స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘పుష్ప’. తెలుగు, మలయాళ, తమిళ, కన్నడ, హిందీ బాషల్లో భారీ స్థాయిలో ప్యాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. లేటెస్ట్ గా వచ్చిన టీజర్ తో ఆ అంచనాలు రెట్టింపు అయ్యాయి. రశ్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, ధనుంజయ్ ముఖ్యపాత్రధారులు. ఇక ఈ సినిమాలో మలయాళ స్టార్…
చిరంజీవి ఆ మధ్య తనకు కరోనా వచ్చిందని, తనను కలిసిన వాళ్ళంతా పరీక్షలు చేయించుకోమని ప్రకటించారు. అయితే… ఎలాంటి అనారోగ్య లక్షణాలు రెండు మూడు రోజులైనా కనిపించకపోవడంతో ఆయన మళ్ళీ మరో రెండు చోట్ల టెస్టులు చేయించుకుంటే కరోనా సోకలేదని తెలిసింది. దాంతో తిరిగి ఈ విషయాన్ని జనానికి సోషల్ మీడియా మీద తెలియచేశారు. తాజాగా ఇలాంటి సంఘటనే ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ విషయంలోనూ జరిగింది. సమంత నాయికగా ఆయన దాదాపు ఇరవై రోజులుగా ‘శాకుంతలం’ సినిమాను…
తెలుగమ్మాయి అంజలి ‘వకీల్ సాబ్’తో నిలదొక్కుకున్నట్లేనా!? గతంలో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’తో ఓ వేవ్ లా టాలీవుడ్ ని తాకింది అంజలి. అంతకు ముందు చిన్న చిన్న సినిమాల్లో నటించినా… ఆ సినిమా ఒక్కసారిగా స్టార్ స్టేటస్ తెచ్చిపెట్టింది. అప్పటికే తమిళనాట కూడా స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది అంజలి. అయితే వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులతో కెరీర్ ని సక్సెస్ ఫుల్ గా కొనసాగించలేక పోయింది. మధ్యలో కొన్ని సినిమాల్లో మెరిసినా మునుపటి ఫామ్ అందిపుచ్చుకోలేక…