ఎట్టకేలకు మహేష్ బాబు సినిమాకి సంబంధించిన అప్డేట్ ఇచ్చాడు రాజమౌళి. సినిమా పూజా కార్యక్రమాలు మొదలు ఇప్పటివరకు అసలు సినిమా గురించి ప్రస్తావించని రాజమౌళి ఈ రోజు మహేష్ పుట్టినరోజు సందర్భంగా మాత్రం ఒక పోస్టర్ రిలీజ్ చేశాడు. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ రివీల్ నవంబర్ 2025లో ఉండబోతుందని పేర్కొన్న ఆయన, గ్లోబ్ ట్రాట్టర్ అనే ఒక హ్యాష్ టాగ్ కూడా ఇచ్చారు. ఇక షేర్ చేసిన పోస్టర్‌లో మహేష్ బాబు మెడలో త్రిశూలం, నందితో కూడిన ఒక లాకెట్ ధరించాడు.
Also Read:HBD Mahesh Babu: ఏంటి భయ్యా నిజమేనా.. మన సూపర్ స్టార్ మహేష్ కు 50 ఏళ్లా?
మహేష్ ఛాతీ పిక్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇక మెడ పైనుంచి రక్తం కారుతూ ఉన్నట్టుగా ఉంది. ఫోటో చూసిన తర్వాత సోషల్ మీడియాలో అభిమానులు అయితే హోరెత్తిపోతున్నారు. ఏమీ చూపించకుండా కేవలం ఛాతీ పిక్ మాత్రమే చూపించినా సరే, ఇది బర్త్‌డేకి బెస్ట్ ట్రీట్ అంటున్నారు. ఇక నవంబర్‌లో ఫస్ట్ రివీల్ ఎలా ఉండబోతుందని ఇప్పటినుంచి అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమాని రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తుండగా, కేఎల్ నారాయణ ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్‌తో పాటు ప్రియాంక చోప్రా నటిస్తున్నట్టు ఇప్పటికే క్లారిటీ వచ్చింది.
Also Read:Rahane on Siraj: నాపై కూడా సిరాజ్ సీరియస్ అయ్యాడు..
అలాగే మరొక ఫోటో షేర్ చేసి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులతో పాటు మహేష్ అభిమానులకు అని సంబోధిస్తూ మొదలుపెట్టిన ఆయన, మేము కొద్ది రోజుల క్రితమే షూటింగ్ ప్రారంభించామని, సినిమా గురించి తెలుసుకోవాలని మీ తపన నేను అర్థం చేసుకోగలనని, ఈ సినిమా స్టోరీ కానీ స్కోప్ కానీ చాలా పెద్దదని, అందుకే కొన్ని ఫోటోలు కానీ ప్రెస్ కాన్ఫరెన్స్‌లు కానీ దానికి న్యాయం చేయలేదని భావిస్తున్నానని చెప్పారు. మేము ప్రస్తుతం మీకు ఎంత అద్భుతంగా సినిమాని చూపించాలనే విషయం మీద ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నామని, అలాగే ఫస్ట్ రివీల్ కూడా అంతే అద్భుతంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నామని, కాబట్టి నవంబర్ 2025 వరకు మీరు ఆగక తప్పదని, ఇంతకుముందు ఎప్పుడూ చూడనటువంటి దాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నామని, కాబట్టి కాస్త ఓపిక పట్టాల్సిందే అని జక్కన్న తేల్చేశాడు.
The First Reveal in November 2025… #GlobeTrotter pic.twitter.com/MEtGBNeqfi
— rajamouli ss (@ssrajamouli) August 9, 2025