 తగ్గుతుందని అంచనా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. పెరుగుతున్న ధరలను తగ్గించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్ ఫెడరేషన్ (NCCF), రైతుల సహకార సంస్థ Nafed జూలై మధ్య నుండి ఢిల్లీ NCR, బీహార్, ఉత్తరప్రదేశ్‌తో సహా అనేక ప్రదేశాలలో కిలోకు 70 రూపాయల నుండి 90 రూపాయల వరకు రిటైల్ ధరకు టమాటాలను విక్రయిస్తున్నాయి. సరఫరా పెరగడంతో NCC, Nafed రెండూ ఆగస్టు 14న ధరలను మరింత తగ్గించి కిలోకు రూ.50కి తగ్గించాయి.
తాజావార్తలు
-
OTR : బంగారం, వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి? విలువైన లోహాల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?
-
Warangal Projects : వరంగల్‌కు భారీ ప్రాజెక్టులు.. సీఎం రేవంత్ కీలక సమీక్ష
-
Koti Deepotsavam 2026 : త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణంతో ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి పారవశ్యం.!
-
Telangana Congress : MLA రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వెనుక అసలు కారణమేంటి?
-
Tandoor Congress Rift: తాండూరు కాంగ్రెస్‌లో ఫ్లెక్సీ వార్.. బయటపడ్డ వర్గ విభేదాలు!
ట్రెండింగ్
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!